పీసీబీ చీఫ్గా నజమ్ సేథీ
కరాచీ:పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నూతన చైర్మన్ గా నజమ్ సేథీ ఎంపికయ్యారు. గత కొంతకాలంగా పీసీబీ ఎగ్జిక్యూటివ్ చీఫ్ గా పని చేస్తున్న నజమ్ సేథీని గురువారం చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఈ మేరకు వార్షిక సర్వసభ్య సమావేశంలో సేథీ ఎంపికకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఇక తాను పీసీబీ చైర్మన్ గా కొనసాగనని షహర్యార్ ఖాన్ స్పష్టం చేయడంతో ఆయన స్థానంలో సేథీని ఎంపిక చేశారు.
అయితే షహర్యార్ ఆగస్టు నెలవరకూ చైర్మన్ గా కొనసాగనున్నారు. ఆ తరువాతే నజమ్ సేథీ పీసీబీ చైర్మన్ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. కాగా, షహర్యార్ తరహాలోనే ఆయన శిష్యుడు సేథీ కూడా పాకిస్తాన్ క్రికెట్ ను అభ్యున్నతిలో నడిపిస్తారని పీసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది.