‘నీకంత సీన్ లేదు’ | I have increased my bowling load: Ishant Sharma | Sakshi
Sakshi News home page

‘నీకంత సీన్ లేదు’

Published Tue, Nov 17 2015 3:28 AM | Last Updated on Sun, Sep 3 2017 12:34 PM

‘నీకంత సీన్ లేదు’

‘నీకంత సీన్ లేదు’

శ్రీలంక ఘటనను వివరించిన ఇషాంత్
బెంగళూరు: శ్రీలంకతో జరిగిన మూడో టెస్టులో ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవకు దిగిన ఇషాంత్ శర్మ ఒక టెస్టు మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ రోజు తన హెల్మెట్‌ను కొట్టమన్నట్లుగా దమ్మిక ప్రసాద్‌కు సైగ చేసిన దృశ్యం అందరికీ గుర్తుంది. ఆ రోజు సరిగ్గా ఏం జరిగిందో ఇషాంత్ ఇప్పుడు వెల్లడించాడు.

‘ఒక ఓవర్లో బౌలర్ రెండు బౌన్సర్లు వేయవచ్చు. అయితే ప్రసాద్ నోబాల్ అవుతుందని తెలిసీ మూడోది వేశాడు. అంతకు ముందు నా బౌలింగ్‌లో అతని చేతికి బంతి తగిలింది కాబట్టి అతను కావాలనే అలా చేస్తున్నాడని నాకర్థమైంది. అయితే ఆ బౌన్సర్ వల్ల నాకు ఏమీ ఇబ్బంది అనిపించలేదు. దాంతో నా హెల్మెట్‌కు తగిలేలా బంతి విసరడం నీ వల్ల కాదు. నీ బౌలింగ్‌లో అంత వేగం లేదు అన్నాను. అప్పుడే మిగతా ఆటగాళ్లంతా చేరడంతో ఘటన పెద్దదైంది’ అని ఇషాంత్ గుర్తు చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement