బ్రిటన్‌లో ఉన్నత విద్యకు మంచి అవకాశాలు
బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెకాలిస్టర్
సాక్షి, హైదరాబాద్: ఇరు దేశాల మధ్య శాస్త్ర పరిశోధనలకు సంబంధించిన సహకారాన్ని విసృ్తతం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భారత్‌లో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెకాలిస్టర్ స్పష్టం చేశారు. రసా యన శాస్త్రంతోపాటు ఇతర శాస్త్ర విభాగాల్లో ఉన్నత విద్య, పరిశోధనలకు బ్రిటన్‌లో అపార అవకాశాలున్నాయన్నా రు. శుక్రవారం రసాయన శాస్త్రంలో ఉద్యోగ అవకాశాలపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలు హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కెమ్ కెరియర్ 2013’కి ఆండ్రూ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రంగాల్లో మార్పులు, ఉపాధి అవకాశాలపై విద్యార్థుల్లో అవగాహనను పెంచేందుకు కెమ్ కెరియర్ లాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌సీ ప్రతినిధి జూలీ ఫ్రాంక్లిన్, ఐఐసీటీ సైంటిస్ట్ అహ్మద్ కమాల్, ఆర్‌ఎస్‌సీ డెక్కన్ విభాగానికి చెందిన డాక్టర్ పీసపాతి, ఆవ్రా ల్యాబ్స్ వ్యవస్థాపకుడు ఎ.వి.రామారావు తదితరులు పాల్గొన్నారు.