
మహ్మద్ షమీ.. ప్రస్తుత భారత జట్టులో కీలక పేసర్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా షమీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అయితే షమీ తన క్రికెట్ కెరీర్‌తో పాటు తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా 2018లో షమీపై అతడి మాజీ భార్య హసీన్ జహాన్ గృహ హింస కేసును పెట్టింది. దీంతో ఒక్క సారిగా షమీ వార్తల్లో నిలిచాడు.
అదే విధంగా షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డంటూ ఆమె తీవ్రమైన ఆరోపణలు చేసింది. దీంతో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం దర్యాప్తు కూడా చేపట్టింది. అయితే ఆరోపణలు అవాస్తమని యాంటీ కరప్షన్ విభాగం కొట్టపారేసింది. తాజాగా ఇదే విషయంపై భారత వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ఆసక్తికర వాఖ్యలు చేశాడు.
క్రిక్‌బజ్ షో 'రైజ్ ఆఫ్ న్యూండియా' లో ఇషాంత్ మాట్లాడుతూ.."షమీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల గురించి అవినీతి నిరోధక విభాగం హెడ్ నీరజ్ కుమార్ మా జట్టు సభ్యులందరినీ విచారించారు. పోలీసులు అడిగినట్లే అన్ని విషయాలు మా దగ్గర తెలుసుకున్నారు.
అదే విధంగా షమీ వ్యక్తిగత విషయాలు గురించి నన్ను ప్రశ్నించారు. అయితే అతడి వ్యక్తిగత విషయాలు గురించి నాకు తెలియదు అని బదులు ఇచ్చాను. కానీ నా వరకు అయితే షమీ 200 శాతం అలాంటి పని చేయడని చెప్పాను. ఈ విచారణ తర్వాత షమీతో తన అనుబంధం మరింత బలపడింది" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. టీమిండియాకు బిగ్‌షాక్!
Comments
Please login to add a commentAdd a comment