చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోందా? ప్రధానంగా దిగుమతులపై దాడికి ధోవల్ రెడీ అవుతున్నారా? అనేక విషయాల్లో భారత్‌కు తలనొప్పులు తెస్తున్న చైనాను చావు దెబ్బ కొట్టేందుకు భారత్ సన్నాహాలు చేస్తోందా? ఇంతకూ భారత్ మదిలో ఏముంది? తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
భారత్‌కు దశాబ్దాలుగా పక్కలో బల్లెంలా తయారైనా చైనాకు గట్టి గుణపాఠం చెప్పేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ముఖ్యంగా డోక్లాం వివాదం అనంతరం ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో చైనా దిగుమతుల మీద ఆధాపరపడ్డటం మంచిది కాదన్న అభిప్రాయంతో భారత్ ఉంది. ఇప్పటి వరకూ భారత్ చైనా నుంచి ఎలక్ట్రానిక్, మెడికల్ ఎక్విప్‌మెంట్స్‌ను అధికంగా దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఫార్మాస్యుటికల్స్, వాటి తయారీకి ఉపయోగించే ముడి సరుకు, మెడికల్ ఎక్విప్‌మెంట్స్‌ను అధికంగా భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో వీటి నాణ్యతపై మరిన్ని కఠిన పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం చైనా నుంచి 70 నుంచి 80 శాతం యాక్టివ్ ఫార్మాసుటికల్స్ ఇంగ్రీడియంట్ (ఏపీఐ)లు దిగుమతి అవుతున్నాయి. చైనా నుంచి ఇంత మొత్తంలో ఏపీఐలను దిగుమతి చేసుకోవడం దేశానికి మంచిది కాదని 2014లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రభుత్వానికి సూచించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తెలెత్తితే.. ప్రజారోగ్యం ఇబ్బందుల్లో పడుతుందని అప్పట్లోనే ఆయన చెప్పారు.
ధోవల్ వ్యూహం
అజిత్ ధోవల్ సూచనలతో భారత ప్రభుత్వం మేకిన్ ఇండియాలో భాగంగా ఏపీఐలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం నిపుణులతో కూడిన ఒక కమిటిని ప్రభుత్వం నియమించింది. నిత్యం దేశంమీద విషం కక్కే చైనా నుంచి ఏపీఐలను దిగుమతి చేసుకోవాలనుకోవడం లేదని డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా డీసీజీఐ జీఎన్ సింగ్ అన్నారు. ప్రస్తుతం దేశీయంగా ఉన్న ఔషధ సంస్థలకూ ఏపీఐలను తయారు చేసే లైసెన్స్‌లు ఇస్తే.. మన దగ్గరే నాణ్యమైన వస్తువులు, మందులు తయారవుతాయని అన్నారు. ఇప్పటివరకూ ఉన్న డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ చట్టాల్లో పలు మార్పులు చేసేందుకు ప్రభుత్వం ప్రాణాళికలు సిద్ధం చేస్తోందని జీఎన్ సింగ్ తెలిపారు.
ధరలు తగ్గే అవకాశం
ఏపీఐలను చైనా నుంచి భారత్‌కు దిగుమతి చేసుకోవడం కన్నా.. వాటిని ఇక్కడే రూపొందిచుకుంటే.. ధరల్లో 15 నుంచి 20 శాతం తగ్గుతాయని ఇండియన్ ఫార్సాస్యుటికల్స్ అలయన్స్ సెక్రెటరీ జనరల్ డీజీ షా తెలిపారు. ప్రస్తుతం చైనా నుంచి చేసుకునే దిగుమతులపై సుంకాన్ని మరింతగా పెంచితే.. దేశీయంగా ఇప్పటికే ఉన్న ఏపీఐలతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment