సూపర్ పవర్ కంట్రీగా భారత్ | Super Power Country: India | Sakshi
Sakshi News home page

సూపర్ పవర్ కంట్రీగా భారత్

Aug 24 2014 1:58 AM | Updated on Sep 2 2017 12:20 PM

సూపర్ పవర్ కంట్రీగా భారత్

సూపర్ పవర్ కంట్రీగా భారత్

సూర్యుని వెలుగులు పది నుంచి పన్నెండు గంటలు నిర్విరామంగా విరజిమ్మే భారతదేశం ప్రపంచంలోనే సూపర్ పవర్ కంట్రీగా నిలుస్తుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థకు చెందిన పరిశోధకుడు డాక్టర్ ఎల్ గిరిబాబు అన్నారు.

అద్దంకి : సూర్యుని వెలుగులు పది నుంచి పన్నెండు గంటలు నిర్విరామంగా విరజిమ్మే భారతదేశం ప్రపంచంలోనే సూపర్ పవర్ కంట్రీగా నిలుస్తుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థకు చెందిన పరిశోధకుడు డాక్టర్ ఎల్ గిరిబాబు అన్నారు.  స్థానిక కట్టారామకోటేశ్వరావు డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ‘రీసెంట్ టెక్నాలజీస్ ఆఫ్ కెమిస్ట్రీ’ అనే అంశంపై  శనివారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన తను ఆవిష్కరించిన ‘గ్రీన్ సోలార్ పవర్ ప్రాజెక్టు’ ఉపయోగాల గురించి వీడియో చిత్రాల ద్వారా తెలియజేశారు. ఈ సదస్సులో మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్నాటక, తెలంగాణ  నుంచి వచ్చిన 200 మంది తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు.
 
సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్ విల్సన్ రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ   తక్కువ ధరలో నాణ్యమైన విద్యుత్‌ను తయారు చేసుకునే వాటిల్లో ‘ఆర్గానిక్ సోలార్ సెల్’ పద్ధతి ఒకటన్నారు. ఈ పద్ధతిలో  సిలికాన్ ప్యానల్స్‌కు బదులు తక్కువ ధరలో లభించే పదార్థాలతో నాణ్యమైన పరికరాలను తయారు చేయడం, అదీ నానో టెక్నాలజీలో తయారు చేయడం విశేషమని చెప్పారు.
 
ఈ సోలార్ ప్యానెల్ ట్యూబ్‌లైట్ వెలుగు నుంచి కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు. అనంతరం కాలుష్యరహిత ఉత్ప్రేరకాల తయారీపై డాక్టర్ ఎన్ లింగయ్య, చక్కెరల కర్బన లోహశక్తి గురించి రాజీవ్ త్రివేది, పైరబోలిక్ ఉత్పన్నాల తయారీ గురించి ఐఐసీటీ హైదరాబాదుకు చెందిన డాక్టర్ రవి, గ్రీన్ సాల్వెంట్స్ గురించి ఐఐటీ చెన్నైకి చెందిన డాక్టర్ రమేష్, నానో పెస్టిసైడ్స్ గురించి గీతం యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఎన్‌వీఎస్ వేణుగోపాల్ సవివరంగా విశదీకరించారు.
 
రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు శ్రీనివాసరెడ్డి ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. పాల్గొన్న వారికి మెమొంటోలు, ప్రశంసా పత్రాలు కళాశాల ప్రిన్సిపాల్ విల్సన్ రాజు అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ జీ రాజేశ్వరి, కళాశాల పీడీ ధనుంజయ, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement