కరాచీ: పాకిస్తాన్ దిగ్గజ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ ఆకస్మిక మృతి పట్ల ఆ దేశ ప్రధాని, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖాదిర్ హఠాన్మరణం దేశ క్రికెట్‌కు ఎంతో లోటని సంతాపం వ్యక్తం చేశారు. తనకు ఎంతో ఇష్టమైన ఖాదిర్ మృతి వార్త తెలుసుకుని షాక్‌కు గురైనట్లు ఇమ్రాన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ‘ నేనొక మంచి స్నేహితున్ని కోల్పోయాను. దేశ క్రికెట్ అభ్యున్నతి ఖాదిర్ ఎంతో కృషి చేశాడు. అతనొక అద్భుతమైన క్రికెటర్. ఖాదిర్ మృతి విస్మయానికి గురి చేసింది. ఆయన ఆత్మను అల్లా ఆశీర్వదిస్తాడు. ఖాదిర్ మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటు. వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా’ అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.
ఖాదిర్‌కు గుండె పోటు రావడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఖాదిర్ మృతి చెందారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు విశేషమైన సేవలందించిన ఘనత ఖాదిర్‌ది. ప్రధానంగా లెగ్ స్పిన్‌కు ఆయన ఎంతో ప్రాచుర్యం తెచ్చారు. అబ్దుల్ ఖాదిర్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లు సైతం తడబడేవారు. 2009లో చీఫ్ సెలక్టర్‌గా ఖాదిర్ సేవలందిచారు. సెప్టెంబర్ 15వ తేదీన 64వ పుట్టిన రోజు జరుపుకోవాల్సిన తరుణంలో ఖాదిర్ ఇలా ఆకస్మికంగా మృతి చెందండం కంట తడిపెట్టిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment