
టాప్-20లో ఇషాంత్, పూజారా
భారత బౌలర్ ఇషాంత్ శర్మ టెస్టు ర్యాంకుల్లో టాప్-20లో స్థానం దక్కించుకున్నాడు.
దుబాయ్: భారత బౌలర్ ఇషాంత్ శర్మ టెస్టు ర్యాంకుల్లో టాప్-20లో స్థానం దక్కించుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో ఇషాంత్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 18వ ర్యాంకు దక్కించుకున్నాడు. అశ్విన్ 50, అమిత్ మిశ్రా 59 ర్యాంకుల్లో ఉన్నారు.
బ్యాట్స్ మన్ చతేశ్వర్ పూజారా కూడా టాప్-20లో చోటు సంపాదించాడు. నాలుగు స్థానాలు ఎగబాకి 20వ స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో టాప్-20లో ఉన్న రెండో బ్యాట్స్ మన్ పూజారా. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక ర్యాంకు పడిపోయి 11వ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ రెండు స్థానాలు మెరుగు పరుచుకుని 48వ ర్యాంకులో నిలిచాడు.