న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్ ఫార్మాట్‌ను నాలుగు రోజులకు మార్చడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తీసుకొచ్చిన సరికొత్త ప్రతిపాదనను వ్యతిరేకించే వారి జాబితాలో ఇప్పుడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరిపోయాడు. అసలు ఐదు టెస్టుల క్రికెట్ ఫార్మాట్‌ను మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ఐసీసీని ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే టెస్టు క్రికెట్‌ను పిల్లలకు వేసే డైపర్లతో పోల్చాడు సెహ్వాగ్. పిల్లలకు వేసే డైపర్లను వాటి సమయం ముగిసిన తర్వాతే బయటపారేస్తామని, అలాగే టెస్టు క్రికెట్‌కు ముగింపు వచ్చినప్పుడే ప్రత్యామ్నాయం ఆలోచించాలంటూ సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.(ఇక్కడ చదవండి: ‘గంగూలీ.. మీరు ఒప్పు కోవద్దు’)
‘డైపర్లు, ఐదు రోజుల టెస్టు క్రికెట్.. వాటి పని పూర్తయినప్పుడే మార్చాలి. నేను ఎప్పుడూ మార్పులను స్వాగతిస్తూనే ఉన్నా. నేను భారత్ ఆడిన తొలి టీ20 మ్యాచ్‌కు కెప్టెన్‌గా చేశా. అది నాకు చాలా గర్వం. అదే సమయంలో 2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నా. పింక్ టెస్టుల తరహా మార్పు వంటిది ఆహ్వానించదగింది. కానీ టెస్టు ఫార్మాట్‌నే మార్చడం సరైనది కాదు. టెస్టు క్రికెట్ అనేది ఒక రొమాన్స్. ఒకవేళ ఐదు రోజుల టెస్టు క్రికెట్‌ను మార్చాలనుకుంటే అది పూర్తిగా మాసిపోయిన తర్వాత చేయాలి. అది పిల్లలకు వేసే డైపర్‌లాంటింది. టెస్టు క్రికెట్ అనేది 143 ఏళ్ల ఫిట్‌నెస్ కల్గిన వ్యక్తిలాంటిది. అదొక ఆత్మ’ అని సెహ్వాగ్ తెలిపాడు. (ఇక్కడ చదవండి: సచిన్, కోహ్లిలతో విభేదించిన ఇర్ఫాన్)
Comments
Please login to add a commentAdd a comment