Shaharyar Khan
-
పీసీబీ చీఫ్‌గా నజమ్ సేథీ
కరాచీ:పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నూతన చైర్మన్ గా నజమ్ సేథీ ఎంపికయ్యారు. గత కొంతకాలంగా పీసీబీ ఎగ్జిక్యూటివ్ చీఫ్ గా పని చేస్తున్న నజమ్ సేథీని గురువారం చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఈ మేరకు వార్షిక సర్వసభ్య సమావేశంలో సేథీ ఎంపికకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఇక తాను పీసీబీ చైర్మన్ గా కొనసాగనని షహర్యార్ ఖాన్ స్పష్టం చేయడంతో ఆయన స్థానంలో సేథీని ఎంపిక చేశారు. అయితే షహర్యార్ ఆగస్టు నెలవరకూ చైర్మన్ గా కొనసాగనున్నారు. ఆ తరువాతే నజమ్ సేథీ పీసీబీ చైర్మన్ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. కాగా, షహర్యార్ తరహాలోనే ఆయన శిష్యుడు సేథీ కూడా పాకిస్తాన్ క్రికెట్ ను అభ్యున్నతిలో నడిపిస్తారని పీసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. -
భారత్‌లో ఆడటానికి సిద్ధం
పాక్ బోర్డు చీఫ్ షహర్యార్ ఖాన్ కరాచి: చిరకాల ప్రత్యర్థి భారత్‌తో వారి సొంతగడ్డపై తాము ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ షహర్యార్ ఖాన్ తెలిపారు. భద్రత పరమైన సమస్యలున్నప్పటికీ తమ జట్టును భారత్‌కు పంపడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే భారత్ నుంచి దీనిపై ఎలాంటి స్పందన రావడం లేదని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగితే బోలేడంతా ఆదాయం సమకూరుతుందని, దీన్ని ఐసీసీ కూడా గుర్తించిందని తెలిపారు. నిజానికి 2017 డిసెంబర్లో ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్‌లు జరగాల్సి ఉండగా.. 2008 ముంబై దాడుల అనంతరం దాయాది దేశంలో క్రీడ సంబంధాలను భారత్ తెంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య కుదరిన ఎంఓయూను అమలు చేయాలని భారత్‌కు పీసీబీ నోటీసు కూడా పంపించిన సంగతి తెలిసిందే. మరోవైపు వచ్చే జూలైలో బంగ్లాదేశ్‌లో పాక్ పర్యటిస్తుందని షహర్యార్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో పాక్ పర్యటించినా ఆదేశం పాక్‌లో పర్యటించలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో బంగ్లా బోర్డు పర్యటన షెడ్యూల్ పంపడంతో ఆదేశానికి పాక్ జట్టును పంపడానికి పీసీబీ అంగీకారం తెలిపింది. మరోవైపు వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడోటెస్టు ద్వారా రిటైరవుతున్న దిగ్గజాలు యూనిస్ ఖాన్, మిస్వావుల్ హక్‌లను సత్కరించాలని పీసీబీ భావిస్తోంది. -
బీసీసీఐపై చర్యలకు పీసీబీ సిద్ధం!
కరాచీ: గత కొన్నేళ్లుగా తమతో క్రికెట్ ఆడటానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)పై చర్యలకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సిద్ధమైంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోలో బోర్డుపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమైనట్లు పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు. దీనిలో భాగంగా త్వరలోనే న్యాయ నిపుణలను కలవనున్నట్లు బోర్డు సమావేశంలో పేర్కొన్నారు. బీసీసీఐపై చర్యలకు పీసీబీ ఆమోద ముద్ర వేసిన విషయాన్ని షహర్యార్ ఖాన్ తాజాగా తెలిపారు. '2014లో ఇరు క్రికెట్ బోర్డులు దైపాక్షిక సిరీస్‌లు ఆడటానికి ఒప్పందం చేసుకున్నాయి. ఆ విషయాన్ని బీసీసీఐ పక్కన పెట్టేసింది. మాతో సిరీస్ ఆడటాన్ని బీసీసీఐ వ్యతిరేకిస్తోంది. మా మధ్య ఒప్పందం ప్రకారం 2015 మొదలుకొని 2022 వరకూ ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలి. అందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలే(ఐసీసీ) సాక్ష్యం. ఐసీసీ స్థాయిలో ఒప్పందం జరిగిన తరువాత బీసీసీఐ ఎందుకు మాతో ఆడటం లేదు. ఆ క్రమంలోనే బీసీసీఐపై చర్యలకు సిద్ధమవుతున్నాం' అని షహర్యార్ పేర్కొన్నారు. 2007 తరువాత భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు. 2007లో చివరిసారి భారత్‌లో పాకిస్తాన్ పర్యటించింది. ఆ తరువాత పాకిస్తాన్ తో సిరీస్ కు బీసీసీఐ విముఖత వ్యక్తం చేయడంతో పీసీబీకి కొన్ని వందల కోట్ల రూపాయిలను నష్టపోయింది. దీనిలో భాగంగానే బీసీసీఐపై న్యాయపరమైన చర్యలు తీసుకుని కొంత మేరకు లబ్దిపొందాలని యోచిస్తోంది. -
పాక్ క్రికెట్ లో ఖాన్ కామెంట్స్ దుమారం
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ చేసిన 'డిగ్రీ' వ్యాఖ్యలపై సీనియర్ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్థాన్ క్రికెటర్లు చదువులో వెనకబడ్డారని, మిస్బా-వుల్-హక్ మినహా డిగ్రీ చదివాళ్లే లేరని షహర్యార్ కామెంట్ చేశారు. దీనిపై సీనియర్ బ్యాట్స్ మన్ మహ్మద్ హఫీజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. చదువుతో ఆటకు సంబంధం ఏమిటని ప్రశ్నించాడు. క్రికెట్టే తమకు కంప్లీట్ ఎడ్యుకేషన్ అని అన్నాడు. టెస్టు క్రికెటర్ గా చెప్పుకోవడానికి గర్వపడతానని, అదే తన డిగ్రీ అని వ్యాఖ్యానించాడు. అయితే అందరికీ చదువు ముఖ్యమేనని, దీనికి డిగ్రీలే కొలమానం కాదన్నాడు. పాకిస్థాన్ క్రికెటర్లు చదువును నిర్లక్ష్యం చేస్తున్నారని షహర్యార్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు సీనియర్ ఆటగాళ్లు గుర్రుగా ఉన్నారు. అయితే వారు బహిరంగంగా మాట్లాడకుండా, తమ అభిప్రాయాలను పీసీబీ వర్గాలకు రహస్యంగా వెల్లడించినట్టు సమాచారం. -
'భారత్ లో ఆడే ప్రసక్తే లేదు'
న్యూఢిల్లీ: టీమిండియాతో డిసెంబర్ లో జరగాల్సిన ద్వైపాకిక్ష క్రికెట్ సిరీస్ ను భారత్ లో ఆడే ప్రసక్తే లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ముందుస్తు షెడ్యూల్ ప్రకారం ఆ సిరీస్ ను యూఏఈలో మాత్రమే ఆడాలనుకుంటున్నట్లు పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ మేరకు భారత్ లో ఆడాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చేసిన విన్నపాన్ని షహర్యార్ ఖాన్ తోసిపుచ్చారు. ఎట్టి పరిస్థితిల్లోనూ ఇరు దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ ను భారత్ లో ఆడబోమని పేర్కొన్నారు. ఒకవేళ భారత్ తమతో ఆడాలనుకుంటే మాత్రం అది యూఏఈలో మాత్రమే జరుగుతుందని షహర్యార్ తెలిపారు. 'భారత్ లో సిరీస్ ఆడే విజ్ఞప్తిని తోసిపుచ్చుతున్నాం. యూఏఈలో జరగాల్సిన సిరీస్ ను భారత్ లో నిర్వహించడానికి మేము అంగీకరించం. ఇందులో వేరే ప్రశ్నే లేదు'అని షహర్యార్ తెలిపారు. 2009వ సంవత్సరంలో లాహార్ లో శ్రీలంక -పాకిస్థాన్ ల మధ్య సిరీస్ జరిగే సమయంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడటంతో అప్పట్నుంచి పీసీబీ తమ క్రికెట్ సిరీస్ లను స్వదేశంలో నిర్వహించకుండా మిగతా వేదికలపై జరుపుతోంది. దీనిలో భాగంగానే బీసీసీఐ-పీసీబీల మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్ లకు ఒప్పందం కుదరింది. ఆ ఒప్పందంలో ముందస్తు సిరీస్ ను డిసెంబర్ లో యూఏఈలో నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ తో క్రికెట్ సిరీస్ లు జరగడానికి రాజకీయ పరమైన అంశాలు ముడిపడి ఉండటంతో ఆ సిరీస్ ను భారత్ లో జరపాలని బీసీసీఐ భావించింది. కాగా, అందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి ఎటువంటి సానుకూలత లేకపోవడంతో ఆ సిరీస్ పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
'నువ్వు భారత్ ఎందుకు వెళ్లావు?'
ఇస్లామాబాద్: భారత పర్యటనకు వచ్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతినిధులపై ఆ దేశ ప్రభుత్వం కన్నెర్ర జేసింది. భారత పర్యటనకు ఎందుకు వెళ్లారో వివరణ ఇవ్వాలని పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ ను కోరింది. షహర్యార్ ఖాన్ నేతృత్వంలో పీసీబీ బృందం రెండు వారాల కిందట ముంబైలోని బీసీసీఐ ప్రధాన్య కార్యాలయంలో చర్చలు జరపుతుండగానే.. దాని ఎదురుగా శివసేన పాకిస్థాన్ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించింది. దీంతో వారి పర్యటన అర్ధంతరంగా ముగిసింది. ఈ నేపథ్యంలో పీసీబీ ప్రతినిధులపై పర్యటనపై పాకిస్థాన్ క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి మియన్ రియజ్ హుస్సేన్ పిర్జాదా తీవ్రంగా స్పందించారు. భారత పర్యటనకు పీసీబీ బృందం ప్రభుత్వ అనుమతి తీసుకుందా? లేదా? వివరణ ఇవ్వాలని కోరుతూ ఆయన నోటీసులు జారీచేశారని డాన్ పత్రిక తెలిపింది. భారత్-పాకిస్థాన్ మధ్య మళ్లీ క్రికెట్ సిరీస్ లను పునరుద్ధరించే విషయమై చర్చలు జరిపేందుకు పీసీబీ ఈ పర్యటన చేపట్టింది. -
వచ్చే ఏడాదే అతడి రిటైర్మెంట్!
కరాచీ: రిటైర్మెంట్ అంశంపై కొన్ని రోజులవరకు ఏ నిర్ణయం తీసుకోవద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్‌ను కోరింది. వచ్చే ఏడాది వరకూ ఆటను కొనసాగించాలని బోర్డు మిస్బాను సంప్రదించింది. ఇంగ్లండ్‌తో సిరీస్ జరిగే వరకు వీడ్కోలు విషయంపై ఎటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవద్దని పేర్కొంది. పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ లాహోర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ ముగిశాక తన రిటైర్మెంట్ విషయాన్ని బోర్డుకు వెల్లడిస్తాడని మిస్బా చెప్పాడు. ఒకవేళ వీడ్కోలు పలకాలని మిస్బా భావించినట్లయితే, మరో ఏడాదిపాటు ఆటను కొనసాగించాలని అతడిని కోరతామన్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టూర్లలో కెప్టెన్, సీనియర్ ప్లేయర్‌గా మిస్బా జట్టులో ఉండటం మాకు కలిసొస్తుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. గతవారం దుబాయ్‌లో ఇంగ్లండ్‌పై టెస్టు మ్యాచ్ గెలిచిన అనంతరం తన రిటైర్మెంట్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించాడు. 2010లో పాక్ కెప్టెన్సీ చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ భారత్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్లతో సిరీస్‌లు జరగలేదని, వచ్చే ఏడాది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లతో టెస్ట్ సిరీస్‌లు ముగిశాక మిస్బా రిటైర్మెంట్ అంశంపై నిర్ణయం తీసుకుంటామని షహర్యార్ ఖాన్ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఆసీస్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఓటమి అనంతరం వన్డేలకు మిస్బా గుడ్ బై చెప్పిన విషయం విదితమే. -
'భారత్-పాక్‌ల మధ్య క్రికెట్ అనుమానమే'
కరాచీ: తాజా పరిణామాల దృష్ట్యా భారత్, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ సిరీస్ జరిగే అవకాశాలు కనిపించడంలేదని పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఈ ఏడాది డిసెంబర్లో దాయాది దేశాల మధ్య సిరీస్ నిర్వహించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యాలు చేశారు. సిరీస్ నిర్వహించాలంటే ఇరు దేశాలు సుముఖత వ్యక్తం చేసినప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. దుబాయ్‌లో వచ్చేవారం బీసీసీఐ నూతన అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌తో ఇరుదేశాల మధ్య క్రికెట్ సిరీస్ గురించి ఐసీసీ సమావేశాల్లో చర్చిస్తానని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపిన మరునాడే అజీజ్ ఈ వ్యాఖ్యాలు చేయడం గమనార్హం. 2015 నుంచి 2022ల మధ్య భారత్-పాక్ జట్లు ఆరు సిరీస్‌లు ఆడేందుకు చర్చించనున్నట్లు పీసీబీ చీఫ్ పేర్కొన్నాడు. ఇరుదేశాల మధ్య సిరీస్ జరగకపోవడం అంత మంచిది కాదని అజీజ్ అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి సమావేశాలలో పాల్గొన్న భారత్, పాక్ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లు ఒకరికొకరు దూరంగా ఉండటం కూడా ఈ సిరీస్ పట్ల అనిశ్చితిని కొనసాగిస్తోంది. -
లంచం ఇవ్వలేదు
జింబాబ్వే పర్యటనపై పాక్ కరాచీ: తమ దేశంలో పర్యటించేందుకు జింబాబ్వే ఆటగాళ్లకు లంచాలు ఇచ్చామనే ఆరోపణలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ ఖండించారు. జింబాబ్వే బోర్డుకు ఖర్చుల కింద దాదాపు 5 మిలియన్ డాలర్ల (రూ. 3 కోట్ల 20 లక్షలు)ను ఇచ్చినట్టు ఆయన తెలిపారు. పాక్‌లో ఆడినందుకు జింబాబ్వే క్రికెటర్లకు లంచాలు ఇచ్చారంటూ కథనాలు వచ్చాయి.