
Courtesy: IPL
Kieron Pollard Scripts History In T20 Cricket: టీ20ల్లో వెస్టిండీస్ విద్వంసకర ఆల్ రౌండర్ కిరాన్ పొలార్డ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 300 వికెట్లతో పాటు పది వేలు పరగులు సాధించిన ఏకైక ఆటగాడుగా పొలార్డ్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌లో భాగంగా ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 7 ఓవర్ వేసిన పొలార్డ్.. ఓకే ఓవర్లోయూనివర్స్‌ల్ బాస్ క్రిస్ గేల్, కెప్టెన్ కెఎల్ రాహుల్ ను పెవిలియన్‌కు పంపి ఈ ఘనతను సాధించాడు. అయితే కాగా ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 175 మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్ 2037 పరుగులు, 65 వికెట్లు పడగొట్టాడు.
కాగా ఐపీఎల్ రెండో దశలో వరుస అపజయాలతో డీలా పడ్డ ముంబై.. పంజాబ్‌పై విజయంతో తిరిగి ట్రాక్‌లో పడింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మార్క్‌రమ్ 42 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. సౌరభ్ తివారి (37 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించారు.
చదవండి: Chris Gayle: వయసు మీద పడుతున్న సింహం లాంటివాడే.. కానీ
Comments
Please login to add a commentAdd a comment