
Courtesy: IPL Twitter
పొలార్డ్ కోపంగా ప్రసిధ్ కృష్ణ వైపు చూస్తూ తర్వాతి ఓవర్‌లో చూసుకుంటా
Kieron Pollard Vs Prasidh Krishna.. టి20 అంటేనే క్షణాల్లో మారిపోయే ఆట.. కసిగా కొట్టాలని బ్యాటర్ భావిస్తే.. పరుగులు ఇవ్వకూడదని బౌలర్ అనుకుంటాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో ముంబై ఇండియన్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్, ప్రసిధ్ కృష్ణ మధ్య కొన్ని సెకన్ల పాటు మాటల యుద్దం చోటుచేసుకుంది. ప్రసిధ్ కృష్ణ పొలార్డ్‌కు దమ్కీ ఇద్దామని భావించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ చివరి బంతిని ఆఫ్‌స్టంప్ మీదుగా విసిరాడు. బంతిని డిఫెన్స్ చేద్దామనే ప్రయత్నంలో పొలార్డ్ ప్రసిధ్ వైపు కొట్టాడు. అయితే బంతిని అందుకున్న ప్రసిధ్ పొలార్డ్ వైపు విసురుదామనుకొన్నాడు కానీ బంతి చేజారింది.
చదవండి: IPL 2021: కేకేఆర్‌కు భారీ షాక్.. కెప్టెన్‌తో పాటు ఆటగాళ్లకు కూడా భారీ జరిమానా
అంతే పొలార్డ్ కోపంగా ప్రసిధ్ కృష్ణ వైపు చూస్తూ తర్వాతి ఓవర్‌లో చూసుకుంటా.. అంటూ బ్యాట్‌ను కొడుతూ కౌంటర్ ఇచ్చాడు. మళ్లీ 18వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన ప్రసిధ్‌కు పొలార్డ్ తన పవరేంటో చూపించాడు. వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. ఈ దెబ్బకు ప్రసిధ్‌కు దిమ్మతిరిగి మూడు వైడ్స్, ఒక నో బాల్ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్‌లో కేకేఆర్ ముంబైపై ఘన విజయాన్ని సాధించింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 15.1 ఓవర్లలోనే చేధించింది. వెంకటేశ్ అయ్యర్(53), రాహుల్ త్రిపాఠి(74 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా.. ముంబై మరో ఓటమితో ఆరో స్థానానికి చేరుకుంది.
చదవండి: Aakash Chopra: నీకు స్పీడ్ ఎక్కువైంది.. చలాన్లు పడుతాయేమో చూసుకో
— pant shirt fc (@pant_fc) September 23, 2021