indian institute of chemical technology
-
ఐఐసీటీ డైరెక్టర్‌గా డి.శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) నూతన డైరెక్టర్‌గా డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఐఐసీటీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహి స్తున్న ఎన్జీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ వీఎం తివారీ నుంచి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 2020 నుంచి జమ్ములోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ డైరెక్టర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి, ఫిబ్రవరి నుంచి లక్నోలోని సీఎస్ఐ ఆర్ సంస్థ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరె క్టర్గానూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐఐసీటీ డైరెక్టర్‌గా నియమితు లైన నేపథ్యంలో ఆయన మిగిలిన రెండు సంస్థలకు అదనపు డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. మెడిసినల్ కెమిస్ట్రీలో అపారమైన అనుభవం.. ఉస్మానియా వర్సిటీలో పట్టభద్రుడైన శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో 2000లో సింథ టిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ చేశారు. తరువాత షికాగో కాన్సస్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ పరిశోధనలు చేశారు. 2003లో అడ్వినస్ థెరప్యూ టిక్స్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీల్లో కొంతకాలం పని చేసి 2010లో పుణేలోని నేషనల్ కెమికల్ లేబొరేటరీలో చేరారు. మెడిసినల్ కెమిస్ట్రీ, ఔషధ ఆవిష్కరణల్లో శ్రీనివాస రెడ్డికి 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పటివరకు సుమారు 120 పరిశోధన వ్యాసాలను ప్రచురించారు. పంటల పరిశోధన రం గంలోనూ కృషి చేశారు. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుతో పాటు జేసీ బోస్ ఫెలోషిప్ కూడా అందుకున్న శ్రీనివాస్‌రెడ్డి ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో సభ్యులు -
నాలుగు వారాల్లో వైరస్‌కు మందులు!
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్సకు ఇంకో నాలుగు వారాల్లో మందులు అందుబాటులోకి రానున్నాయా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా చికిత్స కోసం రెమిడెస్విర్, ఫావిపిరావిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లు ఉపయోగపడతాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) కొన్ని నెలల కిందటే గుర్తించింది. వీటిల్లో రెమిడెస్విర్, ఫావిపిరావిర్‌పై దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలైన సిప్లా, గ్లెన్‌మార్క్‌లు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాయి. ఈ మందులను ఉపయోగించిన 100 మంది రోగుల్లో కనీసం 60–70 శాతం మంది పరిస్థితి మెరుగు కాగా, మిగిలిన వారిలో పెద్దగా దుష్ఫలితాలు కనిపించలేదు. వైరస్ సోకిన తొలినాళ్లలో లేదా తేలికపాటి నుంచి ఓ మోస్తరు లక్షణాలు మాత్రమే ఉన్న రోగులకు ఫావిపిరావిర్, మధ్యమ స్థాయి నుంచి తీవ్ర లక్షణాలు ఉన్న వారికి రెమిడెస్విర్ వాడటం మంచిదన్న అంచనా బలపడింది. ఫావిపిరావిర్‌ను జపాన్‌లో సుమారు 70 వేల మంది రోగులకు అందించి సత్ఫలితాలు రాబట్టారని, రష్యాలోనూ దీని వాడకానికి అనుమతులు లభించాయని ఓ శాస్త్రవేత్త తెలిపారు. భారత్‌లో ఫావిపిరావిర్‌తో పాటు రెమిడెస్‌విర్‌పై ముందుగా 50 మందిపై ప్రయోగాలు జరిగాయని, ఆ తర్వాత దీన్ని 150కు పెంచారని గత నెల 24న ప్రయోగ ఫలితాలను డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు అందించడం పూర్తయిందని వివరించారు. ఈ రెండు మందులను ఇప్పటివరకు భారత ప్రజలు ఎప్పుడూ వాడని కారణంగా డ్రగ్ కంట్రోలర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారని, మరింత మంది భారతీయులకు ఈ మందులు ఇచ్చి ఫలితాల సమాచారం ఇవ్వాలని సూచిస్తోంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో త్వరలోనే అను మతులు లభించే అవకాశం ఉందని అంచనా. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో నెలలో 2 మందులకూ అనుమతులు లభించనున్నాయి. ఆ వెంటనే ఆయా కంపెనీలు మందులను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. సాధారణ ప్రజలకు ఈ మందులు ఇచ్చిన తర్వాత కూడా వాటి సమర్థత, దుష్ప్రభావాలపై పరీక్షలు జరుగుతాయి. అంతేకాకుండా.. రెండు కంపెనీలు ఉత్పత్తి చేసిన మందులు ఒకే రీతిగా ఉన్నాయా.. లేదా అన్న దానిపై తుది అనుమతుల జారీ ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఆలస్యం.. నిజానికి కరోనా చికిత్సకు మందులు అభివృద్ధి చేసేందుకు భారత్ అందరి కంటే ముందుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇతర వ్యాధుల కోసం అభివృద్ధి చేసి.. అర్ధంతరంగా ప్రయోగాలను నిలిపేసిన వందలాది మందులను హైదరాబాద్‌లోని ఐఐసీటీ స్క్రీన్ చేసి పని చేస్తాయనుకున్న మూడింటిని వేరు చేసింది. ఎబోలా వైరస్ కోసం అమెరికన్ కంపెనీ గిలియాడ్ అభివృద్ధి చేసిన రెమిడెస్విర్, సాధారణ జలుబు కోసం జపనీస్ కంపెనీ తయారు చేసిన ఫావిపిరావిర్‌తో పాటు మలేరియా చికిత్సకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లు కరోనా చికిత్సకూ ఉపయోగపడతాయని ఐఐసీటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ సమయంలోనే సిప్లా ఓ అడుగు ముందుకేసి ఆ మందులను తయారు చేసి ఇస్తే తాము వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేస్తామని ఫార్మా కంపెనీ సిప్లా ముందుకొచ్చింది. అయితే మానవ ప్రయోగాల దశకు చేరుకునేటప్పటికి వివిధ కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైంది. భారత్‌లోని రోగులపై ప్రయోగించడం ద్వారా మాత్రమే వాటి పనితీరును మదింపు చేయాలని డ్రగ్ కంట్రోలర్ నిర్ణయించడం దీనికి ఒక కారణం. ఇందుకు తగ్గట్టుగా సిప్లాతోపాటు గ్లెన్‌మార్క్ కూడా మొత్తం ఏడు ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే కరోనా రోగులతో వైద్యులు క్షణం తీరికలేని పరిస్థితులు ఏర్పడటం.. ఈ మందులను రోగులకు ఇచ్చి వాటి ఫలితాలను, సమాచారాన్ని నమోదు చేసే అవకాశం లేకపోవడంతో ఆలస్యమైంది. కొత్త మందులను ఉపయోగించేందుకు రోగులు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరకు రెండు కంపెనీలు వేర్వేరుగా నిర్వహించిన ప్రయోగాల సమాచారాన్ని జోడించి డ్రగ్ కంట్రోలర్‌కు అందించారు. డ్రగ్ కంట్రోలర్ ఈ సమాచారాన్ని విశ్లేషించి అనుమతులిస్తే కరోనాపై పోరులో కొత్త అధ్యాయం మొదలైనట్లే. -
చేతులు కలిపిన ఐఐసీటీ, లాక్సాఐ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఫార్మా రంగానికి కీలకమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్ (ఏపీఐ) విషయంలో స్వావలంబన సాధించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఏపీఐల విషయంలో ఇప్పటివరకు మనదేశం చైనా పై అధికంగా ఆధారపడుతోంది. అయితే కరో నా కష్టకాలంలో చైనా నుంచి ముడిసరుకులు, ఏపీఐలు తేవడంలో ఇబ్బందులు ఏర్పడటం తో ప్రభుత్వం సొంతంగా తయారు చేసుకుం టేనే మేలన్న అంచనాకు వచ్చింది. ఈ నిర్ణయాన్ని అమల్లో పెట్టేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) లాక్సాఐ ఇంటర్నేషనల్ అనే దేశీ కంపెనీతో జత కట్టిం ది. ముందుగా కరోనా వైరస్ చికిత్సకు ఐఐసీటీ అభివృద్ధి చేస్తున్న మందు తయారీ కోసం రెండు కంపెనీలూ పనిచేయనున్నాయి. యుమిఫెనోవిర్, రెమిడెస్విర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లను కూడా ఈ భాగస్వామ్యంలో తయారు చేయనున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మలేరియా చికిత్సకు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు భారత్ ఈ మందు తయారు చేసేందుకు కూడా చైనా సరఫరా చేసే రసాయనాలపై ఆధారపడుతోంది. ఐఐసీటీ, లాక్సాఐల భాగస్వామ్యం కారణంగా ఇకపై ఈ మందులు సొంతంగా, చౌకగా తయారు చేసుకోవచ్చునని అంచనా. ఏపీఐలతోపాటు ఫార్మా రంగానికి కీలకమైన మరిన్ని రసాయనాలను సొంతంగా అభివృద్ధి చేయడం ఈ భాగస్వామ్యపు లక్ష్యం. 2007లో ఏర్పాటైన లాక్సాఐ ఇంటర్నేషనల్ కొత్త కొత్త రసాయనాలను గుర్తించడంతోపాటు ప్రపంచస్థాయి కంపెనీలకు విక్రయిస్తోంది. -
ఆ కంపెనీలవైపు రాష్ట్రం చూపు!
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో చైనా నుంచి తమ కార్యకలాపాలను ఇతర దేశాలకు తరలించేందుకు పలు బహుళ జాతి కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. చైనా నుంచి వెనక్కి మళ్లుతున్న కంపెనీలను ఆకర్షించేందుకు మలేసియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక మౌలిక వసతుల పరంగా ముందంజలో ఉన్న తెలంగాణకు ఈ కంపెనీలను రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైజెస్, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రానికి ఉన్న అనుకూలతలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాల ని ప్రభుత్వం నిర్ణయించింది. చైనాపై ఆధారపడుతున్న భారత్... చైనా నుంచి 75% మేర వైద్య ఉపకరణాలు, 40% ఫార్మా రంగానికి సంబంధించిన ముడి పదార్థాలు, టెక్స్‌టైల్స్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుంటోం ది. ఔషధాల ఉత్పత్తిపరంగా ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో ఉన్నా, వాటి తయారీలో అవసరమయ్యే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్(ఏపీఐ), ఇంటర్మీడియేట్ల కోసం చైనాపై ఆధారపడుతోంది. కరోనా సంక్షోభం మూలంగా ఏపీఐ ధరల పెరుగుదల, రవాణా లో జాప్యంతో ఔషధ డిమాండ్‌కు అనుగుణం గా ఫార్మా రంగం ఉత్పత్తి చేయలేకపోతోంది. దేశీయంగానే ముడిపదార్థాల తయారీ... ఔషధాల ఉత్పత్తిలో అవసరమయ్యే ముడి పదార్థాల కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ దేశీయంగా బల్క్ డ్రగ్ తయారీని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఔషధ తయారీ రంగానికి చిరునామాగా ఉన్న తెలంగాణ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశీయ ఔషధ తయారీ పరిశ్రమకు అవసరమైన ఏపీఐ, ఇంటర్మీడియేట్ల తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల తయారీకి హైదరాబాద్‌కు చెందిన సమీకృత ఔషధ తయారీ కంపెనీ లక్సాయ్ లైఫ్‌సైన్సెస్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) నడుమ కుదిరిన తాజా ఒప్పందం రాష్ట్రం అనుసరించే భవిష్యత్ వ్యూహానికి అద్దం పడుతోంది. మౌలిక వసతులపై దృష్టి... హైదరాబాద్ ఫార్మా సిటీ, మెడికల్ డివైజెస్ పార్కు, ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు తదితర పారిశ్రామిక మౌలిక వసతులు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నాయి. చైనా నుంచి వెనక్కి మళ్లుతున్న కంపెనీలను భారత్‌కు రప్పించేందుకు జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న ఇండస్ట్రియల్ క్లస్టర్లను గుర్తించే ప్రక్రియలో ఉన్నట్లు తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. తొలి విడతలో హైదరాబాద్–వరంగల్‌తో పాటు మరో రెండు ఇండస్ట్రియల్ క్లస్టర్లలో మౌలిక వసతులపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. -
ఐఐసీటీలో ఏపీఐల తయారీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషదాల తయారీలో అతిముఖ్యమైన యాక్టివ్ ఫార్మాసూటికల్స్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ), ఇతరత్రా ముడిపదార్థాలను హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ ఫార్మాసూటికల్ కంపెనీ లాక్సాయ్ లైఫ్ సైన్సెస్ మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రణలో వినియోగిస్తున్న వుమిఫెనోవిర్, రెమిడిసివిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ) వంటి ఔషదాల తయారీ మీద దృష్టిపెడతామని ఐఐసీటీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఐఐసీటీలో మాత్రం ఆయా ఔషదాల మాలిక్యుల్స్, లాక్సాయ్‌లో ఫార్ములేషన్స్, డ్రగ్స్ తయారవుతాయని ఐఐసీటీ ప్రతినిధి ఒకరు తెలిపారు. లాక్సాయ్‌కు హైదరాబాద్‌లో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) అనుమతి పొందిన ఏపీఐ తయారీ కేంద్రాలున్నాయి. గతంలో ఎబోలా వైరస్ రోగులకు అందించిన రెమ్డిసివిర్ డ్రగ్‌ను ప్రస్తుతం కరోనా చికిత్స కోసం సమర్థవంతంగా పని చేస్తుందని, ఈ మేరకు డ్రగ్ పనితీరు, భద్రత అంశాలను అంచనా వేయడానికి క్లినికల్ ట్రయల్స్‌జరుగుతున్నాయని ఐఐసీటీ తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం ఏపీఐల కోసం చైనా మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా మన దేశంలోనే బల్క్ డ్రగ్ తయారీని ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం తెలిసిందే. -
6 నెలల్లో ఔషధం..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తోపాటు ఇతర వైరస్‌లకూ చెక్‌పెట్టే దిశగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), దేశీయ ఫార్మా దిగ్గజం సిప్లా వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాయి. కరోనా వైరస్‌కు విరుగుడుగా పనిచేయగలవన్న ప్రాథమిక అంచనాకు వచ్చిన మూడు మందులను తయారు చేసేందుకు ఇరు సంస్థలు చేతులు కలిపాయి. రెమిడెస్విర్, బెలాక్సివిర్, ఫెవిపిరవిర్ అనే మూడు రసాయనాలు వైరస్‌లను నిరోధించేందుకు సమర్థంగా ఉపయోగపడతాయని ఐఐసీటీ శాస్త్రవేత్తలు గుర్తించగా.. వాటిని పారిశ్రామిక స్థాయిలో తయారు చేసి ఇస్తే తాము మాత్రలు తయారు చేసి అందరికీ అందుబాటులోకి తెస్తామని సిప్లా కంపెనీ ప్రతిపాదించింది. (మరో ముగ్గురికీ కరోనా) ఈ మూడు మందులపై ఒకట్రెండు క్లినికల్ ట్రయల్స్ ఇప్పటికే పూర్తయ్యాయని, వేర్వేరు కారణాల వల్ల మార్కెట్లోకి రాని వాటిని అత్యవసర పరిస్థితుల్లో నేరుగా ఉపయోగించే అవకాశం ఉండటం విశేషమని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. రెమిడెస్‌విర్‌ను గిలియాడ్ అనే ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసిందని, జపనీస్ కంపెనీ అభివృద్ధి చేసిన ఫెవిపిరవిర్పై పేటెంట్ హక్కులు కూడా లేవని ఆయన తెలిపారు. రెమిడెస్‌విర్‌పై చైనా ఇప్పటికే వెయ్యి మంది రోగులతో ప్రయోగాలు నిర్వహించిందని గుర్తుచేశారు. క్లినికల్ ట్రయల్స్ ముగిసిన తరువాత వేర్వేరు కారణాల వల్ల పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయని మందులను నిశితంగా పరిశీలించడం ద్వారా తాము ఈ మూడు మందులను కరోనాతోపాటు ఇతర వైరస్‌లను ఎదుర్కొనేందుకు ఉపయోగించవచ్చన్న అంచనాకు వచ్చామని చెప్పారు. (14 రోజులు ఇంట్లోనే ఉండండి) సిప్లా అధినేత డాక్టర్ హమీద్ మంగళవారం ఐఐసీటీకి మెయిల్ పంపుతూ ఈ మందులను ఎలాంటి షరతుల్లేకుండా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారని, ఇందుకు తగ్గట్లుగా తాము వాటిని ఆరు నుంచి ఎనిమిది వారాల్లో రెండు మందులను (రెమిడిస్‌విర్, ఫెవిపిరవిర్) కావాల్సినంత మోతాదులో తయారు చేసి సిప్లాకు అందిస్తామని ఆయన వివరించారు. ఆ తరువాత కొన్ని ప్రభుత్వ అనుమతులతో వీలైనంత వేగంగా వాటిని అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. అన్నీ సవ్యంగా జరిగితే 6 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావొచ్చన్నారు. ఈ మందుల తయారీకి కావాల్సిన అన్ని రకాల రసాయనాలు ఐఐసీటీలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 1980లలో హెచ్ఐవీ/ఎయిడ్స్ ప్రపంచాన్ని కబళిస్తున్న సమయంలో ఐఐసీటీ, సిప్లా అత్యంత చౌకగా యాంటీ రెట్రో వైరల్ మందులను అభివృద్ధి చేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. పిచికారీ మందు తయారీ సులువే... కరోనా వైరస్‌కు విరుగుడుగా బహరంగ ప్రదేశాల్లో పిచికారీ చేసేందుకు వీలైన మందుపై ఐఐసీటీ మదింపు చేసిందని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ (రెండు శాతం గాఢత), పెరాసిటిక్ యాసిడ్ (0.2 శాతం గాఢత)లను నీటితో కలిపి పిచికారీ చేస్తే అన్ని రకాల ఉపరితలాలపై ఉండే వైరస్లు ఎనిమిది నుంచి పది నిమిషాల్లో నశించిపోతాయని చెప్పారు. దీంతోపాటు కరోనా వైరస్ ఉనికిని నిర్ధారించే కిట్లలో కీలకమైన ఎంజైమ్ (రివర్స్ ట్రాన్స్‌స్క్రిప్టేస్) ఉత్పత్తిని ఐఐసీటీ చేపట్టిందని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ వైరాలజీ (ఎన్ఐవీ) వద్ద ఉన్న ప్రైమర్‌తో కలిపి దీన్ని వ్యాధి నిర్ధారణ కిట్లలో ఉపయోగిస్తారని ఆయన తెలిపారు. (జాగ్రత్త పడకపోతే.. వినాశనమే ) మనమూ తయారు చేయొచ్చు ఆరుబయట.. ఉపరితలాలపై ఉండే కరోనా వైరస్‌ను చంపేయాలని అనుకుంటున్నారా? మీకు కావాల్సిందల్లా హైడ్రోజన్ పెరాక్సైడ్, పెరాసిటిక్ యాసిడ్ రసాయనాలే. హైడ్రోజన్ పెరాక్సైడ్ మార్కెట్లో రెండు గాఢతల్లో లభిస్తుంది. 4% గాఢత ఉన్న దాన్ని వాడే పక్షంలో ప్రతి లీటర్ నీటికి ఆరు ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడాలి. ఇది కాకుండా 30% గాఢత ఉన్న దాన్ని వాడుతున్నట్లయితే ఒక లీటర్ నీటికి 0.82 ఎంఎల్ వాడాలి. ఇక పెరాసిటిక్ యాసిడ్ విషయానికి వస్తే దీన్ని ప్రతి లీటర్‌కు 0.42 ఎంఎల్ చొప్పున వాడా ల్సి ఉంటుంది. మొత్తమ్మీద చూస్తే ఒక లీటర్ నీరు తీసుకొని దానికి 6 ఎంఎల్ (4% గాఢత) హైడ్రోజన్ పెరాక్సైడ్, 0.42 ఎంఎల్ పెరాసిటిక్ యాసిడ్ కలిపి కావాల్సిన చోట పిచికారీ చేసుకోవాలి. ఈ మందుతో వైరస్ లేవైనా 10 నిమిషాల్లో నాశన మవుతాయని ఐఐసీటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (భారత్‌లో మూడో మరణం ) -
అంతర్జాతీయ శాస్త్రవేత్తగా కూలీ కుమారుడు
సాక్షి, కొత్తగూడ(వరంగల్) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడమే నామోషీగా భావించే రోజులివి. అలాంటిది మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవడమే కాదు.. తండ్రి కన్నుమూయడం.. తల్లి కూలీ పనులు చేస్తుండడాన్ని చూస్తూ పెరిగిన ఆ విద్యార్థి నేడు అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తగా ఎదిగాడు. స్కాలర్షిప్ ద్వారా వస్తున్న డబ్బును పొదుపుగా వాడుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న కొత్తగూడ మండల కేంద్రానికి వెలుసోజు విజయ్.. గెలుపు నేపథ్యంపై ప్రత్యేక కథనం. చిన్నతనంలోనే తండ్రి మృతి కొత్తగూడ మండల కేంద్రానికి చెందిన వెలుసోజు రాములు – సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు అనిల్, విజయ్‌తో పాటు ఓ కుమార్తె సంధ్యారాణి ఉన్నారు. వీరి చిన్నతనంలోనే తండ్రి రాములు మద్యానికి బానిపై మృత్యువాత పడ్డారు. రాములు ఉన్నంత వరకు కుల వృత్తి అయిన వడ్రంగి పని చేసేవాడు. ఆయన మృతి చెందాక ఇతర ఉపాధి మార్గాలేమీ లేక కుటుంబం మొత్తం దిక్కుతోచని స్థితి ఎదుర్కొంది. ఇక ముగ్గురు పిల్లలను పోషించాల్సిన తల్లి సుజాతకు వ్యవసాయ పనులు రాకపోగా సెంట్ భూమి కూడా లేదు. దీంతో పిల్లలకు చదువు చెప్పించడం ఏమో కానీ పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టడం కూడా భారమైంది. ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమె ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో కూరగాయలు కోసేందుకు సాధారణ రోజువారీ కూలీ(కాంటింజెంట్ వర్కర్)గా చేరింది. డబ్బు ఎంతొచ్చినా పర్వాలేదు.. అక్కడి నుంచే అన్నం తీసుకెళ్లి పిల్లల కడుపు నింపేది. పిల్లల భవిష్యత్ కోసం తల్లి పడే తపన, రాత్రుళ్లు కార్చే కన్నీరు చిన్న కుమారుడు విజయ్‌లో పట్టుదలను పెంచాయి. ఎలాగైనా ఉన్నత స్థాయికి చేరాలని అప్పట్లో భావించాడు. ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్‌గా... ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుకునే స్థోమత లేదని గుర్తించి విజయ్.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూనే కార్పొరేట్ వ్యవస్థతో పోటీ పడాలనుకున్నాడు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కొత్తగూడ ప్రాథమికోన్నత పాఠశాలలో పాఠశాల టాపర్‌గా నిలిచాడు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుకుని మండల టాపర్‌గా నిలిచాడు. ఇంటర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్తగూడలో కళాశాల టాపర్‌గా నిలిచాడు. ఇక హైదరాబాద్‌లోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, ఐఐటీ మద్రాస్‌లో మాస్టర్స్ కెమిస్ట్రీ పూర్తి చేసి అక్కడా టాపర్‌గా నిలిచి తాను అనుకున్నది సాధించాడు. ఇవన్ని మొత్తం స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి పూర్తిచేయడం విశేషం. ఈ మేరకు విజయ్‌లోని ప్రతిభను గుర్తించిన ఆస్ట్రేలియాలోని రాయల్ మెల్బోర్న్ యూనివర్సిటీ వారు పీహెచ్‌డీలో సీటు ఇచ్చి డాక్టరేట్ ప్రదానం చేశారు. మొక్కల నుంచి పెట్రోల్, డీజిల్ తయారీ ఆస్ట్రేలియాలో పీహెచ్డీ పట్టా అందుకున్న సందర్భంలో.. పీహెచ్డీ పూర్తయ్యాక విజయ్ హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో రెండేళ్ల పాటు రీసెర్చ్ చేశారు. ఈ సమయంలో అంతర్జాతీయ సదస్సుల్లో డెమో ఇచ్చి మెప్పించారు. విజయ్ ప్రతిభను గుర్తించిన జర్మనీలోని లుయాబిన్జ్ – డాడ్ రీసెర్చ్ ఫెలో ఇన్స్టిట్యూట్ ఫర్ డ్యాటనిసిస్ రోస్టక్ వారు జూనియర్ సైంటిస్ట్‌గా చేర్చుకున్నారు. ఈ ఇన్స్టిట్యూట్లో కార్బన్‌డైఆక్సెడ్ నుంచి ఇంధనం తయారీపై ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల్లో విజయ్ పాల్గొంటున్నారు. ఇక ఇటీవల మలేషియాలో జరిగిన 8వ ఆసియా పసిఫిక్ కాంగ్రెస్ ఆన్ డ్యాటనసిస్(ఎపీసీఏటీ–8) లో తన గళం వినిపించారు. దీంతో పాటు మరో 20 అంతర్జాతీయ సదస్సుల్లో తాను చేస్తున్న రీసెర్చ్ వివరాలు వినిపించారు. -
తక్కువ ధరకు కేన్సర్ మందు
- అందుబాటులోకి తెచ్చేందుకు ఐఐసీటీ యత్నం హైదరాబాద్: పలు రకాల కేన్సర్లను సమర్థంగా నయం చేయగల ఓ మందును పేదలకూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అన్నీ సవ్యంగా సాగితే మరో రెండేళ్లలో ఈ మందును ప్రస్తుత ధరలో మూడో వంతుకే అందించవచ్చునని ఐఐసీటీ డెరైక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. రసాయన పరిశోధనల రంగంలో సహజ వనరుల ఉపయోగం తీరుతెన్నులపై సోమవారం ఐఐసీటీలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కేన్సర్ చికిత్సకు సంబంధించి ఐఐసీటీ రెండు ఉత్పత్తులపై పనిచేస్తోందని, వేప నుంచి సేకరించిన నింబొలాయిడ్ అనే రసాయన మూలకంపై పేటెంట్ కూడా సాధించామని తెలిపారు. సముద్రపు స్పాంజ్ నుంచి సేకరించిన హీలోకాండ్రియన్ అనే మూలకంతో జపనీస్ ఫార్మా కంపెనీ ఒకటి రకరకాల కేన్సర్లకు విరుగుడు మందును తయారు చేసిందని, అయితే ఇది చాలా ఖరీదైందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ఆ మందుపై 2018 నాటికి పేటెంట్ హక్కులు చెల్లిపోతాయి కాబట్టి ఆ వెంటనే దీన్ని అందరికీ అందుబాటు ధరలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జపనీస్ కంపెనీ మందుకు ఇప్పటికే అన్ని అనుమతులు ఉన్నందున తాము అభివృద్ది చేసే మందుకు క్లినికల్ ట్రయల్స్ అవసరముండదని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెడాక్విలిన్ను సరికొత్త పద్దతి ద్వారా చౌకగా తయారు చేసేందుకూ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. పైకప్పులకు చల్లటి పెయింట్... ఇళ్లలో ఉష్ణోగ్రతలను మూడు నుంచి ఎనిమిది డిగ్రీల వరకూ తగ్గించగలిగే సామర్థ్యమున్న వినూత్న రసాయనాన్ని తాము అభివృద్ది చేశామని, మరికొన్ని పరీక్షలు నిర్వహించిన తరువాత దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఐఐసీటీ డెరైక్టర్ తెలిపారు. పరిశోధన శాలలో జరిపిన ప్రయోగాల్లో ఈ రసాయనం సమర్థంగా పనిచేసిందని, నిజజీవిత పరిస్థితుల్లోనూ దీని పనితీరును మదింపు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. కాంక్రీట్ పైకప్పులతో మాత్రమే కాకుండా... పేదలు ఎక్కువగా వాడే అల్యూమినియం, ఆస్బెస్టాస్ షీట్లతోనూ ఇది బాగా పనిచేస్తుందని, కేవలం అర మిల్లీమీటర్ మందపు పూతతో ఇంటిలోపలి ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించవచ్చునని చెప్పారు. -
పరిశోధనలతోనే ప్రగతి
గెస్ట్ కాలమ్ దేశ ప్రగతికి పరిశోధనలు తప్పనిసరి. ప్రధానంగా సమాజ అవసరాలు, ప్రయోజనాల దిశగాఆవిష్కరణలు చేసే సైన్స్ రంగంలో రీసెర్చ్ కార్యకలాపాలు మరింత పెరగాలి. అరచేతిలో ఇమిడిపోతున్న మొబైల్ ఫోన్ నుంచి అంతరిక్షంలో అడుగుపెట్టే రాకెట్ ప్రయోగాల దాకా.. అన్నీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ఆవిష్కృతమైనవే’ అంటున్నారు.. శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్-2014 గ్రహీత, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (హైదరాబాద్) ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. వెంకట మోహన్. పరిశోధనల్లో రెండు దశాబ్దాలకుపైగా అనుభవం ఉన్న ఆయన... వ్యర్థాల నుంచి జీవ ఇంధన వనరుల ఆవిష్కరణల కోసం కృషి చేశారు. దీనికి గుర్తింపుగా దేశంలో ఇంజనీరింగ్ సెన్సైస్‌లో అత్యున్నత పురస్కారంగా, సైన్స్‌లో భారతదేశ నోబెల్ బహుమతిగా భావించే ‘శాంతి స్వరూప్ భట్నాగర్’ అవార్డ్‌కు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో డాక్టర్ ఎస్.వెంకట మోహన్‌తో ఇంటర్వ్యూ.. కృషికి తగ్గ గుర్తింపు నా పరిశోధనలకు గుర్తింపుగా నేషనల్ బయోసైన్స్ అవార్డ్ (2012), యునెటైడ్ నేషన్స్ యూనివర్సిటీ అండ్ ఎల్సెవియర్ అందించే యంగ్ రీసెర్చర్ అవార్డ్ తదితర జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఎన్నో లభించాయి. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్‌కు ఎంపికవడం మాత్రం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇంటర్ డిసిప్లినరీతో.. ఇంటిగ్రేటెడ్ నైపుణ్యాలు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఉంటే మరిన్ని నైపుణ్యాలు, అవకాశాలు సొంతమవుతాయి. ఉదాహరణకు సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్‌లోనూ నైపుణ్యం పొందితే బహుళ ప్రయోజనాలు లభిస్తాయి. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్‌లో బయో ఇంజనీరింగ్ చదివితే పర్యావరణ కాలుష్య సమస్యల పరిష్కారానికి అవసరమైన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి కోర్సుల స్వరూపంలోనే ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఇమిడి ఉండేలా కరిక్యులం రూపొందించాలి. సైన్స్.. ఆసక్తి ఉంటే అద్భుతాల సృష్టికి మార్గం సైన్స్ కోర్సుల్లో చేరితే కెరీర్లో స్థిరపడేందుకు సుదీర్ఘ కాలం వేచి చూడాలనే ఆలోచనలో నేటి యువత ఉన్నారు. కోర్సులు పూర్తవగానే కెరీర్ సెటిల్మెంట్నే లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. ఇందులో తప్పు లేదు. కానీ సైన్స్ రంగంలో అనేక అవకాశాలున్నాయని గుర్తించాలి. ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా సైన్స్ కోర్సులవైపు యువత ఆకర్షితులయ్యేలా, పరిశోధనల దిశగా అడుగులు వేసేందుకు ఇన్స్పైర్ స్కాలర్షిప్స్ తదితర అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. అంతేకాకుండా పీహెచ్డీ స్థాయిలో అందించే ఫెలోషిప్, స్కాలర్షిప్ మొత్తాలను కూడా పెంచింది. కాబట్టి విద్యార్థులకు సైన్స్ పట్ల, సైన్స కోర్సులతో అందివచ్చే అవకాశాల గురించి అవగాహన కల్పించడంపై దృష్టిపెట్టాలి. కొంతమంది విద్యార్థులకు సైన్స అంటే ఆసక్తి ఉన్నప్పటికీ అవకాశాలు గురించి తెలియక వేరే కోర్సుల్లో చేరుతున్నారు. వాస్తవానికి ఇతర విభాగాలతో పోల్చితే సామాజిక అవసరాలకు, దైనందిన జీవితంలో వినియోగించే అనేక వస్తువులు ఆవిష్కృతమైంది సైన్స్ పరిశోధనల ద్వారానే! దీన్ని గమనించి ఆసక్తితో అడుగులు వేస్తే అద్భుతాలు సృష్టించేందుకు సైన్స్‌లో అవకాశాలెన్నో!! బోధనలో ప్రాక్టికాలిటీ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి కలిగించే విషయంలో పాఠశాల స్థాయి నుంచే మార్పు రావాలి. ఈ దిశగా ఉపాధ్యాయులు కూడా కీలక పాత్ర పోషించాలి. విద్యార్థుల ఆసక్తిని గమనించి, భవిష్యత్తు అవకాశాల గురించి తెలియజేస్తూ ప్రోత్సహించాలి. ఇందుకు చక్కటి మార్గం.. బోధనలో ప్రాక్టికల్ అప్రోచ్‌కు ప్రాధాన్యమివ్వడం. దీని ద్వారా ప్రతి విద్యార్థిలోని సహజ ఆసక్తులు, అభిరుచులు వెలుగులోకి వస్తాయి. ఫలితంగా సదరు విద్యార్థి భవిష్యత్తులో రాణించగల రంగం ఏంటో తెలుస్తుంది. ఆ మేరకు వారికి మార్గనిర్దేశనం చేసే వీలు లభిస్తుంది. యూనివర్సిటీల స్థాయిలో దేశంలో ఇప్పుడు అనేక ఇన్స్టిట్యూట్లు ఆర్ అండ్ డీ కార్యకలాపాల పెంపుదల దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, వాస్తవ అవసరాలతో పోల్చితే ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. కాబట్టి అన్ని స్థాయిల్లో, అన్ని యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లలో ఆర్ అండ్ డీకి ప్రోత్సాహం దిశగా చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు, రీసెర్చ్ ఓరియెంటెడ్ సంస్థల్లో నిధులు, మౌలిక సదుపాయాల పరంగా ఆకర్షణీయ ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. స్టేట్ యూనివర్సిటీల్లోనూ ఈ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్న ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీలు పరిశ్రమ వర్గాలతో ఒప్పందాల ద్వారా స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ నిర్వహించే దిశగా కృషి చేయాలి. అంతేకాకుండా రీసెర్చ్ ఓరియెంటెడ్ ఇన్స్టిట్యూట్ల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉంది. నిత్యాన్వేషణే.. నైపుణ్యాలకు మార్గం సైన్స్ కోర్సుల్లో అద్భుత నైపుణ్యాల సాధనకు నిత్యం అన్వేషించే దృక్పథంతో ముందుకు సాగాలి. అనునిత్యం మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తుండాలి. పుస్తకంలో చదువుకున్న అంశం.. వాస్తవ పరిస్థితుల్లో, నిజ జీవితంలో ఉపయోగపడుతున్న తీరుపై అవగాహన పొందాలి. సైన్స్‌లో ఇలాంటి తులనాత్మక అధ్యయనం ఎంతో అవసరం. మనం వినియోగించే ప్రతి వస్తువు ఆవిష్కరణ వెనుక సైన్స్ భావనలు ఇమిడి ఉంటాయి. గృహోపకరణాల ఆవిష్కరణలకైనా.. గ్రహాంతర ప్రయోగాలకైనా మూలం సైన్స్‌లోనే ఉంది. అభిరుచికి అనుగుణంగా అడుగులు నేటి విద్యార్థులు తమ అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా ఉన్నత విద్య, కెరీర్ పరంగా అడుగులు వేయాలి. ఇంటర్మీడియెట్ స్థాయిలోనే దీనికి పునాదులు వేసుకోవాలి. ఈ క్రమంలో తల్లిదండ్రుల సహకారం, తోడ్పాటు కూడా ఎంతో అవసరం. సైన్స్ రంగాన్ని కెరీర్‌గా ఎంపిక చేసుకునే విద్యార్థులు నిత్య నూతనంగా వ్యవహరించాలి. ఏ దశలోనూ నిరుత్సాహానికి గురి కాకూడదు. చేపట్టిన ప్రతి పరిశోధన లేదా ప్రాజెక్ట్ విజయం సాధించాలనుకోకూడదు. ఇప్పుడు మనం ఆస్వాదిస్తున్న ఎన్నో సదుపాయాలు, సౌకర్యాల వెనుక ఎందరో శాస్త్రవేత్తల ఏళ్ల తరబడి శ్రమ ఉంది. వారంతా ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొన్నాకే విజయం సాధించారు. కాబట్టి.. నిరుత్సాహం, నిస్పృహ అనే మాటలకు చోటు లేకుండా వ్యవహరిస్తే కచ్చితంగా భవిష్యత్తులో వ్యక్తిగత, వృత్తిపరమైన సంతృప్తి లభించడం ఖాయం. అంతేకాకుండా తమ పరిశోధనలు సమాజానికి మేలు చేస్తాయి అనే సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి. ఉన్నత విద్య అంటే పీజీ మాత్రమే అనే ఆలోచన వదిలి పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ డిగ్రీలు కూడా ఉన్నాయని గుర్తిస్తే అద్భుత అవకాశాలు అందుకోవచ్చు!! -
మహారాష్ర్ట నూతన ముఖ్యమంత్రి ఎవరు?
1. 2014 సంవత్సరానికి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుకు ఎంపికైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైద రాబాద్‌కు చెందిన శాస్త్రవేత్త? 1) ఎస్. ప్రభాకర్ 2) ఎం.శ్రీధర్ 3) ఎస్. వెంకట మోహన్ 4) టి. వెంకటేశ్వర్ రావు 2. 2014 నవంబర్ 2న 56 బంతుల్లో సెంచరీ సాధించి టెస్టుల్లో వేగవంతమైన సెంచరీ రికార్డును సమం చేసిన పాకిస్థాన్ బ్యాట్స్ మన్? 1) యూనిస్‌ఖాన్ 2) మిస్బా ఉల్ హక్ 3) అజహర్ అలీ 4) షాహిద్ అఫ్రిదీ 3. 2014 నవంబర్ 1 నుంచి ఏటీఎంల ఉచిత లావాదేవీలపై పరిమితిని ఎన్ని మెట్రో నగరాల్లో విధించారు? 1) 4 2) 5 3) 6 4) 8 4. 2014 అక్టోబర్ 31న మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? 1) ఏక్నాథ్ ఖాడ్సే 2) ప్రకాశ్ మెహతా 3) చంద్రకాంత్ పాటిల్ 4) దేవేంద్ర ఫడ్నవిస్ 5. ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మిం టన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు? (ఫైనల్ గుజరాత్లో 2014 నవంబర్ 2న జరిగింది) 1) రుత్విక శివానీ 2) రితుపర్ణ దాస్ 3) మేఘన 4) మనీషా 6. 2014 నవంబర్ 2న న్యూఢిల్లీలో నిర్వహించిన పోటీలో దులీప్ ట్రోఫీ క్రికెట్‌ను కైవసం చేసుకున్న జట్టు? 1) సౌత్ జోన్ 2) సెంట్రల్ జోన్ 3) నార్త జోన్ 4) వెస్ట్ జోన్ 7. 2014 పారిస్ మాస్టర్స సిరీస్ టెన్నిస్ టైటిల్ ను ఎవరు సాధించారు? 1) మిలోస్ రావ్‌నిక్ 2) రోజర్ ఫెదరర్ 3) నొవాక్ జొకోవిచ్ 4) డేవిడ్ ఫై్ 8. 2014 నవంబర్ 7 నుంచి 28 వరకు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను ఏ దేశంలో నిర్వహించనున్నారు? 1) భారత్ 2) నార్వే 3) బల్గేరియా 4) రష్యా 9. ఇటీవల మరణించిన గ్యారీ బెకర్ ఏ దేశానికి చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త? 1) జర్మనీ 2) ఫ్రాన్స 3) అమెరికా 4) కెనడా 10. ‘రీ డిజైనింగ్ ది ఏరోప్లేన్ వైల్ ఫ్లైయింగ్ - రిఫార్మింగ్ ఇన్‌స్టిట్యూషన్‌స’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? 1) అరుణ్ మైరా 2) సంజయ్ బారు 3) పి.సి. పారఖ్ 4) ఎ.జి. నూరానీ 11. భారతదేశంలో బ్యాంకుల బోర్డుల పాలన తీరును సమీక్షించాల్సిందిగా కోరుతూ భారతీయ రిజర్వు బ్యాంకు నియమించిన కమిటీకి అధ్యక్షత వహించింది? 1) నచికేత్ మోర్ 2) పి.జె. నాయక్ 3) ఆనంద్ సిన్హా 4) శ్యామలా గోపినాథ్ 12. ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక దళానికి సారథ్యం వహించిన తొలి మహిళ ఎవరు? 1) వఫా ఖలేద్ మౌమార్ 2) క్రిస్టీన్ లండ్ 3) లక్ష్మీ పూరి 4) నికోల్ కిడ్మన్ 13. సండే టైమ్స్ యూకే సూపర్ రిచ్ వార్షిక జాబితా ప్రకారం బ్రిటన్ సంపన్నుల జాబి తాలో అగ్రస్థానం సాధించింది? 1) హిందూజా సోదరులు 2) లక్ష్మీ మిట్టల్ 3) లార్డ స్వరాజ్ పాల్ 4) ప్రకాశ్ లోహియా 14. సండే టైమ్స్ యూకే సూపర్ రిచ్ వార్షిక జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యధి కంగా బిలియనీర్లు ఉన్న నగరం? 1) మాస్కో 2) న్యూయార్క 3) శాన్ఫ్రాన్సిస్కో 4) లండన్ 15. ఫోర్బ్స మ్యాగజైన్ రూపొందించిన ప్రపం చంలోనే అత్యంత ఖరీదైన ఇళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన అంటీలియా ఎవరి నివాస గృహం? 1) బిల్ గేట్స్ 2) లక్ష్మీ మిట్టల్ 3) ముకేష్ అంబానీ 4) లిల్లీ సాఫ్రా 16. హాకీలో భారత్ ఇప్పటివరకు ఒకే ఒక్కసారి ప్రపంచకప్ గెలిచింది. ఏ సంవత్సరంలో ఈ ఘనత సాధించింది? 1) 1975 2) 1979 3) 1983 4) 2010 17. {పపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన యాంబియెంట్ ఎయిర్ పొల్యూషన్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ఎక్కువ వాయు కాలుష్య నగరం? 1) బీజింగ్ 2) హాంగ్‌కాంగ్ 3) షాంఘై 4) ఢిల్లీ 18. జల్లికట్టు అనే ఎద్దుల క్రీడను ఇటీవల సుప్రీంకోర్టు నిషేధించింది. ఇది ఏ రాష్ట్రంలో సంప్రదాయిక క్రీడ? 1) కర్ణాటక 2) మహారాష్ట్ర 3) తమిళనాడు 4) ఆంధ్రప్రదేశ్ 19. చెన్నై రైలు పేలుళ్ల ఘటనలో మృతి చెందిన అమ్మాయి పేరు మీద దక్షిణ రైల్వే ఏటా ఏ రోజున ‘స్వాతి డే’గా జరపాలని తల పెట్టింది? 1) మే నెల తొలి పనిదినం 2) జూన్ తొలి పనిదినం 3) మే ఒకటో తేదీ 4) జూన్ ఒకటో తేదీ 20. 2014 మే 13న దక్షిణ మధ్య రైల్వే మొట్ట మొదటి డబుల్ డెక్కర్ రైలును ఏ స్టేషన్ల మధ్య ప్రారంభించింది? 1) సికింద్రాబాద్ - విశాఖపట్నం 2) కాచిగూడ - గుంటూరు 3) కాచిగూడ - తిరుపతి 4) సికింద్రాబాద్ - వరంగల్ 21. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బియాండ్ విజువల్ రేంజ్ (బీవీ ఆర్) గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించే క్షిపణి? 1) అస్త్ర 2) ఆకాశ్ 3) అగ్ని - 1 4) అగ్ని - 5 22. కేంద్ర జలసంఘం (సెంట్రల్ వాటర్ కమి షన్) చైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితు లయ్యారు? 1) సి.కె. అగర్వాల్ 2) ఎ.బి. పాండ్య 3) ఎ. మహేంద్రన్ 4) నరేంద్ర కుమార్ 23. లంచాలు స్వీకరించాడన్న ఆరోపణలతో జైలుశిక్ష అనుభవిస్తున్న ఇజ్రాయెల్ మాజీ ప్రధాని? 1) యూరీ ఓర్బాచ్ 2) యాకోవ్ పెరీ 3) ఎయిర్ షమీర్ 4) ఎహుద్ అల్మర్ట 24. {పపంచంలో కెల్లా ఎత్తయిన ఆకాశ సౌధం ‘కింగ్డమ్ టవర్’ను ఏ దేశంలో నిర్మిస్తున్నారు? 1) యూకే 2) యూఎస్ఏ 3) సౌదీ అరేబియా 4) యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ 25. 2014 వరల్డ్ టీమ్ టేబుల్ టెన్నిస్ ఛాంపి యన్‌షిప్‌లో పురుషుల టైటిల్‌ను ఏ దేశం సాధించింది? 1) చైనా 2) జర్మనీ 3) జపాన్ 4) ఆస్ట్రియా 26. ప్రణాళికా సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1) 1952 2) 1951 3) 1950 4) 1949 27. ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? 1) వియన్నా 2) రోమ్ 3) జెనీవా 4) వాషింగ్టన్ డీసీ 28. ‘క్యాడ్డీ’ అనే పదాన్ని ఏ క్రీడలో ఉపయో గిస్తారు? 1) బిలియర్డ్స 2) గోల్ఫ్ 3) ఫుట్‌బాల్ 4) వాలీబాల్ 29. {పపంచకప్ పురుషుల హాకీ పోటీలను 2018 లో ఏ దేశం నిర్వహిస్తుంది? 1) నెదర్లాండ్స 2) ఆస్ట్రేలియా 3) భారత్ 4) మలేషియా 30. రెండు వరుస పార్లమెంట్ సమావేశాల మధ్య విరామ సమయం ఎన్ని నెలలకు మించకూడదు? 1) 3 2) 6 3) 4 4) 2 31. {Mొయేషియా దేశ రాజధాని? 1) బెల్గ్రేడ్ 2) ప్రేగ్ 3) జాగ్రెబ్ 4) రీగా 32. భారత రాజ్యాంగంలోని ఏప్రకరణ జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తోంది? 1) 360 2) 370 3) 365 4) 330 33. అచానక్మర్ శాంక్చ్యురీ ఏ రాష్ట్రంలో ఉంది? 1) మధ్యప్రదేశ్ 2) ఒడిషా 3) ఉత్తరప్రదేశ్ 4) ఛత్తీస్‌గఢ్ 34. గోల్డెన్ రెవల్యూషన్ దేనికి సంబంధిం చింది? 1) పండ్ల ఉత్పత్తి 2) కోడిగుడ్ల ఉత్పత్తి 3) మాంసం ఉత్పత్తి 4) ఎరువుల ఉత్పత్తి 35. జాతీయ ఐక్యతా దినంగా ఏ రోజును పాటిస్తారు? 1) అక్టోబర్ 30 2) అక్టోబర్ 24 3) అక్టోబర్ 31 4) అక్టోబర్ 28 సమాధానాలు 1) 3; 2) 2; 3) 3; 4) 4; 5) 1; 6) 2; 7) 3; 8) 4; 9) 3; 10) 1; 11) 2; 12) 2; 13) 1; 14) 4; 15) 3; 16) 1; 17) 4; 18) 3; 19) 1; 20) 2; 21) 1; 22) 2; 23) 4; 24) 3; 25) 1; 26) 3; 27) 4; 28) 2; 29) 3; 30) 2; 31) 3; 32) 2; 33) 4; 34) 1; 35) 3. -
దేశాభివృద్ధిలో యూనివర్సిటీలదే కీలక పాత్ర
ఐఐసీటీ డెరైక్టర్ లక్ష్మీకాంతం ఘనంగా మహిళా వ ర్సిటీ స్నాతకోత్సవం యూనివర్సిటీ క్యాంపస్ : దేశాభివృద్ధిలో యూనివర్సిటీలదే కీలకపాత్రని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (హైదరాబాద్) డెరైక్టర్ ఎం.లక్ష్మీకాంతం అన్నారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బుధవారం 15వ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి గవర్నర్ హాజ రు కాలేదు. దీంతో వీసీ రత్నకుమారి చాన్సలర్ హోదాలో డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గౌరవ డాక్టరేట్ అందుకున్న లక్ష్మీకాంతం స్నాతకోపన్యాసంచేశారు. ప్రస్తుతం మనదేశంలో అపారమైన జ్ఞానసంపద ఉందన్నారు. ఎంతోమంది మేధావులు ఉన్నప్పటికీ వారిజ్ఞానం సమాజానికి, దేశానికి ఉపయోగించుకోలేక పోతున్నామన్నారు. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మ్యాన్‌ఫ్యాక్చరింగ్, మేనేజ్మెంట్స్కిల్స్ తోడైతే అద్భుతాలు చోటు చేసుకుంటాయన్నారు. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు దేశాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన మానవ సంపదను తయారు చేయాలన్నా రు. సమాజంలోని సమస్యలను పరిష్కరించే దిశగా విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేయాలని కోరారు. ఇవన్నీ జరగాలంటే విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందాలన్నా రు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, వసతులు, పరిశోధన పరికరాలు అందించినప్పుడే అవి నాణ్యమైన విద్యను అందించగలవన్నారు. గొప్ప మహిళలను ప్రతి మహి ళ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో మహిళల పాత్ర పెంచడం ద్వారా మహిళా సాధికారత సాధించవచ్చన్నారు. అయితే ప్రస్తుతం ఈ రంగంలో మహిళలపై వేధింపులు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎంతోమంది మహిళలను విద్యావంతులను చేసి సమాజానికి అందిస్తోందన్నారు. విద్యార్థినుల సందడి నాలుగు సంవత్సరాల తర్వాత స్నాతకోత్సవం జరగడంతో వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థినులు వారి కుటుంబ సభ్యులతో వచ్చారు. స్నాతకోత్సవం ముగిశాక పాతమిత్రులను కలసి ముచ్చట్లు చెప్పుకుంటూ సందడి చేశారు. కఠిన శ్రమతోనే విజయం విద్యార్థులు తమ రంగంలో విజయం సాధించాలంటే కఠిన శ్రమ తప్ప వేరే ప్రత్యామ్నాయాలు లేవన్నారు. విద్యార్థులు మొదట స్పష్టమైన, బలమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు కొత్త విషయాలను తెలుసుకోవాలని, కఠిన శ్రమతో సాధన చేస్తే విజయం సాధించగలరని చెప్పారు. వీసీ రత్నకుమారి తన ప్రసంగంలో విశ్వవిద్యాలయం సాధించిన ప్రగతిని వివరించారు. 1948 మందికి డిగ్రీలు స్నాతకోత్సవంలో 1948 మందికి డిగ్రీలు ప్రదానం చేశా రు. 71 మందికి బంగారుపతకాలు, 13 బుక్‌ప్రైజ్‌లు, 13 మందికి నగదు బహుమతులు, 117 మందికి పీహెచ్‌డీలు, 15 మందికి ఎంఫిల్ డిగ్రీలు, 986 మందికి పీజీలు, 588 మందికి డిగ్రీలు, 242 మందికి దూరవిద్యా డిగ్రీలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎం.విజయలక్ష్మి, డీన్లు ఎంవీ. రమణమ్మ, ఈ.మంజు పాల్గొన్నారు. -
సూపర్ పవర్ కంట్రీగా భారత్
అద్దంకి : సూర్యుని వెలుగులు పది నుంచి పన్నెండు గంటలు నిర్విరామంగా విరజిమ్మే భారతదేశం ప్రపంచంలోనే సూపర్ పవర్ కంట్రీగా నిలుస్తుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థకు చెందిన పరిశోధకుడు డాక్టర్ ఎల్ గిరిబాబు అన్నారు. స్థానిక కట్టారామకోటేశ్వరావు డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ‘రీసెంట్ టెక్నాలజీస్ ఆఫ్ కెమిస్ట్రీ’ అనే అంశంపై శనివారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన తను ఆవిష్కరించిన ‘గ్రీన్ సోలార్ పవర్ ప్రాజెక్టు’ ఉపయోగాల గురించి వీడియో చిత్రాల ద్వారా తెలియజేశారు. ఈ సదస్సులో మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్నాటక, తెలంగాణ నుంచి వచ్చిన 200 మంది తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్ విల్సన్ రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ తక్కువ ధరలో నాణ్యమైన విద్యుత్‌ను తయారు చేసుకునే వాటిల్లో ‘ఆర్గానిక్ సోలార్ సెల్’ పద్ధతి ఒకటన్నారు. ఈ పద్ధతిలో సిలికాన్ ప్యానల్స్‌కు బదులు తక్కువ ధరలో లభించే పదార్థాలతో నాణ్యమైన పరికరాలను తయారు చేయడం, అదీ నానో టెక్నాలజీలో తయారు చేయడం విశేషమని చెప్పారు. ఈ సోలార్ ప్యానెల్ ట్యూబ్‌లైట్ వెలుగు నుంచి కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు. అనంతరం కాలుష్యరహిత ఉత్ప్రేరకాల తయారీపై డాక్టర్ ఎన్ లింగయ్య, చక్కెరల కర్బన లోహశక్తి గురించి రాజీవ్ త్రివేది, పైరబోలిక్ ఉత్పన్నాల తయారీ గురించి ఐఐసీటీ హైదరాబాదుకు చెందిన డాక్టర్ రవి, గ్రీన్ సాల్వెంట్స్ గురించి ఐఐటీ చెన్నైకి చెందిన డాక్టర్ రమేష్, నానో పెస్టిసైడ్స్ గురించి గీతం యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఎన్వీఎస్ వేణుగోపాల్ సవివరంగా విశదీకరించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు శ్రీనివాసరెడ్డి ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. పాల్గొన్న వారికి మెమొంటోలు, ప్రశంసా పత్రాలు కళాశాల ప్రిన్సిపాల్ విల్సన్ రాజు అందజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ జీ రాజేశ్వరి, కళాశాల పీడీ ధనుంజయ, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. -
మేధోవలసకు నేతల నిర్లక్ష్యమే కారణం
ఐఐసీటీ సభలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సాక్షి, హైదరాబాద్: భారత్‌లో నైపుణ్యానికి కొరత లేకున్నా.. దాన్ని గుర్తించి మెరుగులు దిద్ది జాతి నిర్మాణంలో భాగం చేసే విషయంలో మాత్రం పార్టీలకతీతంగా నేతలు నిర్లక్ష్యం వహించారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే యువత విదేశాల బాటపడుతోందన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్రమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏడు దశాబ్దాల కాలంలో ఐఐసీటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా వ్యవసాయం, ఫార్మా, ఆరోగ్య రంగాలకు వెలకట్టలేని సేవలందించారని కొనియాడారు. మేధోవలసపై వెంకయ్య మాట్లాడుతూ యువతీ యువకులు విదేశాలకు వెళ్లడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాకపోతే అక్కడకు వెళ్లి నేర్చుకుని, నాలుగు రాళ్లు సంపాదించుకుని మళ్లీ మాతృదేశానికి తిరిగి రావాలని మాత్రమే తాను ఆశిస్తున్నానన్నారు. తాను డాక్టర్‌ను, యాక్టర్‌ను కాదని, ట్రాక్టర్ నడిపే ఓ రైతు కొడుకును మాత్రమేనని చతురోక్తులు విసిరారు వెంకయ్య. ఐఐసీటీ ఏడు దశాబ్దాలుగా రసాయన శాస్త్ర పరిశోధనల ద్వారా దేశ సేవ చేస్తోం దని ఐఐసీటీ డెరైక్టర్ లక్ష్మీ కాంతం తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ఐఆర్ డీజీ పీఎస్ అహూజా, ఐఐసీటీ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ అహ్మద్ కమాల్, ఆర్‌బీఎన్ ప్రసాద్, కె. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సౌరశక్తి ప్రాజెక్టులు: జితేంద్ర సింగ్ సౌరశక్తితోపాటు సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో కేంద్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇం దులో భాగంగా లడఖ్ వంటి ప్రాంతాల్లో భారీ సౌరశక్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఆయన గురువారం చెప్పారు. ఐఐసీటీ 70వ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరైన మంత్రి ‘సాక్షి’తో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మాతా వైష్ణోదేవి ఆలయ ప్రాంతంలో రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తూ ఆ ప్రాంతం సౌరశక్తి ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుందన్న ఆలోచనను తమతో పంచుకున్నారని, ఆ స్ఫూర్తితోనే ఆ స్టేషన్లోనే ఒక ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. జాతీయ సౌరశక్తి మిషన్‌ను పూర్తి చేయడంతోపాటు మరికొన్ని ఇతర ప్రాజెక్టులూ చేపడతామన్నారు. -
మూత్రపిండ కేన్సర్‌కు ‘వేప’ మందు!
సాక్షి, హైదరాబాద్: మూత్రపిండ సంబంధిత (రెనల్) కేన్సర్‌కు మన వేపతో చికిత్స చేయవచ్చని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు చెప్పారు. వేప చెట్టు నుంచి తీసిన రసాయనాల్లో నాలుగు రసాయనాలు కేన్సర్ కణాలను చంపగలుగుతున్నాయని తమ పరిశోధనల్లో వెల్లడైందని తెలిపారు. ‘రసాయన పరిశోధనల్లో ప్రకృతి స్ఫూర్తి’ అన్న అంశంపై సోమవారం ఐఐసీటీలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఐఐసీటీ 70వ వార్షికోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సు మూడు రోజులపాటు జరగనుంది. ఈ సందర్భంగా ఐఐసీటీ శాస్త్రవేత్త ఎస్.చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడారు. అద్భుతమైన ఔషధంగా వేప గొప్పతనం కొత్త కానప్పటికీ.. రెనల్ కేన్సర్‌ను నియంత్రించేందుకూ వేప ఉపయోగపడుతుందని తాము గుర్తించామని ఆయన చెప్పారు. ప్రకృతి సిద్ధమైన అనేక రసాయనాలను, వాటి తయారీ ప్రక్రియలను అనుకరించేందుకు ఐఐసీటీలో విసృ్తత ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. రెనల్ కేన్సర్‌కు చికిత్సతోపాటు, వయసుతో వచ్చే మతిమరపు (అల్జీమర్స్) నివారణకు ‘గాలంథమైడ్’ అనే సహజ రసాయనం ఉపయోగపడుతుందని గుర్తించామన్నారు. ఈ అంశాలపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు అంతర్జాతీయ స్థాయి సంస్థలైన మ్యాక్స్‌ప్లాంక్ ఇన్స్టిట్యూట్, డార్ట్మండ్ యూనివర్సిటీ, మేయో క్లినిక్‌లతో కలసి పనిచేస్తున్నామని చంద్రశేఖర్ వివరించారు. కాగా.. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్ డాక్టర్ గోవర్ధన్ మెహతా స్వాగతోపన్యాసం చేశారు. రానున్న కాలంలో సుస్థిర అభివృద్ధికి తోడ్పడే పరిశోధనలకు ఐఐసీటీ కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఐఐసీటీ డెరైక్టర్ లక్ష్మీకాంతం, మాజీ డెరైక్టర్లు ఎ.వి.రామారావు, జె.ఎస్.యాదవ్, ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ తదితరులు పాల్గొన్నారు. -
బ్రిటన్‌లో ఉన్నత విద్యకు మంచి అవకాశాలు
బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెకాలిస్టర్ సాక్షి, హైదరాబాద్: ఇరు దేశాల మధ్య శాస్త్ర పరిశోధనలకు సంబంధించిన సహకారాన్ని విసృ్తతం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భారత్‌లో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెకాలిస్టర్ స్పష్టం చేశారు. రసా యన శాస్త్రంతోపాటు ఇతర శాస్త్ర విభాగాల్లో ఉన్నత విద్య, పరిశోధనలకు బ్రిటన్‌లో అపార అవకాశాలున్నాయన్నా రు. శుక్రవారం రసాయన శాస్త్రంలో ఉద్యోగ అవకాశాలపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలు హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కెమ్ కెరియర్ 2013’కి ఆండ్రూ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రంగాల్లో మార్పులు, ఉపాధి అవకాశాలపై విద్యార్థుల్లో అవగాహనను పెంచేందుకు కెమ్ కెరియర్ లాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్సీ ప్రతినిధి జూలీ ఫ్రాంక్లిన్, ఐఐసీటీ సైంటిస్ట్ అహ్మద్ కమాల్, ఆర్ఎస్సీ డెక్కన్ విభాగానికి చెందిన డాక్టర్ పీసపాతి, ఆవ్రా ల్యాబ్స్ వ్యవస్థాపకుడు ఎ.వి.రామారావు తదితరులు పాల్గొన్నారు.