కెప్టెన్ కూల్ అంటే మనకు టక్కున గుర్తు వచ్చేంది టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోనినే. ప్రపంచక్రికెట్‌లో ఎంతో మంది యువ కెప్టెన్‌లకు ధోని ఆదర్శంగా నిలిచాడు. భారత్‌కు మూడు ఐసీసీ టైటిల్స్‌ను అందించిన ఘనత కూడా ధోనీదే. అయితే భారత వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ మాత్రం ధోని గురించి సంచలన వాఖ్యలు చేశాడు. ధోని అసలు కెప్టెన్ కూల్ కానే కాదని, ఫీల్డ్‌లో తరుచూ దుర్భాషలాడే వాడని ఇషాంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
"మహీ భాయ్‌కి చాలా బలాలు ఉన్నాయి. కానీ వాటిలో కూల్ అండ్ కామ్ ఒకటి కాదు. అతడు మైదానంలో బూతులు తిట్టేవాడు. నేను కూడా ఓసారి విన్నాను. ధోనికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ తరపున ఆడినప్పుడు ఐపీఎల్‌లోనైనా ఎవరో ఒకరు అతడి చూట్టూ ఉంటారు. ఓ ఊరి వాతావరణం కనిపిస్తుంది.
చెట్లు మాత్రమే ఉండవు. ఓసారి నేను నా బౌలింగ్ కోటాను పూర్తి చేసుకున్నాను. మహీ భాయ్ నా వద్దకు వచ్చి నీవు అలిసిపోయావా? అని నన్ను అడిగాడు. నేను దానికి బదులుగా అవును నేను బాగా అలిసిపోయాను అని చెప్పా. అతడి దానికి సమాధానముగా నీకు వయస్సు పైబడుతుంది, రిటైర్ అయిపో అని అన్నాడు. నేను ధోని మాటలకు ఆశ్చర్యపోయా.
అయితే నాపై మహీ భాయ్ ఎప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేయలేదు. ఒక్కసారి మాత్రం ధోని వేసిన త్రోను సరిగ్గా అందుకోలేకపోయాను. మొదటిసారి కోపంగా చూశాడు. రెండోసారి మరింత బలంగా త్రో వేశాడు. అదీ కూడా పట్టుకోలేకపోయాడు. ఇక మూడో సారికి మాత్రం సీరియస్ అయ్యాడు. చేతిని బంతితో కొట్టుకోమని సైగలు చేశాడు అని" టీఆర్ఎస్ క్లిప్స్ యూట్యూబ్ ఛానెల్‌లో ఇషాంత్ చెప్పుకొచ్చాడు
Comments
Please login to add a commentAdd a comment