
వెస్టిండీస్ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ సరికొత్త అవతారం ఎత్తాడు. సాదారణంగా మీడియం పేస్ బౌలింగ్ చేసే పొలార్డ్.. తొలి సారి స్పిన్నర్‌గా మారాడు. ట్రినిడాడ్ టీ10 బ్లాస్ట్‌లో భాగంగా స్కార్లెట్ ఐబిస్ స్కార్చర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోకా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ అందరనీ ఆశ్చర్య పరిచాడు. సోకా కింగ్స్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన పొలార్డ్ స్పిన్ బౌలింగ్ చేయడమే కాకుండా.. బ్యాటర్ లియోనార్డో జూలియన్‌ను క్లీన్ బౌల్డ్ కూడా చేశాడు.ఈ మ్యాచ్‌లో కేవలం ఒకే ఓవర్ బౌలింగ్ చేసిన పొలార్డ్ 10 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
కాగా పొలార్డ్ బౌలింగ్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మంబైకు కొత్త స్పిన్నర్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సోకా కింగ్స్ నిర్ణీత 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. అయితే వర్షం కారణంగా టార్గెట్‌ను 8 ఓవర్లకు 122 పరుగులకు కుదించారు. ఇక 122 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కార్చర్స్ మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులకు మాత్రమే పరిమితమైంది. అయితే స్కార్చర్స్ కెప్టెన్ పొలార్డ్ మాత్రం కేవలం 8 పరుగుల మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్‌కు పొలార్డ్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Kieron Pollard bowling off-spin in the Trinidad T10 Blast.pic.twitter.com/rN0mq04II8
— Johns. (@CricCrazyJohns) February 28, 2022