ప్యాంగ్‌యాంగ్: కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పొరుగు దేశం దక్షిణ కొరియాను రెచ్చగొట్టే విధంగా నార్త్ కొరియా చర్యలుండటమే ఉద్రిక్తతలకు కారణమవుతోంది. తాజాగా ఆదివారం(జనవరి 28) ఉదయం 8 గంటలకు ఉత్తర కొరియా తన భూభాగంలోని సింప్నో ప్రాంతానికి సమీపంలో ఉన్న సముద్ర జలాల్లోకి క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది.
‘ఆదివారం ఉదయం 8 గంటలకు ఉత్తర కొరియా గుర్తు తెలియని కొన్ని క్రూయిజ్ క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించినట్లు మా ఆర్మీ గుర్తించింది’ అని సౌత్ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కూడా ఉత్తర కొరియా సముద్రంలో ఆర్టిలరీ బాంబులు వేసి ద్వీపకల్పంలో ఉద్రిక్తలకు కారణమైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment