
విండీస్ బలహీనత మాకు తెలుసు
తొలి టెస్టులో వెస్టిండీస్ బ్యాట్స్ మన్ బలహీనతపై దెబ్బకొట్టామని భారత పేసర్ ఇషాంత్ శర్మ పేర్కొన్నాడు.
తొలి టెస్టులో వెస్టిండీస్ బ్యాట్స్ మన్ బలహీనతపై దెబ్బకొట్టామని భారత పేసర్ ఇషాంత్ శర్మ పేర్కొన్నాడు. ఆంటిగ్వా టెస్టులో ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో భారత్ నెగ్గిన విషయం తెలిసిందే. రెండో టెస్టు కోసం కింగ్స్టన్లోని సబినా పార్క్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న ఇషాంత్ తొలి టెస్ట్ గేమ్ ప్లానింగ్ గురించి వెల్లడించాడు. విండీస్ ఆటగాళ్లు షార్ట్ పిచ్ బంతులు ఆడటంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని, అందుకే తమ బౌలింగ్ బృందం ఎక్కువగా ఆ బంతులపైనే దృష్టిపెట్టిందన్నాడు. షార్ట్ పిచ్ బంతులతో పాటు ఫుల్ లెంగ్త్ డెలివరీలు సంధించడంతో విండీస్ రెండు ఇన్నింగ్స్ ల్లో నూ త్వరగా కుప్పుకూలిందని చెప్పాడు.
తొలి ఇన్నింగ్స్ లో పేసర్లు ఉమేష్, షమీ చెరో నాలుగు వికెట్లతో విజృంభించగా, రెండో ఇన్నింగ్స్ లో స్పిన్నర్ అశ్విన్ విండీస్ భరతం పట్టగా, అమిత్ మిశ్రా అతడికి తోడయ్యాడని వివరించాడు. తనకు కేవలం ఒకటే వికెట్ దక్కిందని, మిగిలిన మూడు టెస్టుల్లో సాధ్యమైనన్ని వికెట్లు తీయడంపై ఫోకస్ చేస్తున్నట్లు తెలిపాడు. బౌలర్ల ఫిట్ నెస్ అమోఘమని మెచ్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో విండీస్ ఆలౌటయ్యాక, రెండో ఇన్నింగ్స్ కు దిగిన విండీస్ కు అదే ఫిట్నెస్తో బౌలింగ్ చేశామని వివరించాడు.