ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సందర్భంగా అనుచితంగా ప్రవర్తించినందుకుగాను భారత బౌలర్ ఇషాంత్ శర్మకు జరిమానా విధించారు.
దుబాయ్: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సందర్భంగా అనుచితంగా ప్రవర్తించినందుకుగాను భారత బౌలర్ ఇషాంత్ శర్మకు జరిమానా విధించారు. ఇషాంత్కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా వేశారు. ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ పట్ల ఇషాంత్ అనుచితంగా ప్రవర్తించినట్టు తేలడంతో మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ఈ నిర్ణయం తీసుకున్నాడు.
అలాగే ఈ మ్యాచ్లో స్లోఓవరేట్తో బౌలింగ్ చేసినందుకు ఆసీస్ జట్టుకు కూడా జరిమానా వేశారు. ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్కు మ్యాచ్ ఫీజులో 60 శాతం, ఇతర ఆటగాళ్లకు 30 శాతం చొప్పున జరిమానాగా విధించారు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచిన సంగతి తెలిసిందే.