భారత బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఒక్కో స్థానం కిందకు దిగజారారు. గురువారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో పుజారా 8వ, కోహ్లి 10వ ర్యాంకుకు పడిపోయారు.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
దుబాయ్: భారత బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఒక్కో స్థానం కిందకు దిగజారారు. గురువారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో పుజారా 8వ, కోహ్లి 10వ ర్యాంకుకు పడిపోయారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ కెరీర్‌లో అత్యుత్తమంగా ఐదో ర్యాంకు సాధించాడు.
ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రాణించడం ద్వారా వార్నర్ ఐదు స్థానాలు ఎగబాకాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ల జాబితాలు మూడింట్లోనూ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వరుసగా డివిలియర్స్, స్టెయిన్, ఫిలాండర్ టాప్‌ర్యాంకుల్లో ఉండడం విశేషం. భారత ఆటగాడు అశ్విన్ ఆల్‌రౌండర్ జాబితాలో రెండో స్థానానికి పడిపోయాడు.