North Korea Kim Jong Un.. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. ఈ పేరు వింటనే ప్రపంచం ఉలిక్కిపడుతుంది. ఆయన చర్యలు అందరిని భయాందోళనకు గురిచేస్తాయి. ఒకానొక దశలో అగ్రరాజ్యం అమెరికా వర్సెస్ కిమ్ అన్నట్టుగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ తరుణంలో మూడో ప్రపంచ యుద్దం వస్తుందేమోనన్న భావనను తలిపించింది.
ఇదిలా ఉండగా.. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యానికి సంబంధించిన ఓ వార్త ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై ఆయన సోదరి కిమ్ యో జోంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కోవిడ్ వ్యాప్తి సమయంలో తన సోదరుడు కిమ్ ‘అధిక జ్వరం’తో బాధపడ్డారని.. ఆ సమయంలో ఆయన పరిస్థితి విషమించిందని ఆమె వెల్లడించారు. అయినప్పటికీ ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్న ఆందోళనల కారణంగా కిమ్ జోంగ్ ఉన్.. ఒక్క క్షణం కూడా నిద్రపోలేదని ఆమె పేర్కొంది. అయితే, కిమ్ ఎప్పుడు కరోనా బారినపడ్డారన్న విషయం మాత్రం ఆమె వెల్లడించలేదు. ఈ క్రమంలోనే నార్త్ కొరియాలో కరోనా వ్యాప్తిపై తప్పుడు ప్రచారం చేసిన సౌత్ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్ ఇచ్చారు. దక్షిణ కొరియా అధికారులను సర్వనాశనం చేస్తామని సంచలన కామెంట్స్ చేశారు.
మరోవైపు.. గత కొంత కాలంగా కిమ్ జోంగ్ ఆరోగ్య పరిస్థితుల గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అధిక బరువు, ధూమపానం వంటి కారణాలు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై కొన్నేళ్లుగా వదంతులు వ్యాప్తిచెందుతున్నాయి. కాగా కిమ్ కుటుంబానికి గుండె జబ్బుల చరిత్ర ఉంది. దీంతో, ప్రపంచవ్యాప్తంగా కిమ్ ఆరోగ్యంపై వార్తలు బయటకు వస్తుంటాయి.
Kim Jong Un Claims Victory Over COVID-19; His Sister Blames Seoul For Outbreak https://t.co/e9KxZ21Jle
— Finnoexpert (@PophaleSamarth) August 11, 2022
ఇది కూడా చదవండి: లంకలో నిరసనలకు తెర
Comments
Please login to add a commentAdd a comment