ఇషాంత్ శర్మ బ్యాటింగ్
బర్మింగ్‌హామ్: కౌంటీల్లో మొదటిసారి ఆడుతున్న భారత పేసర్ ఇషాంత్ శర్మ తొలి మ్యాచ్‌లోనే ఆదరగొట్టిన విషయం తెలిసిందే. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహించిన టీమిండియా పేసర్ సీమర్ వార్విక్‌షైర్‌పై 5 వికెట్లు తీసి ఫామ్‌లోకొచ్చాడు. తాజాగా బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. 120 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన ఇషాంత్.. కెరీర్‌లో తొలిసారి అర్ధ శతకం చేశాడు. తద్వారా 100కు పైగా ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన తర్వాత హాఫ్ సెంచరీ చేసిన అరుదైన క్రికెటర్ల జాబితాలో ఇషాంత్ చేరాడు.
కౌంటీ ఛాంపియన్‌షిప్ టోర్నీలో భాగంగా లీసెస్టర్‌లో వావ్రిక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 141 బంతులాడిన పేసర్ ఇషాంత్ ఆరు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 66 పరుగులు సాధించాడు. 182 నిమిషాల పాటు క్రీజులో నిలవడం గమనార్హం. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అంతకుముందు 31 పరుగులే ఇషాంత్‌కు అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు.
ససెక్స్ టీమ్ స్కోరు 240/7 వద్ద శుక్రవారం తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇషాంత్.. శనివారం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎనిమిదో వికెట్‌కు బర్గెస్‌తో కలిసి 153 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
Comments
Please login to add a commentAdd a comment