ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ చాట్ బాట్‌ను విడుదల చేసింది. ఈ చాట్ బాట్ సాయంతో కస్టమర్లకు ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుందో సలహా ఇస్తుంది.
జొమాటో ఏఐని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే
జొమాటో ఏఐ ప్రత్యేకమైన యాప్ కాదు. కానీ ఇది జొమాటో యాప్‌లోని చాట్‌బాట్. యాప్ తాజా అప్‌డేట్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే జొమాటో గోల్డ్ కస్టమర్‌లు ప్రత్యేకంగా జొమాటో ఏఐ ఫీచర్లను పొందవచ్చు.
జొమాటో ఏఐ ఎలా పనిచేస్తుంది?
జొమాటో ఏఐ అనేది కస్టమర్ల అవసరాల్ని తీర్చేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, ఫిట్‌నెస్‌కు అనుగుణంగా ఎలాంటి ఫుడ్ తింటే బాగుంటుందని మీరు ఏఐని అడిగితే క్లుప్తంగా వివరిస్తుంది. ఫుడ్ ఐటమ్స్ సైతం డిస్‌ప్లేలో కనబడతాయి. అంతేకాకుండా,కస్టమర్లకు నచ్చిన వంటకాలను అందించే రెస్టారెంట్ జాబితాలను కూడా అదే చూపుతుంది. జొమాటో లేటెస్ట్ అప్‌డేట్‌తో ఏఐ చాట్‌బాట్ పొందవచ్చని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment