భారత క్రికెట్‌లో మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌కు ప్రత్యేక స్ధానం ఉంది. తన అద్భుత బౌలింగ్‌తో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఈ రివర్స్ స్వింగ్ కింగ్ దాదాపు దశాబ్దం పాటు భారత క్రికెట్‌కు తన సేవలు అందించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో 21 వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన జాక్... అన్ని ఫార్మాట్లలో కలిపి 610 వికెట్లు తీసుకున్నాడు.
అయితే మరోసారి ఈ దిగ్గజ పేసర్‌పై టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా రణ్‌వీర్ అల్లాబాడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాంత్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్, జహీర్ ఖాన్‌లో ఎవరు అత్యుత్తమ బౌలర్ అని రణ్‌వీర్ ప్రశ్నించాడు.
అందుకు బదులుగా ఇషాంత్ ఏమీ ఆలోచింకుండా అండర్సన్ కంటే జహీర్ గొప్ప బౌలర్‌ను అని చెప్పుకొచ్చాడు. కాగా అండర్సన్ కూడా ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. తన కెరీర్‌లో ఇప్పటి వరకు 180 టెస్టులు, 194 వన్డేలు ఆడిన అండర్సన్ వరుసగా 269, 686 వికెట్లు పడగొట్టాడు. అతడి టెస్టు కెరీర్‌లో ఏకంగా 32 ఫైవ్ వికెట్ల హాల్స్ ఉన్నాయి.
"జిమ్మీ అండర్సన్ బౌలింగ్ శైలి కాస్త బిన్నంగా ఉంటుంది. అతడు టాప్ క్లాస్ బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అతడు ఎక్కువ భాగం తన కెరీర్‌లో ఇంగ్లండ్‌లోనే ఆడాడు. ఇంగ్లండ్ పిచ్‌లకు పేసర్లు అనుకూలిస్తాయి, అదే భారత్‌లో ఆడి వుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. నా వరకు అయితే అండర్సన్ కంటే జాక్(జహీర్ ఖాన్) బెస్ట్ బౌలర్" అని ఇషాంత్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs WI: వెస్టిండీస్ టూర్‌కు ముందు చాహల్ కీలక నిర్ణయం.. మరో లీగ్‌లో ఆడేందుకు!
Comments
Please login to add a commentAdd a comment