Kieron Pollard Birthday: వరల్డ్‌ కప్‌తో అరంగేట్రం! - Sakshi
Sakshi News home page

HBD Pollard: వరల్డ్‌ కప్‌తో అరంగేట్రం!

Published Wed, May 12 2021 10:20 AM | Last Updated on Wed, May 12 2021 4:14 PM

Kieron Pollard Birthday Special Mumbai Indians And Fans Pour Wishes - Sakshi

వెస్టిండీస్‌: విండీస్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ పుట్టినరోజు నేడు. నేటితో అతడు 34వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ క్రమంలో సహచర ఆటగాళ్లు, ముంబై ఇండియన్స్‌, అభిమానుల నుంచి పొలార్డ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా.. ఈ విధ్వంసకర క్రికెటర్ గురించి ఆసక్తికర అంశాలు మీకోసం..

పొలార్డ్‌ 1987, మే12న ట్రినిడాడ్‌లోని టకరిగ్వాలో జన్మించాడు.
2007 వరల్డ్‌ కప్‌ టోర్నీలో భాగంగా ఏప్రిల్‌ 10న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు.
ఇప్పటివరకు 116 వన్డేలు ఆడిన పొలార్డ్‌ 2564 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 
ఇక బౌలింగ్‌ విషయానికొస్తే.. వన్డేల్లో 54 వికెట్లు పడగొట్టాడు.
ప్రస్తుతం అతడు వెస్టిండీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్నాడు.

2008లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌తో పొలార్డ్‌ పొట్టి ఫార్మాట్‌లో ఎంట్రీ ఇచ్చాడు.
ఇప్పటివరకు 79 అంతర్జాతీయ టీ20లు ఆడిన పొలార్డ్‌ 1277 పరుగులు చేశాడు. 37 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ముంబై ఇండియన్స్‌ తరఫున 2010లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అడుగుపెట్టిన పొలార్డ్‌ .. టోర్నీలో ఇప్పటిదాకా 171 మ్యాచ్‌లు ఆడి 3191 పరుగులతో సత్తా చాటాడు. 
ఐపీఎల్‌లో 63 వికెట్లు తీసి తాను ప్రాతినిథ్యం వహించిన జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
పొలార్డ్‌ ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడుతున్నాడు. కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌-2021 నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో ఇంటి బాటపట్టాడు.
ఆరు సిక్సర్లతో సంచలనం

శ్రీలంకతో ఇటీవల జరిగిన టీ20 మ్యాచ్‌లో కీరన్‌ పొలార్డ్‌ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన మూడో క్రికెటర్‌గా ఖ్యాతిగడించాడు. అదే విధంగా ట్వంటీ ట్వంటీల్లో ఈ రికార్డు నమోదు చేసిన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement