అజిత్ దోవల్
న్యూఢిల్లీ: భారత్‌తో తాము అస్సలు రాజీపడబోమని చైనా మరోసారి స్పష్టం చేసింది. డోక్లామ్ విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకునేది లేదని, తమ భూభాగంలో నుంచి తమ సైన్యాన్ని వెనక్కి ఎలా తీసుకుంటామని ప్రశ్నించింది. ఈ మేరకు షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో అంతర్జాతీయ సంబంధాలపై పరిశోధకుడిగా పనిచేస్తున్న హు జియాంగ్ గ్లోబల్ టైమ్స్ కథనంలో వెల్లడించారు.
బ్రిక్స్ సదస్సులో భాగంగా జరుగుతున్న జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి భారత్ సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్ వెళ్లడాన్ని ఉటంకిస్తూ ఇక చైనా రాజీపడుతుందని భారత్ మీడియాలో కథనాలు వస్తున్నాయని అలాంటిది జరగబోదని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఊహాగానాలకు తెరదించాలని ఆయన పేర్కొన్నారు. ’చైనా నిర్ణయం మారదు. భారత ప్రభుత్వం, మీడియా మేం రాజీపడతామంటూ చూస్తున్న ఊహాగానాలను వదిలేస్తే మంచిది’ అని ఆయన అన్నారు.