టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ సరికొత్త అవతరమెత్తున్నాడు. గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ఇషాంత్.. కామెంటేటర్‌గా తన కొత్త జర్నీని ప్రారంభించనున్నాడు. వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు తొలి సారి కామెంటేటర్‌గా ఇషాంత్ శర్మ వ్యవహరించనున్నాడు. ఈ మెరకు జియో సినిమాతో ఇషాంత్ శర్మ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ విషయాన్ని జియో సినిమా సోమవారం దృవీకరించింది. గతంలో వెస్టిండీస్‌పై ఇషాంత్ సాధించిన 10 వికెట్ల హాల్‌ను హైలైట్ చేస్తూ ఓ వీడియోను జియో సినిమా ట్విటర్‌లో పోస్ట్ చేసింది. అదే విధంగా ఇషాంత్ తమ కామెంటరీ ప్యానెల్‌లో చేరడం చాలా సంతోషంగా ఉందని జియో సినిమా రాసుకొచ్చింది. కాగా ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్ హిందీలో తన వాఖ్యాన్ని అందించనున్నాడు.
ఇక ఇషాంత్ శర్మ కొన్నాళ్లపాటు భారత జట్టులో కీలక సభ్యునిగా కొనసాగాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో భారత జట్టుకు తన సేవలను అందించాడు. టీమిండియా తరపున ఇప్పటివరకు 105 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20లు ఆడిన ఇషాంత్.. వరుసగా 311, 115, 8 వికెట్లు పడగొట్టాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కొత్త సైకిల్‌లో భాగంగా జరగనున్న భారత్-విండీస్ టెస్టు సిరీస్ జూలై 12 నుంచి ప్రారంభం కానుంది. డొమినికా వేదికగా జరగనున్న తొలి టెస్టుకు ఇరు జట్లు అన్ని విధాల సిద్దమయ్యాయి. తొలి మ్యాచ్‌లో గెలిచి డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో బోణీ కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
విండీస్‌తో టెస్టులకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ.
చదవండి: IND vs WI: విండీస్‌లో కారు డ్రైవింగ్ చేసిన రోహిత్ శర్మ! ఫోటోలు వైరల్
Ishant Sharma, whose only 10-wicket haul in Tests came against the #WestIndies - will be in our comm box for India's upcoming series!🎙️#SabJawaabMilenge only on #JioCinema ✨#WIvIND | @ImIshant pic.twitter.com/gL0xNxnok1
— JioCinema (@JioCinema) July 9, 2023
Comments
Please login to add a commentAdd a comment