పాకిస్తాన్ పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ కోచ్ పదవి కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దరఖాస్తులను ఆహ్వానించింది. అదే విధంగా లహోర్‌లోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో వివిధ కోచ్ పదవిల కోసం కూడా పీసీబీ దరఖాస్తులను ఆహ్వానించింది. కాగా ఇప్పటివరకు పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ కోచ్ ఏ జట్టుకు లేరు. అయితే ఆధునిక క్రికెట్‌కు అనుగుణంగా తమ ఆటగాళ్లను సన్నద్దం చేయడానికే పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ కోచ్‌ను నియమిస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా తెలిపారు.
ఇక హై ఫార్మమన్స్ కోచ్ పదవికు గల అర్హతలను పీసీబీ ప్రకటించింది."గత 10 సంవత్సరాలలో కనీసం ఐదేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. అంతేకాకుండా జాతీయ లేదా అంతర్జాతీయ జట్లకు లైఫ్ కోచ్‌గా పని చేసి ఉండాలి. మిగితా నాలుగు కోచ్‌లకు గత10 సంవత్సరాలలో కనీసం ఐదేళ్ల మూడవ స్థాయి క్రికెట్ కోచింగ్ అక్రిడిటేషన్‌లో పని చేసి వుంటే చాలు" అని పీసీబీ పేర్కొంది.
చదవండి: IND Vs SA ODI Series: టీమిండియా వన్డే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment