సాక్షి, హైదరాబాద్: రోజువారి జీవన విధానంలో భాగంగా వివిధ రూపాల్లో పెరిగిన ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించేందుకు స్వీయ నియంత్రణ కీలకంగా మారింది. ప్రధానంగా ఒకసారి వాడి పారేసే ‘యూజ్ అండ్ త్రో’, ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’వస్తువులతోనే సమస్య తీవ్రత పెరిగింది. దళసరికాగితం, నార(జ్యూట్), గుడ్డలతో తయారు చేసిన సంచుల ద్వారా ప్రస్తుతం సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌కు, ఇతర ప్లాస్టిక్ వస్తువులకు చెక్ చెప్పే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒకసారి విని యోగించిన ప్లాస్టిక్ సీసాలు, ఇతర వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేస్తుండడంతో వాటి వల్ల పర్యావరణానికి, జీవవైవిధ్యానికి ఎక్కువ నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నియంత్రణకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) నడుం బిగించింది. పీసీబీ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హి సేవా’పేరిట ఈ నెలలో మొదలుపెట్టిన కార్యక్రమంలో భాగంగా ‘ప్లాస్టిక్ వేస్ట్ శ్రమదాన్’నినాదంతో ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఈ నెల 27 వరకు వివిధరూపాల్లో కార్యాచరణను చేపట్టనున్నారు.
బుధవారం నుంచి హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆటోల ద్వారా ఒకమారు వినియోగించిన ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ప్రచారంతోపాటు, బాటిళ్లు ఇతరవస్తువుల సేకరణకు ప్లాస్టిక్ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మళ్లీ వాటిని పున ర్వినియోగంలోకి తెచ్చేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ప్రైవేట్‌సంస్థలు రూపొందించిన ‘రీ సై కాల్’ యాప్ ద్వారా ప్లాసిక్‌వ్యర్థాల సేకరణను చేపట్టి రీసైక్లింగ్ ద్వారా సిమెంట్ ఉత్పత్తి కర్మాగారాల్లో దానిని వినియోగించేలా చర్యలు తీసుకుంటోంది. ఇంటివద్దే ప్లాస్టిక్ వ్యర్థాలను విడదీసి దగ్గర్లోని సేకరణ కేంద్రాల్లో అందజేస్తే, వాటిని రీసైక్లింగ్‌కు, లేదా ధ్వంసం చేసేందుకు పంపిస్తారు. క్యారీ బ్యాగ్‌లు, కప్‌లు, స్ట్రాలు, కట్లరీ వంటి సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వల్ల పర్యా వరణానికి జరిగే నష్టాన్ని వివిధ సాధనాల ద్వారా వివరించేందుకు పీసీబీ ఏర్పాట్లు చేసింది.అక్టోబర్ 1–7 తేదీల మధ్య ఎఫ్‌ఎం రేడియో కార్యక్రమాల ద్వారా, 35 లక్షల మందికి ఎస్‌ఎంఎస్‌లు పంపించడం ద్వారా, కరపత్రాల పంపిణీ, తదితర రూపా ల్లో ప్రచార, ప్రజాచైతన్య కార్యకమాలు నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment