IND Vs WI Series: Kieron Pollard Says playing against Rohit Sharma led team will be special - Sakshi
Sakshi News home page

IND vs WI: ఇప్పుడు ఇంగ్లండ్ పని అయిపోయింది.. త‌రువాత టీమిండియానే: పొలార్డ్‌

Published Mon, Jan 31 2022 9:57 AM | Last Updated on Mon, Jan 31 2022 11:52 AM

looking forward to India series, playing against Rohit Sharma led team will be special Says Kieron POllard - Sakshi

Wi Vs Eng T20I: స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన 5 టీ20ల‌ సిరీస్‌ను 3-2 తేడాతో వెస్టిండీస్ కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కాగా త్వ‌ర‌లో టీమిండియాతో జ‌ర‌గ‌బోయే ప‌రిమిత ఓవ‌ర్ల‌  సిరీస్‌పై కీరన్ పొలార్డ్ సారథ్యంలోని విండీస్ జట్టు ఇప్పుడు క‌న్ను వేసింది. ఇంగ్లండ్‌తో ఐదో టీ20 అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ కీల‌క వాఖ్య‌లు చేశాడు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జ‌ట్టుతో ఆడడం త‌నకు చాలా ప్రత్యేకమైనది పొలార్డ్ తెలిపాడు.

"ఇంగ్లండ్‌పై మాకు ఇది అద్భుత విజయం. ఇప్పుడు మేము భార‌త పర్య‌ట‌న‌పై దృష్టిసారిస్తాం. మేము ఈ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియాపై కచ్చితంగా విజ‌యం సాధిస్తాం. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాతో ఆడ‌డానికి అతృత‌గా ఎదురు చూస్తున్నాం" అని పొలార్డ్ పేర్కొన్నాడు.  ఇక భార‌త‌ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా విండీస్ జ‌ట్టు మూడు వ‌న్డేలు, టీ20లు ఆడ‌నుంది. ఇక ఆహ్మ‌దాబాద్ వేదిక‌గా ఫిబ్ర‌వ‌రి 6న తొలి వ‌న్డే జ‌ర‌గ‌నుంది. కాగా ఐపీఎల్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలో ముంబై ఇండియన్స్ తరఫున  పొలార్డ్ ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఐపీఎల్‌-2022 మెగా వేలం ముందు ముంబై ఇండియన్స్ పొలార్డ్‌ను రీటైన్ చేసుకుంది.

చ‌ద‌వండి: ENG vs WI: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. సంచ‌ల‌నం సృష్టించిన జాసన్ హోల్డర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement