ఉత్తరకొరియా, రష్యా బంధం బలోపేతం
ఉ.కొరియా పర్యటనకు ముందు పుతిన్ వ్యాఖ్య
సియోల్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తరకొరియాలో రెండు రోజుల పర్యటనకుగాను బుధవారం ఉదయం ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమెరికా సారథ్యంలో రష్యా, ఉ.కొరియాలపై కొనసాగుతున్న ఆంక్షలను ఇరుదేశాలు సమష్టిగా ఎదుర్కొంటాయని పుతిన్ ప్రకటించారు. ఉ.కొరియా పర్యట నకు కొద్ది గంటల ముందు ఆయన ఆ దేశ అధికారిక వార్తా సంస్థకు రాసిన వ్యాసంలో పలు అంశాలను ప్రస్తావించారు.
‘‘ ఉక్రెయిన్ విషయంలో మా సైనిక చర్యలను సమర్థిస్తూ, సాయం చేస్తున్న ఉ.కొరి యాకు కృతజ్ఞతలు. బహుళ «ధ్రువ ప్రపంచం సాకారం కాకుండా అవరోధాలు సృష్టిస్తున్న పశ్చిమదేశాలను అడ్డుకుంటాం. పశ్చిమదేశాల చెప్పుచేతల్లో ఉండకుండా సొంత వాణిజ్యం, చెల్లింపుల వ్యవస్థలను రష్యా, ఉ.కొరియాలు అభివృద్ధి చేయనున్నాయి. పర్యాటకం, సాంస్కృతికం, విద్యారంగాలకూ ఈ అభివృద్ధిని విస్తరిస్తాం’’ అని పుతిన్ అన్నారు.
ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ జ్వాలలను మరింత రగిల్చేందుకు కావాల్సిన ఆయుధ సంపత్తిని ఉ.కొరియా సమకూర్చుతుండగా, ఆ దేశానికి అణ్వస్త్ర సామర్థ్యం, క్షిపణుల తయారీ, సాంకేతికతలను రష్యా అందిస్తోందని అమెరికాసహా పశ్చిమ దేశాలు ఆరోపిస్తుండటం తెల్సిందే. ఈ ఆరోపణలను రష్యా, ఉ.కొరియా కొట్టిపారేశాయి. పుతిన్ పర్యటన వేళ ఈ ఆయుధ సాయం, టెక్నాలజీ సాయం మరింత పెచ్చరిల్లే ప్రమాదముందని అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది.
ఉక్రెయిన్‌తో ఆగదు: అమెరికా
‘ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణు లే ఉక్రెయిన్‌ను ధ్వంసంచేస్తున్నాయి. రష్యా, ఉ.కొరియా బంధం దుష్ప్ర భావం ఉక్రెయిన్‌కు మాత్రమే పరిమితం కాబోదు కొరియా ద్వీపకల్పంపై పడు తుంది’ అని అమెరికా ప్రతినిధి జాన్ కిర్బీ ఆందోళన వ్యక్తంచేశారు. ‘మండలి తీర్మానాలు, శాంతి, సుస్థిరతలకు విఘాతం కల్గించే రీతిలో రష్యా, ఉ.కొరియా సహకారం పెరగొద్దు’ అని దక్షిణకొరియా హెచ్చరించింది. చెత్త నింపిన బెలూన్లను ద.కొరియా పైకి ఉ.కొరియా వదలడం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment