సౌథాంప్టన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ హోదాను తృటిలో చేజార్చుకున్న బాధలో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు, సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. అతడి కుడి చేతి మధ్య, ఉంగరపు వేళ్లకు గాయాలవ్వడంతో కుట్లు వేశారు. దీంతో అతను ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడో లేదోనన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ విషయమై బీసీసీఐ మాత్రం ధీమాగా ఉంది. ఇషాంత్ తొలి టెస్ట్ లోపు కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో తన బౌలింగ్‌లోనే ఓ బంతిని ఆపే క్రమంలో ఇషాంత్ గాయపడ్డాడు. అతని చేతి వేళ్లకు గాయాలయ్యాయి. తీవ్రంగా రక్తస్రావం కావడంతో వెంటనే అతను మైదానాన్ని వీడాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియాపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా, ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు మరో ఆరు వారాల సమయం ఉన్న నేపథ్యంలో అప్పట్లోగా ఇషాంత్ పూర్తిగా కోలుకుంటాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. డబ్ల్యూటీసీ ఫైనల్ అయ్యాక టీమిండియాకు 20 రోజుల విరామం లభించనుంది. ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి గ్రేట్ బ్రిటన్ పరిధిలో విహరించే అవకాశాన్ని బీసీసీఐ కల్పించింది. దీంతో గురువారం సాయంత్రమే ఆటగాళ్లంతా సౌథాంప్టన్ నుంచి లండన్ బయల్దేరారు.
చదవండి: కెప్టెన్ కోహ్లీని ఘోరంగా అవమానించిన కివీస్ వెబ్‌సైట్
Comments
Please login to add a commentAdd a comment