ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సోషల్ మీడియా డెవలపర్ నిబంధనల్ని ఉల్లంఘించి తమ డేటాను వినియోగిస్తుందంటూ ట్విటర్ సంచలన ఆరోపణలు చేసినట్లు ‘ఏఎఫ్‌పీ’ నివేదిక తెలిపింది.
గతంలో పలు మార్లు నిబంధనల్ని ఉల్లంఘించి మైక్రోసాఫ్ట్ డేటాను సేకరించిందని మస్క్, అటార్నీ అలెక్స్ స్పైరో (మస్క్ తరుపు న్యాయవాది) సంతకంతో కూడిన లెటర్‌ను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు పంపినట్లు తెలుస్తోంది.
చదవండి👉 ‘AI’ వల్ల ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా?.. సత్య నాదెళ్ల ఏమన్నారంటే?
ఆ లెటర్ ఆధారంగా..ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ట్విటర్ నుంచి మైక్రోసాఫ్ట్ డేటా సేకరించడాన్ని నిలిపివేసింది. అయితే అప్పటి వరకు తమ సంస్థ యూజర్ల డేటాను వినియోగించుకున్నందుకు గాను మైక్రోసాఫ్ట్ రుసుము చెల్లించాలని, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ (ఏపీఐ) ఫోరం డెవలపర్ల తరుపున మస్క్ డిమాండ్ చేశారు.
అంతేకాదు రెండేళ్ల నుంచి మైక్రోసాఫ్ట్ ట్విటర్ కంటెంట్‌ను గుర్తించి, నియంత్రించే ప్రయత్నించినట్లు ట్విటర్ ఆరోపించింది. అయితే, ఆ డేటాను ఎక్కడ స్టోర్ చేశారు? స్టోర్ చేసిన డేటాతో ఏం చేశారో? జూన్ 7లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. తాజాగా, ట్విటర్ పంపిన లెటర్‌పై మైక్రోసాఫ్ట్ స్పందించింది. మస్క్ తమకు లెటర్ పంపినట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే, ఆ లెటర్‌పై రివ్యూ జరిపి తగిన విధంగా స్పందిస్తామని, ఆ సంస్థతో తాము సఖ్యతతో ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది.
మైక్రోసాఫ్ట్, గూగుల్‌ను ఎదుర్కొనేలా
మైక్రోసాఫ్ట్ కృత్తిమ మేధ ఆధారిత టూల్ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్‌కు పోటీగా అమెరికాలోని నెవడా రాష్ట్రంలో ఎక్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. పరోక్షంగా చాట్‌జీపీటీని వ్యతిరేకిస్తున్నారు. గత ఏప్రిల్‌లో మైక్రోసాఫ్ట్ చట్ట విరుద్దంగా ట్విటర్ డేటా సాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు శిక్షణ ఇస్తుందని, దావా వేసేందుకు సమయం ఆసన్నమైందని ట్వీట్ చేశారు. కాగా, డెవలపర్ల ఫోరం తరుపున మాట్లాడుతున్న మస్క్.. మైక్రోసాఫ్ట్ నుంచి ఫీజులు వసూలు చేసి తద్వారా ఆదాయాన్ని గడించనున్నారని వెలుగులోకి వచ్చిన రిపోర్ట్‌లు హైలెట్ చేస్తున్నాయి.
చదవండి👉 అమ్మకానికి సుందర్ పిచాయ్ ఇల్లు.. కొనుగోలు చేసిన యాక్టర్.. ఎవరో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment