ఆసియాకప్-2023లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎంతో అతృతగా ఎదరుచూసిన అభిమానుల ఆశల మీద వరుణుడు నీళ్లు చల్లిన సంగతి తెలిసిందే. దాయాదు పోరు మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యింది. అయితే ఈ ఒక్క మ్యాచ్‌కే కాకుండా శ్రీలంకలో జరగనున్న మిగిలిన మ్యాచ్‌లకు వర్షం ముప్పు పొంచి ఉంది. సూపర్-4 మ్యాచ్‌లతో పాటు ఫైనల్ కూడా కొలంబోలో జరగనున్నాయి.
అయితే కొలంబోలో మరో ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు అక్కడ వాతవారణ శాఖ వెల్లడించింది. దీంతో అభిమానులు అందోళన చెందుతున్నారు. శ్రీలంకలో ప్రస్తుతం వర్షాకలం అని తెలిసి కూడా అక్కడ మ్యాచ్‌లు నిర్వహించడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే పాకిస్తాన్‌లో షెడ్యూల్ చేసిన మ్యాచ్‌లకు మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతున్నాయి.
ఇక ఇదే విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ నజం సేథి సంచలన వాఖ్యలు చేశారు. క్రీడల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందని, తాను ఆసియాకప్‌ను యూఏఈలో నిర్వహించాలని ఏసీసీకి సూచించాని నజం సేథి తెలిపాడు.
"వర్షం కారణంగా ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ మ్యాచ్ రద్దు అయింది. ఇది నన్ను చాలా నిరాశపరిచింది. లంకలో ఈ సమయం(ఆగస్టు-సెప్టెంబర్)లో ఇలాంటి పరిస్థితి ఉంటుందని నాకు ముందే తెలుసు. అందుకే నేను పీసీసీబీ చైర్మెన్‌గా ఉన్నప్పుడు ఈ టోర్నీని పాక్‌తో పాటు యూఏఈలో నిర్వహించాలని ఏసీసీని కోరాను. కానీ ఏసీసీ నా మాటలను పట్టించుకోలేదు. వారు అందుకు చెత్త కారణాలు చెప్పారు.
దుబాయ్‌లో చాలా వేడిగా ఉంటుందని, అక్కడ ఆడడం కష్టమని వారు చెప్పుకొచ్చారు. మరి ఇంతకుముందు ఏప్రిల్ 2014లో, సెప్టెంబర్ 2020లో ఐపీఎల్ ఆడినప్పుడు దుబాయ్‌లో వేడి తెలియలేదా? చివరిసారి 2022లో ఆసియా కప్ కూడా యూఏఈలోనే జరిగింది. క్రీడలపై రాజకీయాలు ఎక్కవ అయ్యాయి. అది క్షమించరానిది" అంటూ ఎక్స్(ట్విటర్)లో నజం సేథి రాసుకొచ్చాడు.
కాగా వాస్తవానికి ఈ ఏడాది ఆసియాకప్ పాకిస్తాన్ వేదికగా జరగాలి. కానీ అక్కడకు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో టోర్నీని శ్రీలంక, పాక్ వేదికలగా నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది.
చదవండి: Asia cup 2023: నేపాల్‌తో మ్యాచ్‌కూ వర్షం గండం.. రద్దయితే టీమిండియా పరిస్థితేంటి..?
How disappointing! Rain mars the greatest contest in cricket. But this was forecast. As PCB Chair, I urged the ACC to play in UAE but poor excuses were made to accommodate Sri Lanka. Too hot in Dubai, they said. But it was as hot when the Asia Cup was played there last time in…
— Najam Sethi (@najamsethi) September 2, 2023
Comments
Please login to add a commentAdd a comment