IPL 2022 Auction- Mumbai Indians: టీ20 ప్రపంచకప్-2021 జరుగుతున్న సమయంలోనే జట్టుకు దూరం..... డిసెంబరులో పాకిస్తాన్ పర్యటనకు గైర్హాజరు.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స... పర్లేదనిపించాడు... తర్వాత భారత్ టూర్‌కు విచ్చేశాడు.. టీమిండియాతో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో పూర్తిగా విఫలం... రెండో వన్డేకు దూరం.. అవును... ఈ ఉపోద్ఘాతమంతా వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ గురించే.
34 ఏళ్ల ఈ ‘భారీ హిట్టర్’ ఇటీవలి కాలంలో తరచూ గాయాల బారిన పడుతున్నాడు. ఫిట్‌నెస్ లేమి కారణంగా పలు సందర్భాల్లో జట్టుకు దూరమయ్యాడు. భారత్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లోనూ పొలార్డ్ ఆడలేదు. అతడి స్థానంలో నికోలస్ పూరన్ జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే, అప్పటికే 1-0 తేడాతో వెనుకబడి ఉన్న విండీస్.. భారత బౌలర్లు చెలరేగడంతో ఈ మ్యాచ్‌లోనూ ఓడి సిరీస్‌ను సమర్పించుకుంది. తద్వారా 19 ఏళ్ల తర్వాత భారత గడ్డపై వన్డే సిరీస్ గెలవాలన్న ఆశ నిరాశే అయ్యింది.
Series lost, but the boys go again on Friday in the final ODI with the opportunity to gain some World Cup qualification points. #MenInMaroon #INDvWI pic.twitter.com/Ah8U8XAnzt
— Windies Cricket (@windiescricket) February 9, 2022
ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే... కెప్టెన్ పొలార్డ్ ఫిట్‌నెస్ గురించే ముంబై ఇండియన్స్ అభిమానులు కలవరపడుతున్నారు. ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ(రూ. 16 కోట్లు) సహా ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 8 కోట్లు) , కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు)ను అట్టిపెట్టుకుంది.
కానీ పొలార్డ్ తరచూ గాయం కారణంగా జట్టుకు దూరం కావడం, బ్యాటింగ్‌లో కూడా అంతగా మెరుపులు లేకపోవడంతో ముంబై.. అతడిని రిటైన్ చేసుకుని పెద్ద తప్పు చేసిందా అనే చర్చ మొదలైంది. అదే విధంగా... విధ్వంసకర యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను వదిలేయడంపై ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఇషాన్‌ను పక్కనపెట్టడం, పొలార్డ్ రిటైన్ చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం జరుగనుంది. కాగా భారత్‌తో తొలి వన్డేలో పొలార్డ్ డకౌట్ అయిన విషయం తెలిసిందే.
మరోవైపు.. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నారు.విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో సూర్యకుమార్ 83 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలో తొలి ఆరు మ్యాచ్‌ల్లో 30కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
చదవండి: Surya Kumar Yadav: వన్డే క్రికెట్ చరిత్రలో ఆ రికార్డు సాధించిన ఒకే ఒక్కడు
Comments
Please login to add a commentAdd a comment