
వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని అందరని షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు, కేకేఆర్ విధ్వంసకర ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ .. కీరన్ పొలార్డ్ ఆకస్మిక రిటైర్మెంట్ పట్ల నిరాశను వ్యక్తం చేశాడు.అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న పొలార్డ్ ఇకపై దేశవాళీ టోర్నీల్లో మాత్రం ఆడనున్నాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున పొలార్డ్ ఆడుతున్నాడు. పొలార్డ్ విండీస్ తరపున 123 వన్డేలు, 101 టీ20ల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
"పొలార్డ్ తీసుకున్న నిర్ణయం నన్ను షాక్‌కు గురి చేసింది. అయితే అతడు మరి కొంత కాలం విండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఉంటే బాగుండేది. అతడు జట్టుకు చేయవలిసింది ఇంకా చాలా ఉంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న పొలార్డ్.. తన భవిష్యత్తులో ఏ టోర్నమెంట్‌లో ఆడినా అద్భుతంగా రాణించాలని ఆశిస్తున్నాను" నరైన్ అని పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: లంక యువ పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఆడమ్ మిల్నే స్థానంలో సీఎస్‌కేలోకి ఎంట్రీ