దేశాభివృద్ధిలో యూనివర్సిటీలదే కీలక పాత్ర | university key role in the country's development | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధిలో యూనివర్సిటీలదే కీలక పాత్ర

Published Thu, Aug 28 2014 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM

దేశాభివృద్ధిలో యూనివర్సిటీలదే కీలక పాత్ర

దేశాభివృద్ధిలో యూనివర్సిటీలదే కీలక పాత్ర

  •      ఐఐసీటీ డెరైక్టర్ లక్ష్మీకాంతం
  •      ఘనంగా మహిళా వ ర్సిటీ స్నాతకోత్సవం
  • యూనివర్సిటీ క్యాంపస్ : దేశాభివృద్ధిలో యూనివర్సిటీలదే కీలకపాత్రని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (హైదరాబాద్) డెరైక్టర్ ఎం.లక్ష్మీకాంతం అన్నారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బుధవారం 15వ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి గవర్నర్ హాజ రు కాలేదు. దీంతో వీసీ రత్నకుమారి చాన్సలర్ హోదాలో డిగ్రీలు ప్రదానం చేశారు.

    ఈ సందర్భంగా గౌరవ డాక్టరేట్ అందుకున్న లక్ష్మీకాంతం స్నాతకోపన్యాసంచేశారు. ప్రస్తుతం మనదేశంలో అపారమైన జ్ఞానసంపద ఉందన్నారు. ఎంతోమంది మేధావులు ఉన్నప్పటికీ వారిజ్ఞానం సమాజానికి, దేశానికి ఉపయోగించుకోలేక పోతున్నామన్నారు. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మ్యాన్‌ఫ్యాక్చరింగ్, మేనేజ్‌మెంట్‌స్కిల్స్ తోడైతే అద్భుతాలు చోటు చేసుకుంటాయన్నారు. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు దేశాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన మానవ సంపదను తయారు చేయాలన్నా రు.

    సమాజంలోని సమస్యలను పరిష్కరించే దిశగా విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేయాలని కోరారు. ఇవన్నీ జరగాలంటే విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందాలన్నా రు. విశ్వవిద్యాలయాల్లో  మౌలిక సదుపాయాలు, వసతులు, పరిశోధన పరికరాలు అందించినప్పుడే అవి నాణ్యమైన విద్యను అందించగలవన్నారు.

    గొప్ప మహిళలను ప్రతి మహి ళ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో మహిళల పాత్ర పెంచడం ద్వారా మహిళా సాధికారత సాధించవచ్చన్నారు. అయితే ప్రస్తుతం ఈ రంగంలో మహిళలపై వేధింపులు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎంతోమంది మహిళలను విద్యావంతులను చేసి సమాజానికి అందిస్తోందన్నారు.
     
    విద్యార్థినుల సందడి
     
    నాలుగు సంవత్సరాల తర్వాత స్నాతకోత్సవం జరగడంతో వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థినులు వారి కుటుంబ సభ్యులతో వచ్చారు. స్నాతకోత్సవం ముగిశాక పాతమిత్రులను కలసి ముచ్చట్లు చెప్పుకుంటూ సందడి చేశారు.
     
    కఠిన శ్రమతోనే విజయం

    విద్యార్థులు తమ రంగంలో విజయం సాధించాలంటే  కఠిన శ్రమ తప్ప వేరే ప్రత్యామ్నాయాలు లేవన్నారు. విద్యార్థులు మొదట స్పష్టమైన, బలమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు కొత్త విషయాలను తెలుసుకోవాలని, కఠిన శ్రమతో సాధన చేస్తే విజయం సాధించగలరని చెప్పారు. వీసీ రత్నకుమారి తన ప్రసంగంలో విశ్వవిద్యాలయం సాధించిన ప్రగతిని  వివరించారు.
     
    1948 మందికి డిగ్రీలు

     
    స్నాతకోత్సవంలో 1948 మందికి డిగ్రీలు ప్రదానం చేశా రు. 71 మందికి బంగారుపతకాలు, 13 బుక్‌ప్రైజ్‌లు, 13 మందికి నగదు బహుమతులు, 117 మందికి పీహెచ్‌డీలు, 15 మందికి ఎంఫిల్ డిగ్రీలు, 986 మందికి పీజీలు, 588 మందికి డిగ్రీలు, 242 మందికి దూరవిద్యా డిగ్రీలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎం.విజయలక్ష్మి, డీన్లు ఎంవీ. రమణమ్మ, ఈ.మంజు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement