
సియోల్: ఉత్తరకొరియా గురువారం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. టోక్యోలో జపాన్–దక్షిణ కొరియా నేతల శిఖరాగ్ర సమ్మేళనం ప్రారంభానికి ముందు ఉ.కొరియా ఈ దుందుడుకు చర్యకు పాల్పడటం గమనార్హం.
ఉత్తరకొరియా ఈ నెలలో జరిపిన మొదటి ఐసీబీఎం ప్రయోగం కాగా, వారం వ్యవధిలో చేపట్టిన మూడో ఆయుధ పరీక్ష ఇది. ప్యాంగ్యాంగ్ సమీపం నుంచి గురువారం ఉదయం ప్రయోగించిన ఈ క్షిపణి సుమారు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి తూర్పువైపు సముద్రజలాల్లో పడిపోయినట్లు దక్షిణ కొరియా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment