టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సరసన చేరాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌటైన భారత కెప్టెన్ల జాబితాలో ఈ ఇద్దరూ సరిసమానంగా నిలిచారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ధోని, రోహిత్ చెరో 11 సార్లు డకౌటయ్యారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ డకౌటయ్యాడు. భారత కెప్టెన్‌గా రోహిత్ డకౌట్ కావడం 143 ఇన్నింగ్స్‌ల్లో ఇది 11వ సారి.
ఈ విభాగపు జాబితాలో విరాట్ కోహ్లి టాప్‌లో ఉన్నాడు. విరాట్ భారత కెప్టెన్ 250 ఇన్నింగ్స్‌ల్లో 16 సార్లు డకౌటయ్యాడు. ఆతర్వాత సౌరవ్ గంగూలీ అత్యధికంగా 13 సార్లు, ధోని, రోహిత్ 11 సార్లు, కపిల్ దేవ్ 10 సార్లు భారత కెప్టెన్లుగా డకౌట్లయ్యారు.
ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. తొలి రోజు ఆఖరి సెషన్‌లో బ్యాటింగ్‌కు దిగి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. రోహిత్ శర్మ టిమ్ సౌథీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా.. యశస్వి జైస్వాల్ (6), శుభ్‌మన్ గిల్ (10) క్రీజ్‌లో ఉన్నారు.
అంతకుముందు వాషింగ్టన్ సుందర్ (7/59), రవిచంద్రన్ అశ్విన్ (3/64) ధాటికి న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. వీరిద్దరే 10 వికెట్లు తీసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను పరిసమాప్తం చేశారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ద సెంచరీలు చేయగా.. మిగిలిన వారెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు.
చదవండి: చరిత్ర సృష్టించిన వాషింగ్టన్.. తొలి భారత ప్లేయర్‌గా
Comments
Please login to add a commentAdd a comment