Man Attacked On Footpath In London: ‘ప్లీజ్‌ నా వేలు వెతికి పెట్టండి’! - Sakshi
Sakshi News home page

‘ప్లీజ్‌ నా వేలు వెతికి పెట్టండి’!

Published Thu, Aug 5 2021 4:36 PM | Last Updated on Thu, Aug 5 2021 7:09 PM

Man Attacked With Machete In Broad Daylight - Sakshi

వీడియో దృశ్యం

లండన్‌ : పుట్‌పాత్‌పై అందరూ చూస్తుండగా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడో దుండగుడు. ఆ దాడిలో సదరు బాధితుడి చేతి వేలు తెగి, దూరంగా ఎగిరిపడింది. ఇంగ్లాండ్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌, సాల్‌ఫోర్డ్‌కు చెందిన ఓ వ్యక్తి సోమవారం చీతమ్‌ ఏరియాలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో నల్ల దస్తులు ధరించిన కొందరు వ్యక్తులు అతడి దగ్గరకు వచ్చారు. కొద్దిసేపటి తర్వాత నల్ల దుస్తుల్లోని ఓ నిందితుడు కత్తితో అతడిపై దాడి చేశాడు. బాధితుడు భయంతో పుట్‌పాత్‌ మీదకు వచ్చాడు. అయినా నిందితుడు దాడి మానలేదు. చుట్టూ దూరంగా ఉన్న జనం తోలు బొమ్మలాట చూస్తున్నట్లు చూస్తూ ఉండిపోయారు.

నిందితుడు కత్తితో పలుమార్లు దాడి చేశాడు. బాధితుడు చెయ్యి అడ్డం పెట్టడంతో వేలు తెగి,దూరంగా ఎగిరిపోయింది. తలపై రెండు దెబ్బలు వేసి నిందితుడు అక్కడినుంచి పారిపోయాడు. అనంతరం ‘‘ఫ్లీజ్‌! నా వేలును వెతికి పెట్టండి’’ అంటూ బాధితుడు అక్కడి జనాన్ని ప్రాథేయపడ్డాడు. దొరికిన వేలితో అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫొటేజీల ఆధారంగా విచారణ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement