ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటిన టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మను ఐసీసీ మందలించింది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టు మూడోరోజు ఆటలో దురుసు ప్రవర్తన కారణంగా ఇషాంత్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. శుక్రవారం ఆట తొలి సెషన్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలాన్ ఔటైన అనంతరం ఇషాంత్ దురుసుగా ప్రవర్తించాడని అభియోగం నమోదైంది.