ChatGPT Passes Another University Exam Writes 2,000 Word Essay in 20 Minutes - Sakshi
Sakshi News home page

ChatGPT చాట్‌జీపీటీ మరో సంచలనం..20 నిమిషాల్లో!

Published Thu, Feb 9 2023 5:32 PM | Last Updated on Thu, Feb 9 2023 5:49 PM

ChatGPT Passes Another University Exam Writes 2k Word Essay In 20 Minutes - Sakshi

సాక్షి,ముంబై:  విశేష ఆదరణతో దూసుకుపోతున్న  చాట్‌జీపీటీ మరో సంచలనం నమోదు చేసింది.  ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చాట్‌జీపీటీ చాలా కీలకమైన పరీక్షల్లో నెగ్గుకు వస్తూ హల్‌ చల్‌ చేస్తోంది. తాజాగా 20 నిమిషాల్లో ఏకంగా 2 వేల పదాల వ్యాసాన్ని రాసి మరొక విశ్వ విద్యాలయ పరీక్ష పాస్‌ అయిందట.

ది ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం, పీటర్ 2000 పదాల వ్యాసాన్ని వ్రాయమని ChatGPTని ఆదేశించాడు. ఆశ్చర్యకరంగా, ఏఐ చాట్‌జీపీటీ దానిని కేవలం 20 నిమిషాల్లో పూర్తి చేసింది. పీటర్ దానిని ఉపాధ్యాయులకు చూపించి  ఈవాల్యుయేట్‌ చేయాలని అడిగాడు. ఉపాధ్యాయులు 53,  2:2 స్కోరు ఇచ్చారుట. 

అధ్యాపకుల అభిప్రాయం ప్రకారం, టెక్స్ట్ కొద్దిగా ఫీష్షీగా ఉన్నప్పటికీ పరవాలేదన్నారు. అయితే  దీనికి  తగినంత విశ్లేషణ అవసరమన్నారు. అంతేకాదు లేజీ స్టూడెంట్స్‌ వర్క్‌ను గుర్తు చేసిందని కూడా పేర్కొన్నారు. గత ఏడాది గ్రాడ్యుయేట్ అయిన పీటర్ స్నెప్‌వాంజర్స్, ప్రోగ్రామ్‌తో ప్లగరిజం సాధ్యమేనా అని పరీక్షించడానికి ఒక వ్యాసాన్ని రూపొందించడానికి ChatGPT AI ని టెస్ట్‌ చేశారట. 

(ఇది చదవండి: అయ‍్యయ్యో గూగుల్‌ ‘బార్డ్‌’ ఎంత పనిచేసింది: 100 బిలియన్ డాలర్లు మటాష్‌!)

కాగా  చాట్‌జీపీటీ టూల్‌  కీలకమైన టెస్ట్‌లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల యూఎస్‌ మెడికల్ లైసెన్సింగ్ పరీక్ష,  వార్టన్ బిజినెస్  MBA ప్రోగ్రామ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ కోర్సు  చివరి పరీక్ష,యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా లా స్కూల్‌  నాలుగు స్కూల్ పరీక్షలతో సహా కొన్ని ప్రముఖ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించింది.మిన్నెసోటా యూనివర్శిటీ లా స్కూల్‌  ప్రొఫెసర్  జోనాథన్ చోయ్, 95 బహుళ-ఎంపిక ప్రశ్నలు, 12 వ్యాస ప్రశ్నలతో కూడిన విద్యార్థులకిచ్చే పరీక్షనేచాట్‌జీపీటీకిచ్చారు. బోట్ మొత్తం C+ స్కోర్ చేసినట్లు నివేదించారు.
వినియోగదారులతో సాధారణ చాట్‌లలో పాల్గొనడం , వివిధ రకాల ప్రశ్నలకు ప్రతిస్పందించే సామర్థ్యంతో, ChatGPT చాట్‌బాట్ విపరీతంగా ఆకర్షిస్తోంది.   (గూగుల్‌ మ్యాప్స్‌లో అద్భుతమైన అప్‌డేట్స్‌, చూసి మురిసిపోవాల్సిందే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement