సాక్షి, హైదరాబాద్: దేశంలో ఫార్మా రంగానికి కీలకమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్ (ఏపీఐ) విషయంలో స్వావలంబన సాధించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఏపీఐల విషయంలో ఇప్పటివరకు మనదేశం చైనా పై అధికంగా ఆధారపడుతోంది. అయితే కరో నా కష్టకాలంలో చైనా నుంచి ముడిసరుకులు, ఏపీఐలు తేవడంలో ఇబ్బందులు ఏర్పడటం తో ప్రభుత్వం సొంతంగా తయారు చేసుకుం టేనే మేలన్న అంచనాకు వచ్చింది. ఈ నిర్ణయాన్ని అమల్లో పెట్టేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) లాక్సాఐ ఇంటర్నేషనల్ అనే దేశీ కంపెనీతో జత కట్టిం ది. ముందుగా కరోనా వైరస్ చికిత్సకు ఐఐసీటీ అభివృద్ధి చేస్తున్న మందు తయారీ కోసం రెండు కంపెనీలూ పనిచేయనున్నాయి.
యుమిఫెనోవిర్, రెమిడెస్‌విర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లను కూడా ఈ భాగస్వామ్యంలో తయారు చేయనున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మలేరియా చికిత్సకు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు భారత్ ఈ మందు తయారు చేసేందుకు కూడా చైనా సరఫరా చేసే రసాయనాలపై ఆధారపడుతోంది. ఐఐసీటీ, లాక్సాఐల భాగస్వామ్యం కారణంగా ఇకపై ఈ మందులు సొంతంగా, చౌకగా తయారు చేసుకోవచ్చునని అంచనా. ఏపీఐలతోపాటు ఫార్మా రంగానికి కీలకమైన మరిన్ని రసాయనాలను సొంతంగా అభివృద్ధి చేయడం ఈ భాగస్వామ్యపు లక్ష్యం. 2007లో ఏర్పాటైన లాక్సాఐ ఇంటర్నేషనల్ కొత్త కొత్త రసాయనాలను గుర్తించడంతోపాటు ప్రపంచస్థాయి కంపెనీలకు విక్రయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment