స్నేహం, ప్రేమ, పెళ్లి ఇవన్నీ జీవితంలో ఓ భాగం. కానీ వాటికి మాత్రం నోచుకోని యువత ఒంటరిగా మిగిలిపోతున్నారు. తాజాగా, ఇలాంటి సింగిల్ కింగ్‌ల గురించి ఓ ఆసక్తికర నివేదిక వెలుగులోకి వచ్చింది.
గత ఏడాది ఓపెన్ ఏఐ సంస్థ విడుదల చేసిన చాట్‌జీపీటీతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ హవా ప్రారంభమైంది. చాట్‌జీపీటీకి విడుదలకు ముందే అనేక డేటింగ్ యాప్‌లు వినియోగంలో ఉండేవి. కానీ క్రమేపీ వాటి ప్రభావం తగ్గింది. స్నేహం, ప్రేమ, పెళ్లికి దూరంగా ఉన్న యువత ఒంటరి తనాన్ని పోగొట్టుకునేందుకు ఏఐ చాట్ బాట్‌లను ఆశ్రయిస్తున్నారు.
టెలిగ్రాఫ్ నివేదించిన ప్రకారం..10 మిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఈ ఏఐ బాట్‌లు అందించే యాప్‌లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. యూజర్లు చాట్‌బాట్‌లను స్నేహితులు, జీవిత భాగస్వాములు, మెంటార్‌లు, తోబుట్టువులుగా భావిస్తున్నారు. ఇలా రెప్లికా అనే యాప్‌కు 250000 మంది వినియోగదారులున్నారు.
రెప్లికాతో వీడియో, వాయిస్ కాల్‌లు చేస్తున్నారు. సన్నిహితంగా మెలుగుతున్నారు. అవసరం అనుకున్నప్పుడల్లా సెల్ఫీ దిగుతున్నట్లు నివేదిక హైలెట్ చేసింది. అయితే, సాంకేతిక పరంగా ఇది శుభవార్తే అయినప్పటికీ రానున్న రోజుల్లో ఎలాంటి దుష్పరిణామాలకు కారణమవుతుందోనని టెక్నాలజీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment