ICC Test Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అక్షర్ 20 స్థానాలు పురోగతి సాధించి 18వ స్థానానికి చేరుకున్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన అక్షర్ ప్రస్తుతం 650 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు.
కుల్దీప్ సైతం
మరోవైపు.. ఈ టెస్టులో రాణించిన మరో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 19 స్థానాలు ఎగబాకి 49వ స్థానంలో నిలిచాడు. బంగ్లాతో మ్యాచ్‌లో 8 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఈ చైనామన్ స్పిన్నర్ ఖాతాలో ప్రస్తుతం 455 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా నాలుగో ర్యాంక్‌లో, అశ్విన్ ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉన్నాడు.
అదరగొట్టిన పుజారా, గిల్
బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో ఛతేశ్వర్ పుజారా, శుబ్‌మన్ గిల్ 10 స్థానాల చొప్పున ఎగబాకి వరుసగా 16వ, 54వ ర్యాంక్‌ల్లో నిలిచారు. బంగ్లాతో మొదటి టెస్టు సందర్భంగా గిల్ సెంచరీ చేయగా... పుజారా సైతం అజేయ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ జాబితాలో ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ టాపర్‌గా ఉన్నాడు. ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా విఫలమైనా బ్యాటర్‌గా ఆకట్టుకున్న బాబర్ ఆజం కెరీర్ బెస్ట్ రెండో ర్యాంకుకు చేరుకున్నాడు.
చదవండి: ENG vs PAK: ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవం.. పాక్ హెడ్ కోచ్‌పై వేటు! బాబర్ కూడా..
Lionel Messi FIFA Winning Photo: తగ్గేదేలే.. మరో ‘ప్రపంచ రికార్డు’ బద్దలు కొట్టిన మెస్సీ!
Comments
Please login to add a commentAdd a comment