Abdul Qadir
-
రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ క్రికెటర్.. నాలుగేళ్లకే కెరీర్ ఖతం
పాకిస్తాన్ క్రికెటర్ ఉస్మాన్ కాదిర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై తాను అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించబోవడం లేదని తెలిపాడు. దేశం తరఫున ఆడే గొప్ప అవకాశం తనకు దక్కిందని.. తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. ఒడిదుడుకుల్లో తనకు మద్దతుగా నిలిచిన అభిమానుల రుణం తీర్చుకోలేనని ఉద్వేగానికి లోనయ్యాడు.పాకిస్తాన్ మేటి స్పిన్నర్లలో ఒకడైన అబ్దుల్ కాదిర్ కుమారుడే ఉస్మాన్ కాదిర్. ఈ లెగ్ స్పిన్నర్ 2020లో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. గతేడాది అక్టోబరులో ఆసియా క్రీడల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు ఆఖరిసారిగా ఆడాడు.ఇప్పటి వరకు కేవలం ఒక వన్డే ఆడిన ఉస్మాన్ కాదిర్ ఖాతాలో ఒక వికెట్ ఉంది. ఇక పాక్ తరఫున ఆడిన 25 టీ20లలో అతడు 31 వికెట్లు పడగొట్టగలిగాడు. అయితే, 31 ఏళ్ల ఉస్మాన్‌కు జాతీయ జట్టులో ఎప్పుడూ సుస్థిర స్థానం దక్కలేదు. దీంతో కలత చెందిన అతడు.. తాను ఇక పాకిస్తాన్‌కు ఆడనని.. ఆస్ట్రేలియా తరఫున ఆడాలనుకుంటున్నానని 2018లో వ్యాఖ్యానించాడు.ఇక తాజాగా.. రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగానూ పాకిస్తాన్ క్రికెట్ వీడ్కోలు పలుకుతున్నానని ఉస్మాన్ పేర్కొనడం గమనార్హం. అంతేకాదు.. తాను జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నానని.. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తాననంటూ ట్విస్టు ఇ వ్వడం విశేషం. ఏదేమైనా పాకిస్తాన్ జట్టుతో తనకున్న అనుబంధం మర్చిపోలేనని.. సహచర ఆటగాళ్లు, కోచ్‌లకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా ఉస్మాన్ కాదిర్ ఇటీవల చాంపియన్స్ వన్డే కప్‌లో డాల్ఫిన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. -
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చంద్రపాల్, అబ్దుల్ ఖాదీర్, చార్లెట్ ఎడ్వర్డ్స్
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ శివనారాయణ్ చంద్రపాల్‌కు అరుదైన గౌరవం లభించింది. చంద్రపాల్‌తో పాటు పాకిస్తాన్ లెజెండరీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదీర్, ఇంగ్లండ్ మహిళా దిగ్గజ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్లు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ దిగ్గజ త్రయాలను టి20 ప్రపంచకప్‌లో భాగంగా నవంబర్ 9న(బుధవారం) న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య జరగనున్న తొలి సెమీస్‌కు ముందు సత్కరించనున్నారు. సిడ్నీ మైదానంలో క్రికెట్ అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. శివనారాయణ్ చంద్రపాల్.. 21 ఏళ్ల పాటు వెస్టిండీస్ క్రికెట్లో సేవలందించిన శివ్‌నరైన్ చంద్రపాల్ 107వ క్రికెటర్గాఘైసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించాడు. 1994లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన చంద్రపాల్ 2016లో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా విండీస్ జట్టులో మిడిలార్డర్లో కీలకపాత్ర పోషించాడు.ముఖ్యంగా అతని ఓపికకు సలాం కొట్టొచ్చు. క్రీజులో పాతుకుపోతే గంటల పాటు ఆడడం అతని ప్రత్యేకత. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 20,988 పరుగులు సాధించాడు. ఇందులో 41సెంచరీలు, 125 అర్థసెంచరీలు ఉన్నాయి. ''ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడం సంతోషంగా ఉంది. ఎంతోమంది లెజెండరీ క్రికెటర్ల మధ్య నా పేరు ఉండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా'' అంటూ ఐసీసీ రిలీజ్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. చార్లెట్ ఎడ్వర్డ్స్.. 16 ఏళ్ల వయసులోనే మహిళల క్రికెట్లో అడుగుపెట్టిన చార్లెట్ ఎడ్వర్డ్స్ ఇంగ్లండ్ తరపున 20 ఏళ్ల పాటు తన సేవలందించింది. 20 ఏళ్ల కెరీర్లో 191 వన్డేల్లో 5992 పరుగులు, 95 టి20ల్లో 2605 పరుగులు, 23 టెస్టుల్లో 1676 పరుగులు సాధించింది. ఆమె ఖాతాలో నాలుగు టెస్టు సెంచరీలు, 9 వన్డే సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లండ్ మహిళా జట్టుకు కెప్టెన్‌గా 2009లో వన్డే వరల్డ్‌కప్, టి20 వరల్డ్‌కప్ సాధించి రికార్డు సృష్టించింది. చార్లెట్ వన్డేల్లో చేసిన పరుగులు.. మహిళల క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ రెండో అత్యధికంగా ఉండడం విశేషం. ఇక చార్లెట్ ఎడ్వర్డ్స్ 108వ క్రికెటర్‌గా హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకుంది. అబ్దుల్ ఖాదీర్.. పాకిస్తాన్ దివంగత ఆటగాడు అబ్దుల్ ఖాదీర్ 109వ క్రికెటర్‌గా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించాడు. పాక్ తరపున లెజెండరీ లెగ్ స్పిన్నర్‌గా పేరు పొందిన ఖాదీర్ 67 మ్యాచ్‌ల్లో 236 వికెట్లు తీశాడు. ఇక 1987లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 56 పరుగులిచ్చి తొమ్మిది వికెట్లు తీయడం ఆయన కెరీర్లో అత్యుత్తంగా నిలిచిపోయింది. 1993లో చివరి మ్యాచ్ ఆడిన అబ్దుల్ ఖాదీర్ 2019లో 63 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. ఇక అబ్దుల్ ఖాదీర్‌కు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడంపై ఆయన కొడుకు ఉస్మాన్ ఖాదీర్ స్పందించాడు.'' నా తండ్రికి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించినందుకు మా కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. క్రికెట్‌కు ఆయన ఎంతో సేవ చేశారు. ఇవాళ దానికి తగిన ప్రతిఫలం లభించింది.'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: 'కోహ్లి కొట్టిన సిక్స్ చరిత్రలో నిలిచిపోతుంది' A Pakistan legend, England trailblazer and West Indies great are the three latest additions to the ICC Hall Of Fame 🌟https://t.co/CXb6Z2qgVN — ICC (@ICC) November 8, 2022 🏏 20,988 international runs 🌴 Former West Indies captain 🔥 30 Test centuries at an average of 51.37 The legendary left-hander is among the latest ICC Hall of Fame inductees.https://t.co/1KFH9Aqt6W — ICC (@ICC) November 8, 2022 🔥 Record-breaking numbers 🏅 ICC Woman’s Player of the Year in 2008 🏴 Captained two World Cup winning campaigns The legendary England superstar has been inducted into the ICC Hall of Fame.https://t.co/jAEDgELX0E — ICC (@ICC) November 8, 2022 🏏 171 international matches ☝️ 236 Test wickets and 132 ODI wickets 👊 "A bowler with killer instincts" Pakistan's legendary leg-spinner has been inducted into the ICC Hall of Fame.https://t.co/KjG5ejLEOu — ICC (@ICC) November 8, 2022 -
పాక్ అణు శాస్త్రవేత్త ఖదీర్ ఖాన్ కన్నుమూత
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త, ఆ దేశ అణు పితామహుడిగా పేరు తెచ్చుకున్న అబ్దుల్ ఖదీర్‌ఖాన్ (85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖదీర్ ఖాన్ ఆదివారం ఉదయం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ప్రభుత్వం తెలిపింది. 1936లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో ఖదీర్ ఖాన్ జన్మించారు. దేశ విభజన సమయంలో 1947లో ఖదీర్ ఖాన్ కుటుంబం పాకిస్తాన్‌కు వలసవెళ్లింది. కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఆగస్ట్ 26వ తేదీన ఇస్లామాబాద్‌లోని ఖాన్ రీసెర్చ్ లేబొరేటరీ(కేఆర్ఎల్) ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి రావల్పిండిలోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు. కోవిడ్ నుంచి కోలుకున్నాక డిశ్చార్జి చేశారు. ఆదివారం ఉదయం స్వల్ప అనారోగ్యానికి గురి కావడంతో కేఆర్‌ఎల్‌కి తీసుకు రాగా అక్కడే ఆయన కన్నుమూశారని మీడియా తెలిపింది. ఇస్లామాబాద్‌లోని ఫైసల్ మసీదులో అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఖదీర్‌ఖాన్ మృతికి అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. పాకిస్తాన్ 1998లో అణు పరీక్ష నిర్వహించడంతో ఖదీర్ ఖాన్ పేరు మారుమోగిపోయింది. ముస్లిం దేశాల్లో మొట్టమొదటి సారిగా అణు బాంబు తయారీ సామర్థ్యం సొంతం చేసుకున్న దేశంగా పాకిస్తాన్ నిలిచిపోయింది. అయితే, పాకిస్తాన్ నుంచి ఇరాన్, ఉత్తరకొరియాలకు అణు పరిజ్ఞానం బదిలీ చేసినట్లు బహిరంగంగా అంగీకరించడం ఆయన ప్రతిష్టను దెబ్బతీసింది. 2004 నుంచి ఐదేళ్లపాటు ప్రభుత్వం ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచింది. -
సత్యమేవ జయతే!
ఒకసారి అబ్దుల్ ఖాదర్ అనే యువకుడు స్నేహితులతో కలసి ఉన్నత విద్యాభ్యాసం కొరకు సుదూర నగరానికి ప్రయాణమయ్యాడు. ఆ రోజుల్లో ఎలాంటి వాహన సదుపాయాలూ ఉండేవి కావు. ఎంతదూరమైనా కాలినడకనే ప్రయాణం. బందిపోట్ల బెడద కూడా ఎక్కువే. మార్గమధ్యంలో అబ్దుల్ ఖాదర్‌ను దొంగలు అడ్డుకున్నారు. నిలువెల్లా సోదా చేశారు. సంచులన్నీ వెదికారు. ఖాదర్ వద్ద ఏమీ దొరకలేదు. అబద్ధాలాడకుండా ఇంకా ఎవరెవరి దగ్గర ఏమేమున్నాయో అప్పగించండి. అని హుకుం జారీ చేశారు దొంగలు. అందరిదగ్గర ముందే దోచుకోవడం మూలాన ఎవరి దగ్గరా ఏమీ మిగల్లేదు. కాని అబ్దుల్ ఖాదర్ మాత్రం ఎవరికీ కనబడకుండా రహస్యంగా దాచిన పైకాన్ని తీసి దొంగలకు ఇచ్చేశాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం దొంగల వంతయింది. ఆలోచనలో పడిన దొంగల నాయకుడు అబ్దుల్ ఖాదర్ ను దగ్గరికి పిలిచాడు. ‘నిజం చెప్పు, ఎంత వెదికినా దొరక్కుండా ఈ పైకాన్ని ఎక్కడ దాచావు?’. అని గట్టిగా ప్రశ్నించాడు. ‘అబద్ధం చెప్పేవాణ్ణయితే రహస్యంగా దాచుకున్నది మీకెందుకు చూపిస్తాను? ఇదిగో ఇక్కడ దాచింది మా అమ్మ, ’ అంటూ, నడుము బెల్టుకు లోపలిభాగంలో వస్త్రానికి అతుకేసి కుట్టిన వైనాన్ని వివరించాడు ఖాదర్. ఈసారి మరింత ఆశ్చర్యానికి లోనైన నాయకుడు, ‘మేమెలాగూ దాన్ని కనిపెట్టలేదు, మరి అంత రహస్యాన్ని మాకు తెలియజేసి ఎందుకు నష్టపోవాలనుకున్నావు?’ అన్నాడు. ‘ఇది నష్టపోవడం ఎలా అవుతుంది, ఎట్టి పరిస్థితిలోనూ అబద్ధం చెప్పకూడదని, సత్యమే మాట్లాడాలని, దీనివల్ల మేలే తప్ప కీడు జరగదని చెప్పింది మా అమ్మ. నేను అమ్మ మాటను ఎలా జవదాటగలను? అసత్యం ఎలా పలకగలను? అమ్మ మాట వినకుండా అబద్ధాలాడితే అల్లాహ్ శిక్షించడా?’ అని ఎదురు ప్రశ్నించాడు అబ్దుల్ ఖాదర్ అమాయకంగా, నిర్భయంగా. ఈ మాటలు దొంగల నాయకుడిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఆలోచనలో పడిపొయ్యాడతడు. తన పాపాల చిట్టా రీలులా కళ్ళముందు కదలాడుతుండగా, కరుడు గట్టిన భయంకర నేరస్థుని కళ్ళు ధారాప్రవాహంగా వర్షిస్తున్నాయి. పరివర్తిత హృదయంతో దొంగల నాయకుడు ఒక్కసారిగా అబ్దుల్ ఖాదర్ ను గుండెలకు హత్తుకున్నాడు. తన సత్యసంధత, సత్యవాక్పరిపాలనతో కరుడుగట్టిన దొంగల్లో సైతం పరివర్తన తీసుకు రాగలిగిన ఆ చిన్నారి అబ్దుల్ ఖాదర్ ఎవరో కాదు, ఆయనే హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదర్ జీలానీ (ర) దైవం మనందరికీ సదా సత్యమే పలికే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
‘మంచి స్నేహితున్ని కోల్పోయాను’
కరాచీ: పాకిస్తాన్ దిగ్గజ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ ఆకస్మిక మృతి పట్ల ఆ దేశ ప్రధాని, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖాదిర్ హఠాన్మరణం దేశ క్రికెట్‌కు ఎంతో లోటని సంతాపం వ్యక్తం చేశారు. తనకు ఎంతో ఇష్టమైన ఖాదిర్ మృతి వార్త తెలుసుకుని షాక్‌కు గురైనట్లు ఇమ్రాన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ‘ నేనొక మంచి స్నేహితున్ని కోల్పోయాను. దేశ క్రికెట్ అభ్యున్నతి ఖాదిర్ ఎంతో కృషి చేశాడు. అతనొక అద్భుతమైన క్రికెటర్. ఖాదిర్ మృతి విస్మయానికి గురి చేసింది. ఆయన ఆత్మను అల్లా ఆశీర్వదిస్తాడు. ఖాదిర్ మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటు. వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా’ అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఖాదిర్‌కు గుండె పోటు రావడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఖాదిర్ మృతి చెందారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు విశేషమైన సేవలందించిన ఘనత ఖాదిర్ది. ప్రధానంగా లెగ్ స్పిన్‌కు ఆయన ఎంతో ప్రాచుర్యం తెచ్చారు. అబ్దుల్ ఖాదిర్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి దిగ్గజ బ్యాట్స్మెన్లు సైతం తడబడేవారు. 2009లో చీఫ్ సెలక్టర్‌గా ఖాదిర్ సేవలందిచారు. సెప్టెంబర్ 15వ తేదీన 64వ పుట్టిన రోజు జరుపుకోవాల్సిన తరుణంలో ఖాదిర్ ఇలా ఆకస్మికంగా మృతి చెందండం కంట తడిపెట్టిస్తోంది. -
పాక్ స్పిన్ దిగ్గజం కన్నుమూత
లాహోర్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్, లెగ్ స్పిన్ దిగ్గజం అబ్దుల్ ఖాదిర్(63) గుండెపోటుతో కన్నముశారు. తీవ్రమైన గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. లాహోర్‌లోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచారు. పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్, ఉమర్ సోదరుడు కమ్రాన్ అక్మల్ ఈ వార్తను ధృవీకరించారు. దీంతో ఖాదిర్ హఠాన్మరణంపై పలువురు క్రీడానిపుణులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రపంచ క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన 70-80 కాలంలో, తన బౌలింగ్ యాక్షన్, మణికట్టు స్పిన్ మ్యాజిక్‌తో అద్భుత విజయాలు అందించిన ఘనత ఖాదిర్దేనని క్రికెట్ పండితులు, ఇతరు అభిమానులు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఎంతో ఇష్టమైన క్రికెటర్ అయిన ఖాదిర్ అంతర్జాతీయ కెరీర్లో 67 టెస్టులు, 104 వన్డేల్లో మొత్తం 368 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక లెగ్‌స్పిన్ బౌలింగ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఖాదిర్ గుగ్లీకి కూడా ఎంతో ప్రాచుర్యం తీసుకొచ్చాడు. మరోవైపు ఎగ్జిబిషన్ మ్యాచ్ సందర్భంగా 16 ఏళ్ల సచిన్ టెండూల్కర్‌పై ఖాదిర్ విసిరిన సవాలు, దాని ఎదుర్కొన్న తీరు క్రికెట్ అభిమానులు ఎలా మర్చిపోగలరు? 2009 లో చీఫ్ సెలెక్టర్‌గా పనిచేశారు. ఇంగ్లాండ్‌లో ఐసీసీ ప్రపంచ టి 20 గెలిచిన జట్టు ఆయన ఎంపిక చేసినదే కావడం విశేషం.ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌ను ఎంపిక చేయకపోవడంపై మాజీ పిసిబి చైర్మన్ ఎజాజ్ బట్‌తో విభేదాలు రావడంతో ఖాదీర్ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అబ్దుల్ ఖాదిర్‌కు భార్య, నలుగురు కుమారులు. కుమారులు రెహమాన్, ఇమ్రాన్, సులేమన్ , ఉస్మాన్ ఫస్ట్ క్లాస్ స్థాయి క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించగా ఉస్మాన్ ( తండ్రిలాగే లెగ్ స్పిన్నర్ కూడా) గత సీజన్లో బిగ్ బాష్ టీ 20 లీగ్‌లో కనిపించాడు. ఇతను త్వరలో ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నామని తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం పాక్ జట్టుకు ఆడుతున్న ఉమర్ అక్మల్.. ఖాదిర్‌కు స్వయానా అల్లుడు. ఖాదిర్ ఈనెల (సెప్టెంబర్) 15 న తన 64 వ పుట్టినరోజు జరుపుకుని వుండేవారు -
చాలా నష్టం చేశాడు.. ఇంకా కోచ్‌గా ఎందుకు?
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన మికీ ఆర్థర్‌ను తిరిగి కొనసాగించాలా.. వద్దా అనే దానిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆర్థర్‌కు మరో చాన్స్ ఇవ్వాలంటూ పాక్ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ పేర్కొనగా, ఆ దేశానికే స్పిన్ లెజెండ్ అబ్దుల్ ఖాదిర్ మాత్రం విభేదించాడు. ఇంకెంత కాలం ఆర్థర్‌ను కోచ్‌గా కొనసాగిస్తారంటూ ప్రశ్నించాడు. అసలు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఆర్థర్ ఏమి చేశాడంటూ నిలదీశాడు. అదే సమయంలో అక్రమ్ సూచనను తప్పుబట్టాడు. తన దృష్టితో చూస్తే ఆర్థర్‌ను కోచ్‌గా కొనసాగించాలని అక్రమ్ పీసీబీకి చెప్పడం న్యాయం కాదన్నాడు. పీసీబీ కమిటీలో సభ్యుడిగా ఉన్న అక్రమ్.. ఆర్థర్ అండగా నిలవడం బాలేదన్నాడు. తానైతే ఆర్థర్ సేవలు ఇక పాకిస్తాన్‌కు అవసరం లేదనే చెబుతానన్నాడు. ఆర్థర్ వచ్చిన తర్వాత పాక్ క్రికెట్ జట్టుకు నష్టమే జరిగిందే కానీ లాభం చేకూరలేదన్నాడు. కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్, సొహైల్ ఖాన్ వంటి క్రికెటర్లు దూరం కావడానికి ఆర్థరే కారణమని విమర్శించాడు. వహాబ్ రియాజ్ వంటి ఒక స్టార్ పేసర్ పాక్ క్రికెట్‌కు రెండేళ్లు దూరం కావడానికి ఆర్థరే కారణమన్నాడు. వరల్డ్‌కప్‌కు చివరి నిమిషంలో గత్యంతరం లేక ఒత్తిడితో రియాజ్‌కు చోటు ఇవ్వడానికి ఆర్థర్ ఒప్పుకున్నాడని ఖాదిర్ విమర్శించాడు. ఇక ఆర్థర్ సేవలకు స్వస్తి పలకాలని సూచించాడు. పాక్ జాతీయ క్రికెట్ జట్టును ముందుకు తీసుకు వెళ్లడానికి మిగతా వారికి అవకాశం ఇవ్వాలన్నాడు. -
ఆసీస్ జట్టులో పాక్ క్రికెటర్ !
సిడ్నీ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ ఖదీర్ తనయుడు ఉస్మాన్ ఖదీర్ ఆస్ట్రేలియా జట్టు తరపున బరిలోకి దిగాడు. బుధవారం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన వార్మప్ వన్డే మ్యాచ్‌లో పీఎం-11 జట్టు తరపున తొలిసారి ఆసీస్ జెర్సీ ధరించాడు. తన తండ్రిలానే లెగ్‌స్పిన్‌తో అదరగొట్టి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. పూర్తి స్థాయి ఆసీస్ జట్టు తరపున ఆడాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇప్పటికే ఆదిశగా కసరత్తులు మొదలు పెట్టిన ఈ యువ క్రికెటర్.. త్వరలో ఆ జట్టులో భాగమవుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే పాకిస్తాన్లో సరైన అవకాశాలు లభించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. ప్రస్తుతం టెంపరరీ వీసాతో ఆసీస్ దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న ఉస్మాన్.. త్వరలోనే పౌరసత్వం పొంది ఆ దేశం తరపున ఆడుతానని తెలిపాడు. 2020 టీ20 ప్రపంచకప్ వరకు జట్టులో ఉండటమే తన లక్ష్యంగా చెప్పుకొచ్చాడు. అంతకు ముందే తనకు వన్డే, టెస్టుల్లో అవకాశం లభిస్తే ఇంకా మంచిదని అభిప్రాయపడ్డాడు. (చదవండి: ధోని భాయ్ అది పక్కా ఔట్! ) ఈ నిర్ణయాన్ని తన తండ్రి ఖదీర్ అంత సులువుగా ఒప్పుకోలేదన్నాడు. ‘కొన్నేళ్ల క్రితం నా తండ్రితో నేను ఆస్ట్రేలియా తరపున ఆడాలనుకుంటున్నానని చెప్పాను. దీనికి ఆయన కుదురదు.. పాకిస్తాన్ తరుపునే ఆడాలని ఆదేశించాడు. కానీ నాకు పాక్ తరపున ఆడే అవకాశం అంతగా రాలేదు. జట్టులో ఎంపికైనప్పటికీ బెంచ్‌కే పరిమితమయ్యాను. ఆసీస్‌కు వచ్చాకే నాకు అవకాశాలు దక్కాయి. దీంతో మా నాన్న కూడా ఒప్పుకున్నారు. నా దీవెనెలు నీకు ఎప్పుడుంటాయి. నీకేం కావాలో నీవు అది చేయగలవన్నారు.’ అని ఉస్మాన్ చెప్పుకొచ్చాడు. ఇక పాక్ క్రికెటర్ ఆసీస్ తరపున ఆడటం ఇదే తొలిసారి కాదు. ఫవాద్ అహ్మద్ 2013లో ఆసీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు అదే బాటలో ఉస్మాన్ నడుస్తున్నాడు. (చదవండి: ముగింపు అదిరింది) చదవండి: ధోని చితక్కొడితే ఎట్టా ఉంటాదో తెలుసా -
పేలుడు పదార్థాల బాధ్యత ఖదీర్‌కు!
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద సంస్థలకు రిక్రూట్మెంట్ తేలికైనా విధ్వంసాలకు అవసరమైన పేలుడు పదార్థాల సేకరణ సవాల్‌గా మారింది. అబుధాబి మాడ్యూల్‌కు సంబంధించిన ‘ఐసిస్ ద్వయం’అబ్దుల్లా బాసిత్, అబ్దుల్ ఖదీర్ మాత్రం ఈ వ్యవహారంలో తెలివిగా వ్యవహరించారు. సంప్రదాయేతర ‘విధ్వంస’ వనరులపై దృష్టి పెట్టారు. ఈ బాధ్యతల్ని సూత్రధారి బాసిత్ ప్రధాన అనుచరుడు ఖదీర్‌కు అప్పగించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గుర్తించారు. శనివారం నగరంలో అరెస్టు చేసిన వీరిని సోమవారం ఢిల్లీలోని పాటియాల కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అనుమతితో తదుపరి విచారణ నిమిత్తం 11 రోజులు (ఈ నెల 24 వరకు) పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఆర్డీ ఎక్స్, అమ్మోనియం నైట్రేట్‌ను సమీకరించే ప్రయత్నంలో నిఘాకు చిక్కే ప్రమాదం ఉం దని సాధారణ వస్తువులపై ఐసిస్ ద్వయం దృష్టిపెట్టింది. ఈ అంశంపై ఖదీర్ ఇంటర్నెట్లో సుదీర్ఘ అధ్యయనమే చేశాడు. పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి వీటిని సమీకరించాడు. షహీన్‌నగర్‌లోని తన ఇంటితోపాటు తన బంధువు ఇంట్లోనూ వీటిపై ప్రయోగాలు చేశాడే కానీ, ఇంకా సఫలీకృతుడు కాలేదు. ఎన్ఐఏ అధికారులు ఇతడి ఇంటి నుంచి ఈ పదార్థాలతోపాటు ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటినీ పరీక్షల నిమిత్తం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లెబోరేటరీకి పంపారు. ఇలాంటి పదార్థాలు మార్కెట్లో తేలిగ్గా దొరకడంతోపాటు ఎవరికీ అనుమానం రాదనే వీటిని ఎంపిక చేసుకున్నామని బాసిత్, ఖదీర్ ఎన్ఐఏకు తెలిపారు. 2014 నుంచి ఐసిస్ భావజాలం... 2014 నుంచి ఐసిస్ భావజాలంతో ఉండి, రెండుసార్లు దేశం దాటేందుకు యత్నించి చిక్కిన, ఇప్పటికీ రెండుసార్లు అరెస్టు అయిన అబ్దుల్లా బాసిత్‌కు ‘ఉగ్రస్ఫూర్తి’ఇచ్చింది అతడి సమీప బంధువు సలావుద్దీన్. నల్లగొండకు చెందిన సలావుద్దీన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబై వెళ్లి అక్కడి స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)తో సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో సిమి కార్యకలాపాల నిర్వహణలో కీలకపాత్ర పోషించాడు. ఆపై రెండేళ్లపాటు సిమికి ఆలిండియా చీఫ్‌గా వ్యవహరించాడు. 2001లో సిమిని కేంద్రం నిషేధించిన తరవాత సలావుద్దీన్ దుబాయ్‌కు మకాం మార్చాడు. 2011లో కేరళలో చిక్కిన ఇతడు 2014 అక్టోబర్‌లో నల్లగొండ నుంచి వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బాసిత్‌లో మార్పు తీసుకురావాలని కుటుంబీకులు ఓ యువతితో వివాహం చేసినా అతడిలో మార్పు రాలేదని అధికారులు చెప్తున్నారు. -
'ఇకనైనా క్రికెట్‌కు గుడ్ బై చెప్పు'
కరాచీ:ఇటీవల భారత్ లో జరిగిన టీ 20వరల్డ్ కప్ లో పేలవ ప్రదర్శనతో కారణంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టులో స్థానం కోల్పోయిన ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఇకనైన క్రికెట్ కు గుడ్ బై చెబితే మంచిదని మాజీ లెగ్ స్సిన్నర్ అబ్దుల్ ఖాదిర్ సలహా ఇచ్చాడు. క్రికెట్ జట్టులో పునరాగమనం కోసం ఆఫ్రిది నిరీక్షించడం ఎంతమాత్రం సరైన పని కాదన్నాడు. తన సత్తా చాటుకుని పాక్ క్రికెట్ జట్టులో స్థానం సంపాదిస్తానన్న వ్యాఖ్యలపై ఖాదిర్ స్పందించాడు. క్రికెట్ అనేది ఆఫ్రిది ఖిల్లా కాదనే విషయం గ్రహిస్తే మంచిదన్నాడు. దీంతో పాటు మరో క్రికెటర్ ఉమర్ అక్మల్ పై కూడా ఖాదిర్ ధ్వజమెత్తాడు. ఉమర్ చేసిన స్వీయ తప్పిదాల కారణంగానే జట్టులో స్థానం కోల్పోయడన్నాడు. ఇదిలా ఉండగా, విదేశీ కోచ్ నియమించాలనే ధోరణితో ఉన్న పీసీబీ సమయాన్ని వృథా చేస్తుందన్నాడు. ఒక విదేశీ కోచ్ కంటే స్థానిక కోచ్ అయితేనే ఆటగాళ్ల గురించి ఎక్కువ తెలిసి ఉంటుందన్నాడు. ఒకవేళ విదేశీ కోచ్‌నే నియమించాలనుకుంటే మాత్రం వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ కంటే మెరుగైన ఆప్షన్ లేదని పీసీబీకి ఖాదిర్ సూచించాడు. -
'క్రికెట్ కోచ్‌ల వల్ల ఉపయోగం లేదు'
కరాచీ: ఏ జాతీయ క్రికెట్ జట్టుకైనా కోచ్ ఉండటం అనేది సర్వ సాధారణంగా మారిపోయింది. ఒక్కమాటలోచెప్పాలంటే అసలు కోచ్లేని క్రికెట్ జట్టు ఉండదంటే అతిశయోక్తికాదేమో. అయితే జాతీయ క్రికెట్ జట్లకు కోచ్‌లను నియమించడాన్ని పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు అబ్దుల్ ఖాదిర్ తీవ్రంగా తప్పుబట్టాడు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని తేల్చిపారేశాడు. అసలు క్రికెట్ కోచ్‌లను ఏర్పాటు చేసుకోవడం వల్ల డబ్బు వృథా కావడమే తప్పితే ప్రయోజనం శూన్యమైన్నాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) గ్రహించి కోచ్ ల నియమాకాన్ని నిలపివేసే నిబంధనను తీసుకువస్తే బాగుంటుందన్నాడు. 'పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇదే నా సలహా. చీఫ్ కోచ్ నియమాకానికి చరమగీతం పాడండి. దానివల్ల ధనంతో పాటు శక్తి కూడా ఆదా అవుతుంది. ఒక పాకిస్తానే కాదు.. మిగతా దేశాల క్రికెట్ జట్లు కూడా కోచ్‌ల వల్ల సాధించేదేమీ లేదు. కోచ్‌లను ప్రమోట్ చేసే విధానాన్ని కూడా ఐసీసీ నిలిపివేయాలి. అంతర్జాతీయ స్థాయిలో జట్టును నడిపించే కెప్టెన్ ఉన్నప్పుడు.. కోచ్ అవసరం లేదు'అని అబ్దుల్ ఖాదిర్ పేర్కొన్నాడు. 1999 నుంచి 2014 వరకూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు పలువురు విదేశీ కోచ్‌లనూ నియమిస్తూనే వచ్చింది. అయినా ఫలితం శూన్యం. 1992 వరల్డ్ కప్‌తో పాటు 2009 లో వరల్డ్ టీ 20 టైటిల్ గెలిచిన పాకిస్తాన్ జట్టుకు ఇంతికాబ్ అలామ్ ఇంఛార్జిగా ఉన్న సంగతిని ఈ సందర్భంగా ఖాదిర్ గుర్తు చేశాడు.