ప్యాంగ్ యాంగ్ : ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు తారాస్థాయికి చేరాయి. బుధవారం అతిపెద్ద ఖండాంతర క్షిపణి హాసంగ్-15 పరీక్షతో ఒక్కసారిగా కొరియన్ భూభాగాలు వణికిపోయాయి. ఇప్పటిదాకా కిమ్ సైన్యం ప్రయోగించిన వాటిల్లో అతిపెద్దది, శక్తివంతమైనది ఇదే కావటం విశేషం.
ఉత్తర కొరియా అణ్వాయుధాల పొదిలో ఇప్పటిదాకా ఉన్న క్షిపణులు కేవలం అమెరికా తీర ప్రాంతాలను మాత్రమే చేరగలిగితే.. హాసంగ్-15 మాత్రం వాషింగ్టన్నగరాన్ని చేరి నాశనం చేసే సామర్థ్యం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్యాంగ్‌యాంగ్ అధికారులు కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేశారు. . ఈ మేరకు పరీక్ష విజయవంతం అయ్యాక కిమ్ జొంగ్ ఉన్ అధికారులతో వేడుకలు జరుపుకుంటున్న ఫోటోలను విడుదల చేశారు. సిగరెట్ తాగుతూ కిమ్ విజయ గర్వంతో ఆకాశం వైపు చూస్తున్న ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
క్షిపణి సామర్థ్యం...
నార్త్ కొరియా అణు క్షిపణులలో ఇప్పటిదాకా ఇదే పెద్దది.. ప్రమాదకరమైనది కూడా. చాలా తక్కువ దేశాలు ఈ పరిణామంలో ఇప్పటిదాకా క్షిపణిని తయారు చేశాయని ఉత్తర కొరియా సైన్యం ప్రకటించుకుంది. క్షిపణుల నిపుణుడు మైకేల్ ఎల్లెమన్ ఈ క్షిపణి గురించి 38 నార్త్ బ్లాగ్‌లో వివరాలు తెలియజేశారు. సుమారు 150 కేజీల బరువు(330 పౌండ్లు) ఉన్న హాసంగ్-15 13,000 కిలో మీటర్ల లక్ష్యాన్ని సులువుగా చేధిస్తుంది. వెస్ట్ కోస్ట్ చేరాలంటే బరువులో 500 కేజీలను తగ్గిస్తే చాలూ అని మైకేల్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment