సాంకేతికంగా, ఆర్థికంగా, మిలిటరీ పరంగా భారత్ సూపర్ పవర్ దేశంగా మారాలని లేదంటూ పొరుగున్న ఉన్న దేశాలతో ఏనాటికైనా ముప్పే అంటూ హెచ్చరిస్తున్నాడు జోహో కంపెనీ సీఈవో శ్రీధర్ వేంబు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ రాజకీయాలపై ఆయన కీలక వ్యాఖ్యలు ట్విటర్ వేదికగా చేశారు. ప్రస్తుతం కామెంట్లు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.
నాటో దళాలు తమ పక్కన చేరుతున్నాయంటూ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. సోవియట్ చర్యను తప్పు పడుతూ ఆర్థిక ఆంక్షలు విధించాయి అమెరికా , ఈయూ కూటమి దేశాలు. మన పొరుగు దేశాలపైన చైనా, పాకిస్తాన్‌లు రష్యాకు మద్దతుగా నిలిచాయి. ఇండియా తటస్థ వైఖరి తీసుకుంది. అయితే ఈ తటస్థ వైఖరి ఎంతో కాలం మేలు చేయదంటున్నారు శ్రీధర్‌వేంబు.
టెక్నాలజీ, ఆర్థికం, మిలిటరీ పరంగా ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యాలు వరుసగా మూడు సూపర్ పవర్ దేశాలు ఉన్నాయన్నారు. ఏలాంటి పరిస్థితుల్లోనూ ఈ సూపర్ పవర్ దేశాలు ఒకదానిపై ఒకటి దాడి చేసుకోవన్నారు. అదే జరిగితే ఊహించని నష్టం జరగుతుందన్నారు. అందుకే సూపర్ పవర్ దేశాలు పరస్పరం దాడి చేసుకోవని తెలిపారు.
మూడు సూపర్ పవర్ దేశాల్లో ఒకటైన చైనా తైవాన్ ఆక్రమణకు ఎప్పటి నుంచో ప్రణాళికలు వేస్తోంది. రేపటి రోజున చైనా అనున్నంత పని చేసినా ఆ దేశాన్ని ఏ శక్తి అడ్డుకోదన్నారు. చైనాకు పొరుగున్న ఉన్నందున ఎప్పటికైనా భారత్‌కు చైనా ముప్పే అన్నారు.
చైనా నుంచి ఎదురయ్యే ప్రమాదాలను ధీటుగా ఎదుర్కొవాలంటే మిలిటరీ, ఫైనాన్స్, టెక్నాలజీ సెకార్లలో ఇండియా సూపర్ పవర్‌గా మారాల్సిందే అని సూచించారు. చైనాతో ముప్పు తలెత్తితే రష్యా, అమెరికాల నుంచి సాయం అందుతుందన్న నమ్మకం లేదన్నారు. సూపర్ పవర్ దేశాలు ఎప్పుడూ మరో దేశం వెనుక ఉండాలని కోరుకోవన్నారు.
ఉక్రెయిన్, తైవాన్ లాంటి దుస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే భారత్ తన శక్తిని తాను నమ్ముకోవాలన్నారు. పరిస్తితులకు తగ్గట్టుగా శక్తివంతగా మారాలని దానికి కచ్చితమైన ప్రణాళిక అవసరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment