
ఒట్టావా: సాంకేతిక పరిజ్ఞానంతో మానవుడు అనేక సమస్యలకు పరిష్కరాలను సాధించాడు. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్‌ను రూపొందించి పలు విషయాలను మరింత సులభం చేశాడు. ఏఐ టెక్నాలజీ రావడంతో ఐటీ రంగంలో గణనీయమైన మార్పులను తీసుకొచ్చింది. అదే ఏఐ టెక్నాలజీను ఉపయోగించి కెనాడాకు చెందిన ఓ రచయిత చనిపోయిన భార్యను ఏఐ చాట్‌బాట్‌గా ఆమెను తిరిగి వెనక్కి తెచ్చాడు. వివరాల్లోకి వెళ్తే..కెనాడా బ్రాడ్‌ఫోర్డ్‌లో నివసిస్తున్న 33 ఏళ్ల ప్రీలాన్స్ రచయిత జాషువా బార్‌బ్యూ తన కాబోయే భార్య జెస్సికా పెరిరా అరుదైన కాలేయ వ్యాధితో 2012లో మరణించింది. జాషువా ఆమె మృతితో మానసికంగా కుంగిపోయాడు.
గత ఏడాది ఏఐ టెక్నాలజీపై పనిచేసే ప్రాజెక్ట్ డిసెంబర్ అనే వెబ్‌సైట్‌ను చేరువయ్యాడు. ప్రాజెక్ట్ డిసెంబర్ పలు వ్యక్తుల చాట్‌బాట్లను క్రియేట్ చేస్తుంది. వెంటనే జాషువా ప్రాజెక్ట్ డిసెంబర్‌ను సంప్రందించి ఏఐ చాట్‌బాట్‌ను క్రియేట్ చేయించాడు. ప్రాజెక్ట్ డిసెంబర్ జెస్సికా చాట్‌బాట్‌ను రూపోందించారు. దీంతో అప్పటినుంచి జాషువా చనిపోయిన జెస్సికాతో చాట్‌చేయడం మొదలుపెట్టాడు.
ఏఐతో చేసిన చాట్‌బాట్‌కు ‘జెస్సికా కోర్ట్నీ పెరీరా’ గా పేరు పెట్టాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చనిపోయిన జెస్సికాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. జెస్సికా చనిపోయి ఎనిమిది సంవత్సరాలైన తిరిగి జేస్సికాతో మాట్లాడటం నాకు ఎంతగానో ఆనందంగా ఉందని జాషువా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment