మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదమీర్ పుతిన్..ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కి 24 మేలిమి జాతి గుర్రాల్ని బహుమతిగా ఇచ్చారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తుంది. అయితే ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు తమకు యుద్ధ సామాగ్రిని సరఫరా చేయాలని కొద్ది రోజుల క్రితం పుతిన్.. కిమ్ జోంగ్ ఉన్‌ని కోరారు. పుతిన్ విజ్ఞప్తితో వెను వెంటనే కిమ్ జోంగ్ ఉన్ ఆఘమేఘాల మీద రష్యాకు యుద్ధ సామాగ్రిని పంపించారు. అందుకు ప్రతిఫలంగా పుతిన్.. ఉత్తర కొరియా అధ్యక్షుడికి గుర్రాల్ని బహుకరించినట్లు అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. రష్యా పంపిన గుర్రాల్లో కిమ్‌కు అత్యంత ఇష్టమైన ఓర్లోవ్ ట్రోటర్ జాతికి చెందిన 19 స్టాలియన్లు, ఐదు మరే జాతి గుర్రాలు ఉన్నట్లు టైమ్స్ నివేదించింది.
ఈ ఏడాది జూన్‌లో పుతిన్ ఉత్తర కొరియాలో 24 ఏళ్ల తర్వాత తొలిసారి పర్యటించారు. ఈ పర్యటనలో పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ మధ్య సైనిక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పంగ్సన్ అనే తెల్లటి వేటాడే శునకాలను పుతిన్‌కు కిమ్ గిఫ్ట్‌గా ఇచ్చారు కిమ్. అందుకు.. రష్యా అధ్యక్షుడు కూడా ఆరుస్ లిమోసిన్ కారును బహుకరించారు.ఆ తర్వాత కిమ్‌కు 447 మేకలను ఇచ్చారు. తాజాగా మేలి జాతికి చెందిన గుర్రాలను నియంత కిమ్‌కు బహుమతిగా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment