Ramiz Raza
-
భారత్ మొదలుపెట్టింది, అప్పటి నుంచి మాకు ఈ గతి పట్టింది: పాక్ మాజీ కెప్టెన్
సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘెర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో పాక్ దారుణంగా విఫలమై 146 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (448/6) చేసిన పాక్.. ఓవరాక్షన్ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి తగిన మూల్యం చెల్లించుకుంది. పైగా ఈ మ్యాచ్‌లో పాక్ ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా లేకుండా బరిలోకి దిగింది. పిచ్‌ను అంచనా వేయడంలో దారుణంగా విఫలమైన పాక్ మేనేజ్మెంట్ ఏకంగా నలుగురు స్పెషలిస్ట్ పేసర్లను బరిలోకి దించి చేతులు కాల్చుకుంది. పై పేర్కొన్న కారణాలన్నింటినీ తమకు అనుకూలంగా మార్చుకున్న బంగ్లాదేశ్ పాక్‌ను వారి సొంతగడ్డపై చావుదెబ్బకొట్టింది. టెస్ట్‌ల్లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది తొలి విజయం. పాక్‌ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టు బంగ్లాదేశే కావడం మరో విశేషం.బంగ్లా చేతిలో ఘోర పరాజయం నేపథ్యంలో ఆ దేశ మాజీలు పాక్ జట్టును తూర్పారబెడుతున్నారు. షాహిద్ అఫ్రిది, రమీజ్ రజా.. ఇలా ప్రతి ఒక్కరు పాక్ జట్టుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. చాలామంది పాక్ వ్యూహాలను తప్పుబడుతున్నారు. రమీజ్ రజా లాంటి వారైతే పాక్ జట్టు ఎంపికనే ఘోర తప్పిదమని మండిపడుతున్నాడు. రావల్పిండి లాంటి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌పై నలుగురు ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేయడంలో అంతర్యమేమిటని ప్రశ్నించాడు. జట్టులో ఒక్క స్పిన్నర్‌ను కూడా ఎంపిక చేయనప్పుడే పాక్ ఓడిందని అన్నాడు. పాక్ కోల్పోయిన 16 వికెట్లలో బంగ్లా స్పిన్నర్లు తొమ్మిదింటిని పడగొట్టారని గుర్తు చేశాడు.పాక్ దారుణ ఓటమి అంశాన్ని రమీజ్ రజా టీమిండియాతో ముడిపెట్టాడు. భారత్ వల్లే సుదీర్ఘ ఖ్యాతి కలిగిన పాక్ పేస్ బౌలింగ్ అటాక్ లయ తప్పిందని అన్నాడు. గతేడాది ఆసియా కప్‌లో టీమిండియా బ్యాటర్లు పాక్ బౌలర్లపై పైచేయి సాధించారు. అప్పటి నుంచి ఆ జట్టు పేస్ బౌలింగ్ విభాగం సర్వ సాధారణంగా మారిపోయిందని అన్నాడు. అప్పడే పాక్ పేస్ బౌలింగ్ పతనం ప్రారంభమైందని తెలిపాడు. నాటి నుంచి పాక్ పేసర్ల రహస్యాలు బహిర్గతమై మిగతా బ్యాటర్లు సులువుగా ఎదుర్కొంటున్నారని అన్నాడు. పాక్ ఓటమికి రమీజ్ టీమిండియాను కారణంగా చూపించడంపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. మరికొందరేమో భారత్ దెబ్బ పడితే ఇలాగే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.కాగా, బంగ్లాతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 30న ఇదే వేదికగా జరుగనుంది.స్కోర్ వివరాలు..పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 (సౌద్ షకీల్ 141, మొహమ్మద్ రిజ్వాన్ 171 నాటౌట్, హసన్ మహమూద్ 2/70)బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 (ముష్ఫికర్ అహ్మద్ 191, షడ్మాన్ ఇస్లాం 93, నసీం షా 3/93)పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 146 (మొహమ్మద్ రిజ్వాన్ 51, మెహిది హసన్ 4/21)బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 30/0 (జకీర్ హసన్ 15 నాటౌట్) -
పీఎస్ఎల్కే 'దిక్కు దివాణం' లేదు.. మరో లీగ్ అవసరమా!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఒక్కోసారి పాకిస్తాన్ జట్టులాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. పిచ్చి పిచ్చి నిర్ణయాలతో ఆటగాళ్లను గందరోగోళానికి గురి చేయడం వాళ్లకు అలవాటే. చిరకాల ప్రత్యర్థిగా చెప్పుకునే టీమిండియాను నడిపించే బీసీసీఐ ఏం చేస్తే.. దానికి రివర్స్‌గా వ్యవహరిస్తుంటుంది పీసీబీ. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరున్న ఐపీఎల్‌ను బీసీసీఐ ప్రవేశపెట్టగానే.. దానికి పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)ను తీసుకొచ్చింది. అయితే ఐపీఎల్ స్థాయిలో పీఎస్ఎల్లో అంతగా ఆదరణ పొందలేకపోయింది. అయినప్పటికి పీఎస్ఎల్ ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. పీఎస్ఎల్కే ఆదరణ అంతంతగా ఉంటే తాజాగా పాకిస్తాన్ జూనియర్ లీగ్(పీజేఎల్) పేరుతో పీసీబీ మరొక కొత్త లీగ్‌ను ప్రవేశపెట్టనుంది. అక్టోబర్ 6న లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా పీజేఎల్ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పీసీబీ భావిస్తోంది. అయితే ఈ పీజేఎల్ టోర్నీకి విదేశాలకు చెందిన వివిధ బోర్డులు, క్లబ్స్, ప్రొఫెషనల్ లీగ్స్ నుంచి దాదాపు 140 మంది విదేశీ ప్లేయర్లు లీగ్‌లో ఆడడానికి తమ పేరును దరఖాస్తూ చేశారని పీసీబీ పేర్కొంది. టోర్నమెంట్ డైరెక్టర్ నదీమ్ ఖాన్ మాట్లాడుతూ..'' పాకిస్తాన్ జూనియర్ లీగ్(పీజేఎల్)కు మద్దతు తెలిపిన పలు క్రికెట్ బోర్డులకు మా ధన్యవాదాలు. జూనియర్ క్రికెట్ నుంచే సీనియర్ స్థాయికి వెళ్లేదన్న విషయం మరవద్దు. అందుకే జూనియర్ స్థాయిలో ఆటగాళ్లకు ఫౌండేషన్ బలంగా ఉండాలనే అభిప్రాయంతో పీజేఎల్ను ఏర్పాటు చేశాము. విదేశాలకు చెందిన జూనియర్ క్రికెటర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. పాకిస్తాన్లో క్రికెట్‌కు ఎంత ఆదరణ ఉందనేది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా పాకిస్తాన్ జూనియర్ లీగ్(పీజేఎల్)కే భారత్ మినహా మిగతా ఎనిమిది టెస్టు హోదా కలిగిన దేశాల నుంచి విరివిగా నామినేషన్స్ వచ్చాయని.. వీటితో పాటు ఆస్ట్రియా, బెల్జియం, బెల్జియం, కెనడా, డెన్మార్క్, నేపాల్, సౌదీ అరేబియా, సింగపూర్ లాంటి సభ్య దేశాల నుంచి కూడా చాలా మంది ఆటగాళ్లు తమ పేర్లను పంపించినట్లు పీసీబీ తెలిపింది.కాగా 2003 సెప్టెంబర్ 1 తర్వాత పుట్టిన ఆటగాళ్లకు మాత్రమే పాకిస్తాన్ జూనియర్ లీగ్(పీజేఎల్)లో ఆడే అవకాశమున్నట్లు పీసీబీ తెలిపింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త లీగ్‌ను ఏర్పాటు చేయడంపై క్రికెట్ ఫ్యాన్స్ నుంచి విభిన్న వాదనలు వచ్చాయి. ''పీఎస్ఎల్కే దిక్కు దివానం లేదు.. మరో కొత్త లీగ్ అవసరమా.. క్రికెట్లో పెద్దన్నలా భావించే బీసీసీఐకి పోటీగా ఏ టోర్నీని ప్లాన్ చేసినా అది వ్యర్థమే అవుతుంది.'' అంటూ పేర్కొన్నారు. చదవండి: Asia Cup 2022: ఆసియా కప్ 15వ ఎడిషన్ పూర్తి షెడ్యూల్, ఇతర వివరాలు Asia Cup 2022: అర్హత సాధించామన్న ఆనందం.. 'కాలా చష్మా'తో దుమ్మురేపారు -
ఇకపై పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ కోచ్ కూడా...
పాకిస్తాన్ పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ కోచ్ పదవి కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దరఖాస్తులను ఆహ్వానించింది. అదే విధంగా లహోర్‌లోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో వివిధ కోచ్ పదవిల కోసం కూడా పీసీబీ దరఖాస్తులను ఆహ్వానించింది. కాగా ఇప్పటివరకు పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ కోచ్ ఏ జట్టుకు లేరు. అయితే ఆధునిక క్రికెట్‌కు అనుగుణంగా తమ ఆటగాళ్లను సన్నద్దం చేయడానికే పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ కోచ్‌ను నియమిస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా తెలిపారు. ఇక హై ఫార్మమన్స్ కోచ్ పదవికు గల అర్హతలను పీసీబీ ప్రకటించింది."గత 10 సంవత్సరాలలో కనీసం ఐదేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. అంతేకాకుండా జాతీయ లేదా అంతర్జాతీయ జట్లకు లైఫ్ కోచ్‌గా పని చేసి ఉండాలి. మిగితా నాలుగు కోచ్‌లకు గత10 సంవత్సరాలలో కనీసం ఐదేళ్ల మూడవ స్థాయి క్రికెట్ కోచింగ్ అక్రిడిటేషన్‌లో పని చేసి వుంటే చాలు" అని పీసీబీ పేర్కొంది. చదవండి: IND Vs SA ODI Series: టీమిండియా వన్డే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ -
పాకిస్థాన్ బ్యాట్స్ మన్ పై ఆగ్రహం
కరాచీ: తన బ్యాటింగ్ స్థానం మార్చడంపై మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కు ఫిర్యాదు చేసిన పాకిస్థాన్ బ్యాట్స్ మన్ ఉమర్ అక్మల్ పై టీమ్ మేనేజ్ మెంట్ ఆగ్రహంగా ఉంది. తనను బ్యాటింగ్ ఆర్డర్ లో కిందకు పంపించడంపై అసంతృప్తిగా ఉన్న అక్మల్ ఈ విషయమై ఇమ్రాన్ కు ఫిర్యాదు చేశాడు. తనను టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు పంపాలని కెప్టెన్(ఆఫ్రిది)కి చెప్పాలని ఇమ్రాన్ కు అక్మల్ మొరపెట్టుకున్నాడు. ఇమ్రాన్ తో అక్మల్ మాట్లాడుతున్న వీడియోను వార్తా చానళ్లు ప్రసారం చేశాయి. అక్మల్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపాలని ఇమ్రాన్ సూచించాడు. అక్మల్ తీరుపై మాజీ కెప్టెన్ రమీజ్ రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇమ్రాన్ ను ఎప్పుడు కలిసినా తన బ్యాటింగ్ ఆర్డర్ గురించే అక్మల్ ఫిర్యాదు చేయడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. తర్వాతి మ్యాచ్ లో అతడికి చోటు దక్కకపోవచ్చని అన్నాడు. కోల్ కతాలో ఉన్న పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ కూడా అక్మల్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. టీ-20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ ఆడిన గత రెండు మ్యాచుల్లో అక్మల్ ను లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు పంపారు. కాగా, గతంలోనూ పలుమార్లు క్రమశిక్షణ ఉల్లంఘించి అక్మల్ జరిమానా ఎదుర్కొన్నాడు.